కడుపు మంట -బైరాగి

కడుపుమంట… అనురాగం అంబరమైతే ఆనందం అర్ణవమైతే మేం తోకచుక్కగా వస్తాం బడబానలమై మండిస్తాం!! ప్రపంచమొక నందనవనమై జీవితమొక గులాబి ఐతే మేం ముళ్ళతొడుగుగా ఉంటాం సుఖస్వప్నం భంగపరుస్తాం!! …

పప్పు పౌష్టికాహారము

పప్పు-రాచ్చిప్ప-ముద్దకవ్వంల కలయిక అపూర్వం. పప్పును రాచ్చిప్పలో వేసి ముద్దకవ్వంతో ఎనిపితే ఆ రుచి అమోఘమని మా అమ్మమ్మ అంటుండేది. నాకు వంటచేయండం అంటే మహా ఇష్టం. ఈరోజు …

పెళ్లిళ్లు – ఈవెంట్ మేనేజ్‌మెంట్

పెళ్లిళ్లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఇటీవల కాలంలో ప్రతి చిన్న వేడుకైనా హంగూ ఆర్భాటాలతో నిర్వహించడం మామూలై పోయింది. దీంతో ఈ ఏర్పాట్లు, అతిథులకు రాచమర్యాదలు, అలంకరణ, భోజనవసతి, …

ఆత్మ విశ్వాసం:

ఆత్మ విశ్వాసం: ఆత్మవిశ్వాసం పెరగాలంటే ముందుగా ఎవరికి వాళ్ళౌ వాళ్ళని విశ్వసించాలి. ఆత్మ విశ్వాసం పెరగాలంటే అందుకు అనేక బలాలు దోహదం చెయ్యాలి. ముందుగా ఆలోచనా జ్ఞానం …

ఎవరు మన తొలి శత్రువులు!?

ఎవరు మన తొలి శత్రువులు – మలి శత్రువులు – మనః శత్రువులు..!? ఉమ్మడి కుటుంబాల నుండి ఒంటరి (1+1+1 or 2) కుటుంబాలకు కాలానుగుణంగా మనలో …

 పెరుగుతున్న పెళ్ళి ఖర్చు

 పెరుగుతున్న పెళ్ళి ఖర్చు ప్రతి ఒక్కరు తమ బిడ్డల పెళ్లి ఘనంగా జరిపించాలని అనుకుంటారు. అందుకోసం ఎంత ఖర్చైనా వెనకాడరు. ఆర్థిక స్థోమతను బట్టి లక్షల్లో ఖర్చు …

తమలపాకు తింటే… ఆ శక్తి పెరగుతుందట.

ఘంటాపథంగా చెబుతున్న ఆయుర్వేధ వైద్యులు రోజుకు ఎన్నితినాలి? పెరిగి పెద్దయ్యాక… తమలపాకు తినడం చాలా మందికి ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికీ పల్లెల్లో చాలా మంది వక్కాకు నములుతూనే …

రక్త హీనత తగ్గాలంటే-

శరీరంలో చాలినంత ర‌క్తం లేకపోతే రక్తహీనత (ఎనీమియా) వ‌స్తుంద‌ని అంద‌రికీ తెలిసిందే. దేహంలో తగినంత ఐరన్‌ లేకపోవడం, విటమిన్ లోపం కూడా రక్తహీనతకు ప్రధాన కారణాలుగా చెప్ప‌వ‌చ్చు. …

పుస్తక పఠనం

పుస్తక పఠనం   పుస్తకం అంటే విజ్ఞాన ఖని. ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు …

-టీ పి సి సి చీఫ్ ?? 

టిపిసిసి అధ్యక్షుని ఎంపిక అదిష్టానానికి తలనొప్పి  టీ పి సి సి చీఫ్ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంలో పార్టీ …

విద్య – వికాసం

విద్య – వికాసం విలువలను పెంచేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రకృతిలో సర్దుబాటుకు తోడ్పడేది, మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును …

మా తెలుగు తల్లికి మల్లె పూదండ

మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనేది తెలుగులో ప్రాచుర్యం కలిగిన  ఒక గేయం. గీత రచయిత శంకరంబాడి సుందరాచారి. టంగుటూరి సూర్యకుమారి ఆభేరి రాగంలో మధురంగా …

మన తెలుగు సామెతలు (‘హ – క్ష ’ అక్షరములతో)

హంగామాల పెళ్ళాం – ఆర్భాటాల మొగుడు హంస నడకలు రాకపోయే – ఉన్న నడకలు మరిచిపోయే హద్దుల్లో వుంటేనే ముద్దూ ముచ్చటా హద్దుల్లో వుంటేనే ఆడది – …

ఏడు దశాబ్దాలవుతున్నా ఎదగని మహిళ 

ఏడు దశాబ్దాలవుతున్నా ఎదగని మహిళ  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా నేటికీ మహిళకు స్వేచ్ఛలేదు. ఎత్తు ఎదగలేదు. మహిళకు పట్టం అంటూ  బింకాలు పలకడం …

మన తెలుగు సామెతలు (‘ష – స ’ అక్షరములతో)

షండుడికి రంభ దొరికితే ఏమవుతుంది? షష్ఠిపూర్తినాడు పక్కింటావిడకి కన్నుకొట్టినట్లు షష్టినాడు చాకలివాడైనా ప్రయాణం చేయడు   స అక్షరంతో- సంకటకాలే వేంకటరమణ అన్నట్లు సంక్రాంతికి చంకలెత్తలేనంత చలి …

మన తెలుగు సామెతలు (‘శ ’ అక్షరంతో)

శంఖులో పోస్తేగానీ తీర్థం కాదు శృంగారమంటే ఏ తీరో – ఏ విధమో చెప్పరా నా ముద్దుల ప్రియుడా అన్నదట శృంగారానికి సమయం – సరసానికి సందర్భం …

ఆత్మ సంకల్పం :

ఆత్మ సంకల్పం : నిలిచిపోయిన నీటికంటె పొర్లిపారే నీటి తరగల్లోనే ఆత్మసంకల్పం ఉరకలేస్తూ ఉంటుంది. ఆ జలధారలే గిరిశిఖరాలపై నుంచి దూకినపుడు తిరుగులేని సాహసం నురగలెత్తుతూ ఉంటుంది. ప్రాణమున్న మనుషులం గనుక మనం కూడా ప్రవహించాలి. చెత్తా చెదారంలాంటి సమస్యలొచ్చినప్పుడు వాటిని తొలగించాలి.. అవసరమైతే ఏటి ప్రవాహానికి ఎదురీదాలి. ఎందుకంటే మనిషికి ఆలోచించే శక్తి ఉంది. యుక్తి ఉంది. అనుభూతి చెందే శక్తి ఉంది. ఆచరణకు నడుం కట్టే శక్తీ ఉంది. మనిషిలో ఉన్న ఈ శక్తియుక్తులన్నీ వికసింప చేయడానికి దోహదపడేదే ఆత్మ సంకల్పం.   ప్రతి మనిషీ పరుల ప్రయోజనం కోసం కట్టుబడి ఉండాలి. ప్రేమా నిస్వార్ధం స్వార్ధ త్యాగం సామాజిక దృష్టీ యివన్నీ మిళితమై ఉండాలి. మనం జీవితంలో చేపట్టే ఏ పనికయినా కావలిసింది ఆత్మ సంకల్పం. ఇది మన శక్తి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉంటుంది. మనం చేయాలనుకునే పని మీద ఓ నిశ్చితమైన అభిప్రాయం కలిగి ఉండటం. ఓ అంచనాకు రావడం. మన భవిష్యత్తు మీద కూడా అంతే బలమైన నమ్మకం ఏర్పరచుకోవడం. వీటన్నిటికీ కేవలం పథక రచన ఒక్కటే సరిపోదు. అందుకు దృఢ సంకల్పం చాలా అవసరం. ప్రతి ఒక్కరికీ సంకల్పం  అవసరం, సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చు. నిరంతరం దేవుని సేవ, పరుల సేవకు కృషిచేసేవరికి సంకల్పబలం మెండుగా ఉంటుంది.. నిజంగా మ‌నం ఏదైనా చేయాల‌నుకుంటే చేయ‌చ్చు. అందుకు ఆత్మ సంక‌ల్పం చాలు,  అనుకున్నది సాధించ‌వ‌చ్చు. దీనికి తోడు కొంత శ్ర‌మ‌ కూడా జత చేస్తే ఇక విజ‌యం మ‌న‌దే. మార్గదర్శకుడైన భగవంతుడిని, గురువును పూజించిననాడే జీవితంలో వ్యక్తి రాణిస్తాడు.   ఆత్మ సంకల్పం ఉన్న వారు అన్నింటిలోనూ రాణిస్తారు. జ్ఞానాన్ని నిత్యం మనన చేసిన వారే ఇతరులకు సేవ చేయగలరు. మనిషి తన అంతరంగంలో తనకు తాను సరిదిద్దుకున్నప్పుడే సమాజాన్ని సరిదిద్దగలడు. నిండైన ఆత్మ విశ్వాసం కలిగిన వ్యక్తులు జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఆటుపోట్లనైనా అధిగమించడానికే ప్రయత్నిస్తారు. దట్టంగా కమ్ముకున్న కారుమబ్బుల్ని చీల్చుకొని వచ్చే సూర్యకిరణాల్లా వారు సవాళ్లను ఎదుర్కోవడానికి సదా సిద్ధంగానే ఉంటారు..   -నందిరాజు రాధాకృష్ణ

మన తెలుగు సామెతలు (‘వ’ అక్షరంతో)

వంకరో టింకరో వయసే చక్కన వంకలేనమ్మ డొంక పట్టుకు తిరిగిందట వంట నేర్చిన మగవాడికి సూకరాలెక్కువ వంటింటి కుందేలు ఎక్కడికి పోతుంది? వంటిల్లు కుందేలు చొచ్చినట్లు వండని …

మనశ్శాంతి ఆరోగ్యానికి మంచిది

మనశ్శాంతి ఆరోగ్యానికి మంచిది ఏ విషయం పట్ల అయినా స్పష్టత ఉన్నప్పుడు ఒత్తిడి ఉండదు. అందుకే ముందు మన గమ్యం పట్ల స్పష్టత ఉండాలి. స్పష్టమైన లక్షాన్ని ఏర్పర్చుకుంటే దాన్ని సాధించే మార్గాలు బోలెడు కనిపిస్తాయి. ఎంత డబ్బు సంపాదించామన్న దానికన్నా ఎంత మంచి పేరు తెచ్చుకున్నామన్నదే ముఖ్యం. మంచితనంతో అందుకునే గౌరవాభి మానాలు డబ్బు కన్నా ఎక్కువ మనశ్శాంతినిస్తాయి. ఎన్ని ముఖ్యమైన పనులున్నా అప్పుడప్పుడూ కొంత విరామం, విశ్రాంతి ఇవ్వడం మంచిది. అవిశ్రాంతంగా పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. సేద తీరడం వల్ల మరింత చురుగ్గా పనిచేయ గలుగుతాం.   యాంత్రికంగా బతకడం లో సంతృప్తి ఉండదు. కొన్నిరోజులకే విసుగువస్తుంది వస్తుంది. ప్రతీ పనిలో, ఆలోచనలో సృజనాత్మకత ఉండాలి. ఎవరికి వారే యమునా తీరే అని కాకుండా నలుగురితోనూ సత్సంబంధాలు పెంచుకోవాలి. అవసరంలో ఉన్నవాళ్లకు సాయం చేయడానికి ముందుండాలి. ఇతరుల కోసం పనిచేసి నప్పుడు కలిగే సంతృప్తి అందించే మనశ్శాంతి మాటల్లో చెప్పలేం.   అన్ని సందర్భాల్లో సానుకూలధోరణితో, చిరునవ్వుతో ఉండాలి. ఏ పరిస్థితిలోనైనా అననుకూల అంశాలనుంచిఉఇ మనసును మళ్ళించాలి. అప్పుడు సంతోషం ఏర్పడుతుంది. మంచి ఆహారపు అలవాట్లు, జీవనవిధానం ఆరోగ్యాన్నే కాదు, మానసిక ఉల్లాసానికి కూడా దోహదపడతాయి. కాస్తంత ఆధ్యాత్మిక చింతన అలవరచుకుంటే మనసుకెంతో ఊరటగా ఉంటుంది. ఉద్రిక్తత తగ్గుతుంది.   -నందిరాజు రాధాకృష్ణ

 స్నేహ మాధుర్యం:

 స్నేహ మాధుర్యం: స్నేహం మాధురాతి మధురం. స్నేహానికి హద్దులు ఉండవు. పరిమితులు ఉండవు. స్నేహం ఒక గొప్ప ప్రవాహం లాంటిది. అనిర్వచనీయమైనది. త్యాగాన్ని కోరుకుంటుంది. ప్రేమను కురిపిస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది. తృప్తిని కలిగిస్తుంది. అసంతృప్తిని దూరం చేస్తుంది. ఆశలను చిగురింపజ్తేంది. ఆశయాలను గుర్తుచేస్తుంది. స్వార్థాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తుంది. కపటాన్ని, మోసాన్ని కాఠిన్యాన్ని దరిచేరనీయదు. వృద్ధిని కోరుకుంటుంది. సన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను మిత్రులు ఎల్లప్పుడూ కోరుకుంటారు. అందుకే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నారు.   స్నేహానికన్నా మిన్న లోకాన లేదు. స్నేహానికి హెచ్చుతగ్గులు ఉండవు. పేద, ధనిక తారతమ్యాలు ఉండవు. స్నేహానికి కులం, మతంతో పని లేదు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడలా ఉంటారు. వారే నిజమైన స్నేహితులుగా నిలుస్తారు. ఒకరి శ్రేయస్సును మరొకరు కోరుకుంటారు. అవసరమైతే ఒకరికొకరు ఒకరు సుఖాలను, సంపదలను, సమయాన్ని సర్వస్వం త్యాగం చేయటానికి వెనుకాడరు. ఇవ్వడం, తీసుకోవడం, దాపరికం లేక పోవడం, అడగడం, తీసుకోవడం లక్షణాలు స్నేహమున్న చోటనే ఉంటాయంటారు. నిజమైన స్నేహం నిర్మలమైనది, స్వచ్చమైనది. నిజమైన స్నేహం సంపదకు స్వార్థానికి అతీతం.   స్నేహం త్యాగం కోరుతుంది, స్నేహం ప్రాణానికి ప్రాణం పెడుతుంది. నిజమైన స్నేహం చిరకాలం నిలుస్తుంది. మల్లెలాగా సున్నితమైంది, గులాబీలా గుచ్చుకుఉంటుంది. వెన్నెలంత స్వచ్ఛమైంది. అరమరికలులేని ఆనందాల సమ్మిళితం అసలైన స్నేహం!   స్నేహ మాధుర్యం మాటలకు అందనిది. కష్టం వచ్చినపుడు కన్నీటి కంటే ముందు నేనున్నానని గుర్తుంచుకునేదే స్నేహం. మనుషులు విడిపోవచ్చు మనసులు ఓడిపోవచ్చు, మమతలు  మాసిపోవచ్చు… కానీ మారనిది అనుభవించిన స్నేహ మాధుర్యం. స్నేహానికి  సాటి, పోటీ  ఏమీ ఉండవు.   -నందిరాజు రాధాకృష్ణ

మన తెలుగు సామెతలు (‘ల’ అక్షరంతో)

లంక మేతకు – ఏటి ఈతకు సరి లంకలో పుట్టినవాళ్ళందరూ రాక్షసులే లంఖణం పరమౌషధం లంఖణానికి పెడితేగానీ పథ్యానికి రాదు లంచం లేనిదే మంచ మెక్కనన్నట్లు లంజకు …

దేశం కోసం

దేశం కోసం భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన భాద్యత అందరిపై ఉంది. దేశభక్తి, ధర్మరక్షణ, ప్రతి కుటుంబంలో ఉండాల్సిన అవసరం. ముఖ్యంగా యువత సమాజంలో కీలక పాత్ర పోషించాలంటే వివేకానందుడి భావాలను పెంపొందించుకుని దేశంకోసం తన వంతు సహకారం అందించాలి. రామబాణం మాదిరి లక్ష్యం (గురి) తప్పని దృఢ మనస్కులై యువత ఉండాలి. మాతృబాషకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. భారతదేశ చరిత్ర నేటి తరం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దేశంలో అపారంగా ఉన్న యువశక్తి, యువత పరిజ్ఞానం ప్రగతికి ఉపయోగపడేలా ఉండాలి. యువతకు సమాజం పట్ల సదవగాహన ఉండాలి.  దేశభక్తి అంటే ఒక జాతి ఆత్మగౌరవానికి, ఔన్నత్యానికి అనుకూలంగా వ్యవహరించడం. భారత జాతి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం.   ‘‘అంతా ఒక్కటే- మనమంతా ఒక్కటే; రేకులు వేరైనగాని- పూవు ఒక్కటే’’ అని చెప్పడం. తను పుట్టిన నేలను, సంప్రదాయాలను, చారిత్రకతను అభిమానించడం. తన మతాన్ని అనుసరిస్తూనే దేశభక్తిని కలిగి వుండటమే జాతీయత లేదా దేశభక్తి. ఈ దేశంలో పుట్టడం ఒక యోగం. ఈ నేలపై నడవటం ఒక భాగ్యం! ఈ దేశంలో పుట్టాను కాబట్టే నాకింత గుర్తింపు, పేరు వచ్చింది  అని గుర్తుంచుకున్నవాడు దేశభక్తుడవుతాడు. యువతలో దేశభక్తి త్యాగము  ప్రతివ్యక్తీ తను కుటుంబానికి చేయవలసిన సేవచేస్తూనే శక్తివంచన లేకుండ సంఘసేవ చేయాలి. ప్రజలు త్యాగతత్పరులై, దేశసేవకు అంకితం కావాలి. సైనికులు తమ ప్రాణాన్నికూడా త్యాగం చేసి దేశ రక్షణకు సిద్ధపడుతున్నారు. శక్తి వంచన లేకుండా వారు అనుసరిస్తున్న ఆ త్యాగమే నిజమైన దేశభక్తి. తల్లిదండ్రులు ఉగ్గుపాలతో దేశభక్తిని రంగరించి పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి. దేశభక్తి కలిగిన ఆదర్శవంతమైన పౌరులుగా యువతను తీర్చిదిద్దాల్సినకర్తవ్యం వారిది. దేశం కోసం పరితపించే వారిలోనే నైపుణ్యాలు, శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దేశభక్తి కలిగిన పౌరుడు కుటుంబ విలువలను గుర్తిస్తాడు. చిన్ననాటినుంచే పిల్లల్లో జాతీయ భావాలు పెంపొందించడం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ దేశం తత్త్వవేత్తలకూ, మేధావులకూ ప్రతీకలైన శంకరాచార్య, వివేకానంద, అరవిందులు, సర్వేపల్లి రాధాకృష్ణ, శివానందమూర్తి వంటి వారిని స్మరించుకోవడంకూదా సంపూర్ణ దేశభక్తిని చాటిచెబుతుంది. -నందిరాజు రాధాకృష్ణ

మన తెలుగు సామెతలు (‘ర’ అక్షరంతో)

రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా? రంకులాడికి నిష్ఠలు మెండు రంకు సాగితే పెళ్ళెందుకు? రంగడికీ లింగడికీ స్నేహం – రొట్టెకాడ గిజగిజలు రచ్చకెక్కిన తర్వాత రాయబారమెందుకు? రతిలో …

వంటింటి వైద్యo  కొత్తిమీరతో ఆరోగ్యం :

వంటింటి వైద్యo  కొత్తిమీరతో ఆరోగ్యం :   కొత్తిమీర. వంటింటి వైద్యానికి పేరుపొందినది. ఎక్కడపట్టినా దొరుకుతుంది. చౌక కూడా. ఇది సర్వకాల  సర్వావస్థల్లోనూ మనకు అందుబాటులో ఉండే ఆకుకూర పదార్ధం. కొత్తిమీర ఆహర పదార్థాల …

మన తెలుగు సామెతలు (‘మ – య’ అక్షరములతో)

మంగలంలోని పేలాల్లాగా మంగలిని చూచి ఎద్దు కాలు కుంటినట్లు మంగలి పనిలాగా మంగలి వాడి దృష్టి అందరి జుట్టుమీదే మంగలివాని యింటివెనుక దిబ్బ తవ్వినకొద్దీ వచ్చేది బొచ్చే …

మన తెలుగు సామెతలు (‘బ – భ’ అక్షరములతో)

బంగారపు పళ్ళానికైనా గోడ అండ కావాలి బంగారానికి తావి అబ్బినట్లు బిందెడు ధనమిచ్చినా బావమరిది లేని సంబంధం వద్దు బందరు లడ్డూలాగా బంధువయితే మాత్రం బంధాలు తొలగిస్తాడా? …

పట్టుదలే విజయానికి సోపానం

పట్టుదలే విజయానికి సోపానం  విజయంకన్నా దానికోసం చేసే ప్రయత్నమే చాలా గొప్పది. ప్రయత్నం లేని ఫలితం  ఆశించకూడదు.  ఓటమి భయంతో ప్రయత్నించకుండా – ఏ పనీ ప్రారంభించలేకపోవటమే అన్నిటికన్నా పెద్ద సమస్య! నిజానికి జీవన పయనంలో అడ్డంకులుగా నిలిచేవి అనవసర భయాలు- సందేహాలూ,  అనుమానాలే! గెలుపు కేవలం ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది.  కానీ ఓటమి మనలో ఓర్పును పెంచి సహనంగా సానుకూల దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నేర్పును అనుభవ పాఠంలా అందిస్తుంది.   గాలిపటం గాలికి ఎదురీదినప్పుడే ఎత్తునకు ఎగురుతుంది. అదే గాలి వాలుని ఆశ్రయిస్తే దిగువకు దిగజారిపోతుంది. మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా మనం జీవితాన్ని ఎదురీది ఎగబ్రాకడానికే ఇతోధికంగా ఉపయోగపడతాయి. పట్టుదల అంటే, ‘ఆటంకాలూ అపజయాలూ ఎదురైనా సరే, ఒక ఉద్దేశాన్ని, ఒక స్థితిని స్థిరంగా అంటిపెట్టుకుని ఉండడం, లేదా ప్రయత్నాన్ని వదులుకోకుండా స్థిరంగా ఉండడం’ అని అర్థం. పట్టుదల అనే మాట ప్రతికూల పరిస్థితుల్లో కూడా కృతనిశ్చయంతో కొనసాగడాన్ని, వదిలిపెట్టకుండా స్థిరంగా ఉండడాన్ని సూచిస్తుంది. జయాపజయాలు దైవాధీనాలు. గెలుపు ఓటములు ఏ ఒక్కరికో అంటిపెట్టుకుని ఉండవు. ఒకరోజు ఒకరు గెలిస్తే మరో రోజు ఇంకొకరు గెలుస్తారు. గర్వం తలకెక్కకూడదు. ఈ నిజాన్ని నిగ్రహంతో గ్రహించగలిగేవాడు వివేకి – ఆ సమస్యల్నే అడ్డంకిలుగా భావించేవాడు అవివేకి! మేడమీదకి చేరాలంటే మెట్లుండాలి. ఆ మెట్లను ఆటంకాలుగా భావిస్తే, మనం  మేడమీదకి చేరుకోలేం. సమస్యలపట్ల సదవగాహన సానుకూల దృక్పథం, సరైన మార్గాన్వేషణ లక్షణం అలవరచుకుంటే లక్ష్యం చేరుకోవడం సులువవుతుంది.   ఉత్తమ పురుషులెప్పుడూ తాము తలపెట్టిన కార్యాచరణలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనిని పట్టుదలతో సాగించి విజయ లక్ష్యాన్ని చేరుకుంటారు. అందరికన్నా ఎక్కువ పట్టుదల ఉన్నవాడికే విజయం లభిస్తుందని నెపోలియన్ కూడా ఘంటాపథంగా చెప్పాడు. వైఫల్యం నిరాశకు ప్రేరణ కాకూడదు. సరిక్రొత్త ప్రేరణకు నాంది కావాలి. ముఖ్యంగా నేటి యువతీయువకుల్లో పేరుకుపోతున్న నైరాశ్య ధోరణి లేని సమస్యలకు జీవం పోస్తోంది. తాళంతో బాటే దాని చెవి కూడా ఉంటుందని తెలుసుకుంటే ఈ లోకంలో ఏదీ సమస్య కాదు! అన్నీ అత్యంత సన్నిహితమైన సమాధానాలే!   -నందిరాజు రాధాకృష్ణ

మన తెలుగు సామెతలు (‘ప – ప’ అక్షరములతో)

పంచదార పలుకులు – విషపు చూపులు పంచపాండవులంటే నాకు తెలీదా? మంచపుకోళ్ళులాగా ముగ్గురంటూ రెండువేళ్ళు చూపించాడట పంచాంగం పటపట – విస్తరాకు లొటలొట పంచాంగం పోగానే తిథీ …

సంతోషానికి మించిన సంపద లేదు..

సంతోషానికి మించిన సంపద లేదు..   మనిషి జీవితం చాలా చిన్నది. అందుకే మనం ఉన్నదాంతో సంతోషిస్తూ మనతో పాటు మన చుట్టుపక్కల వారికి కూడా  ఆనందం పంచడమే అసలైన సంతోషం. సంతోషంగా ఉన్నపుడు మనం ఆరోగ్యంగా ఉంటాం.  శరీరం తేలికగా ఉంటుంది. ఏ పనైనా ఇట్టే చేయగలుగుతాం. ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నదీ.. సంతోషంగా ఉండడం మనచేతల్లో, చేతుల్లో ఉంది.  తృప్తిలో ఉన్న ఆనందం దేనిలోనూ రాదు. బంగారం కంచంలో మృష్టాన్న  భోజనం  తినేవాడు ఆనందంగా ఉన్నాడని చెప్పలేం.   ఒక చిన్న పూరింట్లో ఉండే మనిషి తన కుటుంబంతో కలిసి గంజి త్రాగుతూ ఆనందంగా ఉండటాన్ని చూస్తే మనకు ఆనందమెక్కుడుందో అర్థమవుతుంది. జననం-మరణం. ఈ మధ్యలో జీవనయానం అనేక విధాలుగా సాగుతుంటుంది. చదువు, ఉద్యోగం, వివా హం, సంతానం, బాధ్యతలు, బరువులూ, కర్తవ్య నిర్వహణ, అహంకారం, మమకారం, పగ, ప్రతీకారం, కోపం, పుణ్యం, పాపం, స్నేహం, విరోధం, ప్రేమ ఇదే జీవితం. ఎగుడుదిగుడుల కంకర రాళ్ల బాటలో బండి గతుకులతో సాగిపోతుంటుంది జీవితం. సహజం అయిన దాన్ని తనకే ప్రాప్తించే కష్టంలా కాక, ఇది అందరికీ సర్వసాధారణ మని భావించినపుడు అంత బాధ ఉండదు. ఎవరి జీవితమూ పూలబాట కాదు. వడ్డించిన విస్తరి కాదు.   ముళ్లు, రాళ్లూ, పూలూ అన్నీ కలిస్తేనే జీవితం. చేదు రుచి తెలీకుండా తీపి రుచి తెలీదు. కేవలం సుఖాలనే చూసిన తర్వాత కష్టాల్ని చూసిన సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిపోవడం మనకు తెలుసు. కష్టసుఖాలు కావడి కుండలని విశ్వసించాలి. జీవితం కోసం జీవించడం ఒక అపూర్వమైన వరము. మనకోసం మనం జీవించాలి. మనచుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తూ, స్నేహభావంతో మెలగాలి. మంచిలోనే సంతోషం ఉందని గుర్తించాలి. గతాన్ని గురించి తలచి చింతించక, భవిష్యత్తు గురించీ భయపడక వర్తమానంలో నర్తించాలి. జీవించే ప్రతిక్షణం మనదిగా భావించాలి. అదే ఆనంద దినోత్సవం. మనం మన జీవితాన్ని ఇష్టపడుతూ మనల్ని మనం ప్రేమించు కుంటూ తోటివారికి ప్రేమ పంచాలి. త్యాగంలోని సంతోషాన్ని అనుభవించాలి. నిరంతరం ఆనందంగా ఉంటూ చుట్టూ ఉన్నవారిని ఆనంద పరచాలి. -నందిరాజు రాధాకృష్ణ

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం.

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస. లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం ఇరవయ్యో శతాబ్దపు రాజకీయాలు భారత దేశంలో ఒక వ్యక్తి చొరవ, శక్తియుక్తుల చుట్టూనే పరిభ్రమించాయి. ఆయనే …

మన తెలుగు సామెతలు (‘న’ అక్షరంతో)

నంగనాచి తుంగబుఱ్ఱ నంగిమాటల వాడినీ – దొంగ చూపుల వాడినీ నమ్మరాదు నందనవనంలో నాగుపామున్నట్లు నంది అంటే పంది అన్నట్లు నందిని చేయబోయి పందిని చేసినట్లు నందిని …

చరిత్ర చెప్పిన సత్యమిది. 

ప్రతివాడు రాజకీయాలలో విలువలు కాపాడేందుకు సంసిద్ధుడే..పాపం రాజకీయం.. రాజకీయనాయకుడు రంగు మార్చుకుంటే, కొత్త జెండాలు ఎత్తుకుంటే, కొత్త కండువాలు కప్పుకుంటే, అభిమానులు భుజాన వేసుకోవచ్చునేమో! కాని, ఓటర్లు …

మన తెలుగు సామెతలు (‘ద – ధ’ అక్షరములతో)

దంచలేనమ్మ ఊదూది చూచిందట దంచేదొకరైతే ప్రక్కలెగరేసే వాడింకొకడు దండించేదాత లేకుంటే, తమ్ముడు చండప్రచండుడు దండుగలో దండుగ దంపినందుకు బొక్కిందే కూలి దంపినమ్మకు బొక్కిందే దక్కుడు దంపుళ్ళ పాటకు …

నవయుగాల బాట, నార్ల మాట…

పత్రిక అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక ఆయుధం. కీర్తన సంఘం కాదు.. ఎడిటర్ ఎలా ఉండాలి? సంపాదకుడు కారాదు.. అంటూ ఎన్నోచెప్పిన నిఖార్సయిన విలేఖకుడు నార్ల వారు. …

మహోన్నత వ్యక్తి.. ఆయన ఒక శక్తి..

మహోన్నత వ్యక్తి.. ఆయన ఒక శక్తి.. మనకు లభించిన అరుదైన ఆధ్యాత్మిక మహా పురుషులలో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. ఆయన మనిషిగా మహోన్నతి చెందిన వారు. ఒక …

జి కె లో అనూహ్య మార్పు

జి కె లో అనూహ్య మార్పు అలా ఆగస్ట్ 17న పరివర్తన పొందిన జికె (జిడ్డు కృష్ణమూర్తి) కొంత కాలానికి మిత్రులతొ కలసి ఆస్ట్రియాలోని ఎర్వాల్డ్ కు …

జ్ఞానము జ్ఞాపకాల పుట్ట,

జ్ఞానము జ్ఞాపకాల పుట్ట,  ప్రేమ లేని జ్ఞానం నాశన హేతువు: జి కె అన్ని భవబంధాలను వదుల్చుకున్న తరువాత సంపూర్ణ  స్వేచ్ఛతో 70 సంవత్సరాల పాటు నిరాఘాటంగా …

మన తెలుగు సామెతలు (‘త – థ’ అక్షరములతో)

తంగేడు పూచినట్లు తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది – తల్లి చస్తే కాపురం తెలుస్తుంది తండ్రి వంకవారు దాయాదివారు తంతే …

అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ…

అన్నీ అనుభవించి… ఎనభైల ప్రాయంలో… అప్పుడప్పుడూ ప్రజల కోసం అంటూ…   *మోహన్ దాస్ కరమ్‌చంద్ మనుమడు (కొడుకు గాంధిదేవదాస్ గాంధి కుమారుడు); చక్రవర్తుల రాజగోపాలాచారి మనుమడు …

చిత్రం భళారే విచిత్రం

సోషల్ మీడియాలో మార్ఫింగ్ లు, ఫేక్ లే ఎక్కువ. వివేకానందునితో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కలసి ఉన్నట్లు Pintriestలో దొరికిన ఫోటో ఇది. వారిద్దరూ అంటే ఇష్టం …

మన వేమన పద్యం విశ్వజనీన వేదం  

మన వేమన పద్యం విశ్వజనీన వేదం 1829 లో తొలిసారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించారు. తరువాత లభ్యమైన మరి కొన్ని పద్యాలను చేర్చి 1839లో …

సొంత బాకాలుగా తెలుగునాట పత్రికలు, చానళ్ళు

తెలుగునాట పత్రికలు, చానళ్ళ దర్శకత్వంలో పార్టీలు… పార్టీల ప్రమేయంతో ప్రసారమాధ్యమాలు గతంలో రాజకీయపార్టీలకు ఆయా సిద్ధాంతలపై వార్తా పత్రికలుండేవి.  గాంధి హరిజన్, యంగ్ ఇండియ,నెహ్రూ నేషనల్ హెరాల్డ్ …

మన తెలుగు సామెతలు (‘డ – ఢ’ అక్షరములతో)

డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు డబ్బివ్వని వాడు ముందు పడవెక్కుతాడు డబ్బు ఉంటే కొండమీది కోతి కూడా దిగి వస్తుంది డబ్బుకుండే విలువ మానానికైనా లేదు డబ్బుకోసం గడ్డి …

మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ?

మాట మాత్రానికే ముక్కోణ పోటీనా ? గ్రేటర్ ఎన్నికలు టి ఆర్ ఎస్ – బి జె పి ప్రత్యక్ష యుద్ధమేనా? ఒక స్థానిక ఎన్నికకు ఇంత …

గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి

గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి హైదరాబాద్‌‌లో పాలిటిక్స్‌  హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని …