సిబిఐ అలోక్ వర్మ సంచలన నిర్ణయం

Share Icons:

కొత్త ఢిల్లీ, జనవరి11,

సీబీఐ డైరెక్టర్‌గా   తప్పించి ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడంతో ఐపీఎస్ సర్వీసుల నుండే అలోక్ వర్మ తప్పుకొన్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఐపీఎస్ సర్వీసులకు ఆయన గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. మోదీ వ్యవహార శైలిపై పలువురు మండిపడ్డారు.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బుధవారం  అలోక్ వర్మ  తిరిగి సిబిఐ డెరెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు.  ఈ బాద్యతలు స్వీకరించిన తర్వాత  వర్మ ఐదుగురు ఉన్నతాధికారులను గురువారం  బదిలీ చేశారు. వారి స్థానంలో పాత టీమ్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకొన్నారు.

గురువారం సాయంత్రం కీలకమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. మోడీ అధ్యక్షతన సమావేశమైన హై పవర్ కమిటీ  అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించాలని నిర్ణయం తీసుకొంది. ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న  లోక్‌సభలో విపక్షనేత మల్లిఖార్జున ఖర్గే మాత్రం వర్మను తప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జస్టిస్ సిక్రీ మాత్రం  వర్మపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాలని పట్టుబట్టారు. మోడీ కూడ వర్మను తప్పించేందుకే మొగ్గు చూపారు. దీంతో వర్మను ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేశారు.

హై పవర్ కమిటీ నిర్ణయం కారణంగా  వర్మ   సీబీఐ డైరెక్టర్ పదవికి శుక్రవారం  రాజీనామా చేశారు. ఆయనను విధుల నుండి తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్ రావు రిలీవ్ చేశారు. మరో వైపు ఫైర్ సర్వీసెస్ లో వర్మ చేరేందుకు సుముఖత చూపలేదు. ఐపీఎస్ సర్వీసెస్ నుండి కూడ వర్మ తప్పుకొన్నారు. వాస్తవానికి అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్‌గా  ఈ నెల 30వ తేదీ వరకు పదవీ కాలం ఉంది. కానీ, ఈ లోపుగానే ఆయనను ఈ పదవి నుండి తప్పించారు.

మామాట: మోడీ జీ మీరు చేస్తున్నది  మంచిది కాదేమో కదా… 

Leave a Reply