ఉదయం 8 గం. నుంచి చంద్రబాబు దీక్ష! దక్షత లేని దీక్ష అంటున్న కొడాలి నాని!

Share Icons:
  • టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా 36 గంటల దీక్ష
  • అమిత్ షా అపాయింట్ మెంట్ కోరిన చంద్రబాబు

వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయాలపై దాడులు  నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు సిద్ధమైయ్యారు. ఆయన మంగళగిరి లోని టీడీపీ కేంద్ర కార్యాలయం లో ధ్వంసం అయిన ఫర్నిచర్ మధ్యనే దీక్షను కొనసాగించనున్నారని తెలుగు దేశం వర్గాలు తెలిపాయి. దీనిపై కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆరా తీశాయి. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.

ఇప్పటికి అమిత్ షా అపాయింట్ మెంట్ ను చంద్రబాబు కోరారు. దీక్ష పూర్తీ అయిన తరువాత ఆయన నేరుగా ఢిల్లీ కి వెళ్లనున్నారు. అక్కడ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అయితే అమిత్ షా అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. దాన్ని భట్టి చంద్రబాబు ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటారు ఎవరెవరిని కలుస్తారు అనే విషయం ఆశక్తి రేపుతోంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అది దక్షత లేని దీక్ష: కొడాలి నాని 

  • చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మోదీ, అమిత్ షాకు తెలుసు
  • తిరుపతిలో అమిత్ షా మీద దాడి చేయించింది చంద్రబాబు
  • ఎ మొఖం పెట్టుకొని అమిత్ షా ను కలుస్తారు
  • పట్టాభి డబ్బులు తీసుకుని తిడుతున్నాడు
  • పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి తిట్టిస్తున్నారు

చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ పై మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. పక్కా ప్రణాళిక ప్రకారమే సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయించారని,. పట్టాభి డబ్బులు తీసుకుని తిడుతున్నాడని ఆరోపించారు. వైసీపీ శ్రేణులను కావాలనే రెచ్చగొడుతున్నారని, అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా జగన్ ను కదిలించలేరని అన్నారు. పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి చంద్రబాబు తిట్టిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనన,. సీఎం జగన్ ను పట్టాభి ఎంతో అవమానించారని అన్నారు.

తిరుమలకు వచ్చినప్పుడు అమిత్ షాపై చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని,. చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మోదీ, అమిషాకు ఎప్పుడో తెలుసని అన్నారు. ఇప్పుడు అమిత్ షాను కలుస్తానని చంద్రబాబు చెపుతున్నారని… ఏ మొహం పెట్టుకుని చంద్రబాబును కలుస్తారని ప్రశ్నించారు. అతను చేపట్టబోతున్న దీక్షకు లేదని బూతు రాజకీయాలు, వెన్నపోట్లు చంద్రబాబుకు కొత్త కాదని విమర్శించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply