క్లారీటీలేని కేంద్రం సమాధానం: మాకే అనుకూలం అనుకుంటున్న పార్టీలు

tdp former mla ready join to ysrcp
Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయంపై గతకొంతకాలం రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం మూడు రాజధానులు అమలు చేయాలనే చూస్తుంటే….ప్రతిపక్ష టీడీపీ మాత్రం మూడు వద్దు…అమరావతినే కావాలంటూ పోరాటాలు చేస్తుంది. ఇక వీరి మధ్య ఏపీ ప్రజలు ఎలాంటి క్లారీటీ లేకుండా పోయారు. అయితే ఏపీలో నెలకొన్న అనిశ్చితికి కేంద్రం కూడా సరైన క్లారీటీ ఇవ్వలేదు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్న విధంగా తన సమాధానం చెప్పింది.

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సభలో లేవనెత్తిన ప్రశ్నకు సమాధానం చెప్పింది కేంద్రం. అందులో రాజధాని అమరావతిని నోటిఫై చేశారని చెప్పింది. రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోనిదని చెప్పింది . ఇంతకీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేసినప్పుడు రాజధాని అమరావతినేనా ? లేకా సీఎం జగన్ తాజాగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం రాజధాని వ్యవహారం రాష్ట్రాల పరిధిలోదే అని చెప్పినందుకు రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని తాము మార్చలేమని చెప్పటమా ? అన్నది ఏ మాత్రం అర్ధం కాకుండా సమాధానం ఇచ్చారు. దీంతో సమస్య మరింత జఠిలం అయింది

ఏపీ రాజధాని వ్యవహారంపై కేంద్రమంత్రి చాలా క్లుప్తంగా సమాధానం ఇచ్చారు. దాని ప్రకారం.. 2015లో రాజధానిగా అమరావతి నోటిఫై చేశామని ఆయన పేర్కొన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీతో పాటు అమరావతి మద్దతుదారులు ఈ పాయింట్ కీలకం అని దీనినే ప్రస్తావిస్తూ రాజధాని అమరావతినే అని కేంద్రం చెప్పిందని చెప్తున్నారు. రాజధానిగా అమరావతిని గుర్తించారని ఇప్పుడు తరలించాడనికి అవకాశం లేదని వారు వాదన. మూడు రాజధానులను ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన సమాధానం చెంప పెట్టు లాంటిదని వారు అంటున్నారు. ఒక సారి నోటిఫై అయిన రాజధానిని మార్చే హక్కు లేదని కేంద్రం లిఖితపూర్వకంగా చెప్పిందని వారు చెప్పుకుంటున్నారు .

ఇక మరో పాయింట్ చెప్పిన కేంద్రం రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనని పేర్కొంది. అంటే రాజధాని వ్యవహారంలో కేంద్ర సర్కార్ జోక్యం చేసుకోడాని, రాష్ట్రాలదే నిర్ణయాధికారం అన్న భావన ఈ వ్యాఖ్యల ద్వారా అర్ధం చేసుకున్న వైసీపీ మూడు రాజధానుల విషయంలో కేంద్రం కూడా సానుకూలంగా ఉన్నట్టు, మూడు రాజధానులకు ఓటేసినట్టు ప్రచారం చేసుకుంటుంది . రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదని, అంతా తమ ఇష్టమని వైసీపీ నేతలు చెప్పటం గమనార్హం. మొత్తానికి ఈ రాజధాని అంశం ఎప్పటికీ ముగుస్తుందో అర్ధం కాకుండా ఉంది

 

Leave a Reply