TRENDING NOW

సి‌బి‌ఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..

సి‌బి‌ఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల..

ఢిల్లీ, 29 మే:

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదలయ్యాయి.

ఈ ఫలితాల్లో 86.70 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇక వీటిల్లో 88.67 శాతంతో బాలికలు పైచేయి సాధించగా, బాలురు 85.32 శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు.

99.60 శాతం ఉత్తీర్ణతతో తిరువనంతపురం మొదటి స్థానంలో నిలిచింది.

జవహర్ నోవదయ విద్యాలయాలు 97.31 శాతం, కేంద్రీయ విద్యాలయాల్లో 95.96 శాతం ఉత్తీర్ణత వచ్చింది.

మొత్తం 500 మార్కులకు గానూ 4 విద్యార్థులకు 499 చొప్పున మార్కులు వచ్చాయి.

ఇక సీబీఎస్‌ఈ పది ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన సి‌బి‌ఎస్‌ఈ  పరీక్షల్లో అవకతవకలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇందులో 10వ తరగతి గణిత ప్రశ్నాపత్రం పరీక్ష ముందుగానే లీకైంది. అయితే ఆ పరీక్షను తిరిగి నిర్వహించబోమని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

మామాట: ఫలితాలను cbse.nic.in, cbseresults.nic.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: