నా తర్వాతే నరేంద్రమోదీ

Share Icons:

ఒకరు రెండెకరాల నుంచి ప్రధానులను, రాష్ట్రపతులను ఎంపికచేసే స్థాయికిఎదిగిన రైతుబిడ్డ. మరొకరు టి దుకాణం నుంచి నవభారత ప్రధానిగా ఎదిగిన గుజరాతీ.

 

[pinpoll id=”62678″]

 

దాదాపు నాలుగు దశాబ్ధాలుగా తెలుగువారి రాజకీయాలను ప్రభావితం చేస్తున్న చంద్రబాబు ప్రయాణం మొదటి నుంచి సవాళ్లను ఎదిరించి నిలవడంతోనే సాగుతోంది. ఇంత నిలకడగా ప్రజాప్రతినిధిగా, రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నవారు ఈనాడు దేశంలో చాలా తక్కువ మందే న్నారు.  ఇక పరిపాలనారంగంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా సుదీరఘమైన అనుభవం కలిగి ఉన్నారు. సీఎంగా, ప్రతిపక్షనేతగా, పార్టీ అధ్యక్షుడుగా మూడు ముఖ్యమయిన విభాగాలలో పదేళ్లకుపైగా అనుభవం ఉన్న రాజకీయ నేత  చంద్రబాబు మాత్రమే. ఇటీవలే దివంగతులైన డీఎంకే సారథి కరుణానిధి తరువాత అంతటి బలమైన కరికులంవైటా ఉన్నది చంద్రబాబుకే. అటువంటిది బాబు తరువాత రాజకీయాలలోకి వచ్చిన నరేంద్ర మోదీ వంటి వారు దేశ ప్రధాని కాగలిగారు. బాబు మాత్రం నాకు నా రాష్ట్రం చాలు అంటూ ఇక్కడే ఉండిపోయారు. ఇదే విషయాన్ని గురువారం విజయవాడ లో జరిగిన జ్ఞానభేరి సదస్సులో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా పేర్కొన్నారు. నా అనుభవమంత లేదు నీ వయస్సు అనే సినిమా డైలాగు లాగా ఉన్న ఈ వాఖ్యలను మీరు సమర్థిస్తారా.

ప్రధానిగా మోదీ దక్షిణాదిపై చూపుతున్న వివిక్ష తెలిసిందే. గుజరాత్ వంటి రాష్ట్రాలకు, శిలా విగ్రహాలకు ఇస్తున్న నిధులతో పోల్చినపుడు కేంద్రం ఏపీ రాష్ట్రానికి ఇస్తున్ననిధులు నామమాత్రంగా ఉన్నాయనీ, కనీసం ఏపీ ప్రజలు కడుతున్న పన్నలలో సరైన వాటా కూడా తిరిగి రాష్ట్రానికి రావడం లేదని చంద్రబాబు అంటున్నారు. ఒక జూనియర్ మరో సీనియర్ నేతతో ఆడుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇది ప్రజాస్వామ్యవిధానంలో సరైన పాలనా విధానంగా భావించ వచ్చా, రాష్ట్రాల హక్కులను కేంద్రం కాపాడలేనపుడు ఎవరైనా ఏమి చేయాలి?

మామాట:  సీనియారిటీనా ఫలితాలా ఏది ముఖ్యం ?

Leave a Reply