కాకినాడలో పెట్రో కాంప్లెక్స్…కడపలో స్టీల్ ప్లాంట్….భారీగా పెట్టుబడులు వస్తాయా?

central government assured-ap-govt-on-establishment-of-petro-chemical-complex and kadapa steel plant
Share Icons:

అమరావతి: ఇప్పటివరకు సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలని పొందుతున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిపై ఫోకస్ చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు.  అందులో భాగంగా కాకినాడలో పెట్రో కాంప్లెక్స్, కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే దీని గురించి జగన్…. కేంద్ర పెట్రోలియం..సహజవాయువు.. ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో చర్చించారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల పైన చర్చలు చేసారు. కడప జిల్లాలో నిర్మించతలపెట్టిన స్టీల్‌ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుపఖనిజం సరఫరాపై ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై ధర్మేంద్ర ప్రదాన్‌ సానుకూలంగా స్పందించారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌ పునర్వివిభజన చట్టం ప్రకారం క్రూడాయిల్‌ రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాల్సి ఉందని, కాకినాడలో ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ అధికారులు కేంద్రమంత్రికి విజ్ఞప్తిచేశారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పెట్రోలియంశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాట చేస్తామని వెల్లడించారు. కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని ధర్మేంద్ర ప్రదాన్‌ హామీ ఇచ్చారు.

విశాఖలో విస్తరణ ప్రాజెక్టుల ద్వారా, కాకినాడలో పెట్రోకాంప్లెక్స్‌ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ రూపంలో భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రదాన్‌ వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఏపీ ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌తో ఉందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం బైరవపాలెంలో జీఎస్‌పీసీ లిమిటెడ్‌ నిర్వహించిన ఆఫ్‌షోర్‌ డ్రిల్లింగ్‌ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరుచేయాలని విజ్ఞప్తిచేయగా….కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మజూరు చేయాలని ఓ‌ఎన్‌జి‌సి అధికారులని కోరారు.

అదేవిధంగా చమురు, గ్యాస్‌ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్టుగా సీఎస్‌ఆర్‌ నిధులు ఇవ్వాలంటూ చేసిన విజ్ఞప్తిపైనా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్‌ మేరకే సీఎస్‌ఆర్‌ వచ్చేలా చూస్తామని కేంద్రమంత్రి స్పష్టంచేశారు. ఇక ఈ భేటీ బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో ఏపీకి భారీగానే పెట్టుబడులు వచ్చేలా కనిపిస్తున్నాయి.

 

Leave a Reply