సెన్సార్‌పై సెన్సార్‌!

Share Icons:

సెన్సార్‌పై సెన్సార్‌!

సినిమా మ‌న జీవితాల‌పై అంత ప్ర‌భావం చూపుతుందా? నిజంగా సినిమా మాధ్య‌మం జ‌న జీవితాల‌పై అంత‌గా ప్ర‌భావం చూపించే వీలుంటే మాన‌వ‌త్వం పెంపొందించుకోవాల‌ని, సాటి మ‌నిషికి సాయ‌ప‌డాల‌ని మ‌రి ఇత‌ర సందేశాల‌తో ఎన్ని సినిమాలు రావ‌డం లేదు.

మ‌రి వాటిని చూసి ఎవ‌రూ మార‌డం లేదే? అంతే కాదు నేరం చేస్తే శిక్ష త‌ప్ప‌దు అనే సందేశాన్ని కూడా చిత్రాలు ఇస్తున్నాయే మ‌రి వాటిని ప‌ట్టంచుకోరా?

మ‌నం మ‌ర‌చిపోయిన మ‌హ‌నీయుల జీవిత చ‌రిత్ర‌ను సినిమాలుగా తీశారే మ‌రి వాటి సందేశం ప్ర‌జ‌లు పాటిస్తున్నారా?

స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు, క్రీడాకారుల‌కు సంబంధించిన జీవితాల‌ను కూడా సెల్యులాయిడ్‌పై కి తెచ్చారు క‌దా మ‌రి వారి స్ఫూర్తితో ఎంద‌రు క్రీడాకారులుగా త‌యార‌య్యారు, ఎంద‌రు నిస్వార్ధంగా ఆలోచిస్తున్నారు?

ఇవ‌న్నీ కాదు కానీ కొన్ని సినిమాల్లో విచ్చ‌ల‌విడి హింస చూపిస్తారు.

మ‌రి కొన్నింటిలో దారుణ‌మైన సంఘ‌ట‌న‌లు చూపిస్తారు. మ‌రి స‌మాజంలోని అంద‌రూ క్రిమిన‌ల్స్‌గా మార‌డం లేదే!

స‌మాజంలో జ‌రిగే ప్ర‌తి ఘ‌ట‌న‌కు సినిమాను లేదా మాధ్య‌మాల‌ను బాధ్యుల్ని చేయ‌డం ప‌రిపాటిగా మారింది.

సినిమా ఎంతో ప్ర‌భావం చూపిస్తుంద‌ని చెప్పేమేధావులు ఎవ‌రూ కూడా రెగ్యుల‌ర్‌గా సినిమాలు చూసేవారు కాద‌నేది నా స్థిర‌మైన అభిప్రాయం.

క్ర‌మం త‌ప్ప‌కుండా సినిమాలు చూసే వారు ఆ సినిమాల‌ను విమ‌ర్శించ‌రు. ఎందుకంటే ఒక్క‌టే మూల సూత్రం.

ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందే సినిమాలు, ప్రేక్ష‌క ఆద‌ర‌ణ పొంద‌ని సినిమాలు అని రెండే కేట‌గిరిలు ఉంటాయి.

ప్రేక్ష‌క ఆద‌ర‌ణ పొందే సినిమాల్లో కూడా రెండు ర‌కాలు ఉంటాయి.

ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్ట‌నివి, తాత్కాలికంగా న‌చ్చి ఆ త‌ర్వాత మ‌ర‌చిపోయేవి.

విడుద‌ల అయ్యే చాలా సినిమాల‌ను ప్రేక్ష‌కుడు చూసి మ‌ర‌చిపోతుంటాడు.

ఇలాంటివేవీ ప‌ట్టంచుకోకుండా కొంద‌రు వ్య‌క్తులు కేవ‌లం రాజ‌కీయ కార‌ణాల‌తో సినిమాల‌ను అడ్డుకుంటున్నారు.

ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో సంబంధం లేకుండా వారే అది మంచి చిత్ర‌మా కాదా అనేది కొంద‌రు నిర్ణ‌యించేస్తున్నారు.

వివాదాల ప‌ద్మావ‌తి

అశేష ప్రేక్ష‌కులు ఏది చూడాలో వ‌ద్దో కూడా కొంద‌రు రాజ‌కీయ ప్రేరేపిత వ్యక్తులు, సంస్థ‌లు నిర్ణ‌యిస్తున్నాయి.

ఇది అనుమ‌తించ‌లేని విష‌యం. కోట్లాది రూపాయ‌ల పెట్టుబ‌డితో నిర్మించే సినిమాల‌ను కొంద‌రు వ్య‌క్తులు లేదా కొన్ని సంస్థ‌లు అడ్డ‌కో్వ‌డం త‌గ‌ని ప‌ని.

ప్ర‌స్తుతం ఈ అడ‌క‌త్తెర‌లో చిక్కిన చిత్రం ప‌ద్మావ‌తి.

ఈ చిత్రం పేరునే ప‌ద్మావ‌త్‌గా మ‌ర్చారు. ప‌ద్మావ‌తి లేదా ప‌ద్మావ‌త్ పేరు ఏదైనా విష‌యం ఒక్క‌టే. ఈ చిత్రంపై వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి.

సెన్సార్‌బోర్డు అనుమ‌తించిన త‌ర్వాత కూడా కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఈ చిత్రాన్ని త‌మ త‌మ రాష్ట్ర‌ల్లో నిషేధిస్తున్నాయి. ఇది అన్యాయం.

సెన్సార్‌ బోర్డు కొన్ని మార్పులు చేసి సినిమాకు సర్టిఫికేట్‌ ఇచ్చింది.

అయినప్పటికీ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు సినిమాపై నిషేధం విధించాయి.

ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు బుధవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సెన్సార్‌ బోర్డు అనుమతిచ్చాక సినిమాను అడ్డుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని తమ సినిమా అన్ని రాష్ట్రాల్లోనూ విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలు పిటిషన్‌ వేశారు.

మరోపక్క సినిమాను 25న కాకుండా 24న విడుదల చేయాలని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ నిర్ణయించినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో నటించిన దీపిక పదుకొణె, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లు ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు.

సినిమాకు సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు ఇచ్చినా విడుదలకు ముందు మరిన్ని తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయని చిత్రబృందానికి హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి.

ఇంత భ‌య‌ప‌డుతూ సినిమాలు నిర్మించాల్సి రావ‌డం శోచ‌నీయం.

చ‌రిత్ర‌కు సంబంధించిన సినిమాల్లో ఎంతో కొంత నాట‌కీయ‌త కోసం మార్పులు చేస్తారు.

అంత మాత్రాన చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించిన‌ట్లు కాదు. దాని వ‌ల్ల ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తినాల్సిన అవ‌స‌రం లేదు.

Leave a Reply