మన వేమన పద్యం విశ్వజనీన వేదం  

మన వేమన పద్యం విశ్వజనీన వేదం 1829 లో తొలిసారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించారు. తరువాత లభ్యమైన మరి కొన్ని పద్యాలను చేర్చి 1839లో …

పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి 

నవంబరు 23 న సేవాతత్పరుడు, సమతావాది సత్యసాయి 94వ జయంతి పుట్టపర్తి సత్యసాయిబాబా 94వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్ సభ్యులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. 1926 నవంబర్‌ 23న ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజులకు నాలుగో సంతానంగా సత్యసాయిబాబా జన్మించారు. కొండగుట్టల మధ్య ఉన్న ఓ కుగ్రామమైన గొల్లపల్లిలో ఆయన జన్మించారు. తల్లిదండ్రులు సత్యసాయికి మొదట్లో.. సత్యనారాయణ రాజు అని నామకరణం చేశారు. 1940 అక్టోబర్‌ 20న తన 14వ ఏట తాను ‘సత్యసాయిబాబా’ను అంటూ తన అవతారాన్ని ప్రకటించుకున్నారు. 1941లో తొలిసారి బాబా భవిష్యవాణిని వినిపించారు. 25వ జన్మదినోత్సవం రోజున ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం చేశారు. అప్పటినుంచి బాబా కీర్తి ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తించాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే సనాతన ధర్మాలను ప్రచారం చేస్తూ ప్రశాంతి నిలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఆయన బోధనలు నాలుగు ముఖ్య విషయాలఉగా ప్రసిద్ధికెక్కాయి. అవే..ఒకటే కులం – మానవత; ఒకటే మతం – ప్రేమ; ఒకే భాష – హృదయం; ఒకే దేవుడు – అంతటా ఉన్నవాడు. 1954వ సంవత్సరం నుంచి ట్రస్ట్‌ తరపున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇవి ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే 1956లో జనరల్‌ ఆస్పత్రి, 1991లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు. ఎంతో ఖరీదైన వైద్యాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు. 1964లో విద్యాసేవలు ప్రారంభించారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు అన్ని విద్యాలయాలను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందజేస్తున్నారు. 1981లో శ్రీసత్యసాయి డీమ్డ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. జిల్లాలో తాగునీటి సమస్యను నివారించేందుకు 1995లో 300 కోట్ల రూపాయలతో భారీ మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. సమాజానికి సేవలు:  సత్యసాయిబాబా సమాజహితంగా అనేక సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. అవి నేటికీ కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాధినేతలు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంతోమంది ప్రముఖులు సత్యసాయిబాబాను దర్శించుకున్నారు.  బాబా శివైక్యం చెందినా.. భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గకుండా ప్రశాంతినిలయం సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమవుతోంది.  బాబా భౌతికంగా లేకపోయినప్పటికీ తమ హృదయాలలో నెలకొని ఉన్నాడని భక్తులు విశ్వసిస్తున్నారు. మానవ సేవలోనే మాధవుణ్ని చూసి తరించమని భక్తులకు బోధించారు. కుగ్రామమైన పుట్టపర్తిలో పేదలకు వైద్య సౌకర్యార్థం నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఇందుకు ప్రధానమైన ఉదాహరణ. అంతేకాదు కరువుల జిల్లాకు తాగు నీటిసౌకర్యం, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించే విద్యాలయాల నిర్మాణం, పట్టెడన్నానికి నోచుకోని దీనుల చెంతకే ఆహారం సేవాదళ్‌ కార్యకర్తలు మోసుకెళ్లే అమృత కలశం పథకం, ఇవన్నీ సమాజానికి ప్రేమతో పంచిన వరాలే. సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ మనుషులంతా ఒక్కటేనని చెప్పారు. అన్ని మతాల సారమూ ఒకటేనని, మనిషిని మనిషి ప్రేమించాలి అని   చెప్పారు. వీణలో తీగెలు వేరువేరుగా ఉంటున్నాయి కాని వీణ ఒక్కటే. అదే విధంగా ఈ దేశమంతా ఒక వీణ, మతాలే తీగెలు. వీణలో ఏ ఒక్క తీగె అపస్వరం పలికినప్పటికీ వినడానికి ఇంపుగా ఉండదు, కనుక అన్ని మతాల క్షేమాన్ని, అందరి సంక్షేమాన్ని మనం ఆశించాలి అని   మతసామరస్యం గురించి ఉద్భోదించారు. సత్య సాయి బాబా అధ్వర్యంలో అప్పుడు ప్రత్యక్షంగా, ఇప్పుడు పరోక్షంగా ఆయన సేవా సంస్థల అధ్వర్యంలో అసంఖ్యాకంగా  విద్యా, సేవా, దాన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఉన్నత విద్య : ప్రశాంతి నిలయంలోని సత్యసాయి ఉన్నతవిద్యా సంస్థ  ప్రస్తుతం దీని పేరు, శ్రీ సత్య సాయి విశ్వవిద్యాలయం).దేశం మొత్తంలో జాతీయ విద్యాప్రమాణ తులనా మండలి ద్వారా “A++” రేటింగ్ పొందిన ఒకే ఒక సంస్థ. ఇదే కాకుండా ఒక సంగీత విద్యాలయం, అనంతపూర్‌లో ఒక (మహిళా) ఉన్నత విద్యాలయం ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలోనూ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్య   నేర్పే విద్యాలయాలను స్థాపించాలని వారి ఆశయం. ఇప్పటికి 33 దేశాలలో పాఠశాలలు ప్రాంభించారు. వైద్యం : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని 1991 నవంబరు 22న అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ప్రారంభించారు. బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్ని హంగులూ గల 333 పడకల ఆసుపత్రి. ఇది 2001 జనవరి 19న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ప్రాంభించారు. ఇవన్నీ పేదవారికి ఉచితంగా వైద్య సదుపాయాలందిస్తున్నాయి. దాదాపు అయిదులక్షల మందికి బెంగళూరులో ఉచిత చికిత్స లభించింది.  అలాగే బెంగళూరు వైట్‌ఫీల్డ్ల్‌ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ లక్షలాదిమందికి ఉచిత వైద్యం అందించింది. ఇంకా ఎన్నో వైద్యశాలలు గ్రామీణ పేదవారికి వైద్య సదుపాయాలు ఉచితంగా కలుగజేస్తున్నాయి. …

భారతీయ సంస్కృతిలో 64 కళలు

భారతీయ సంస్కృతిలో 64 కళలు (చతుష్షష్టి కళలు) మన భారతీయ సంస్కృతిలో 64 కళలు(చతుష్షష్టి విద్యల)ను తెలియజేసే శ్లోకం “వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ …

కార్తీక మాసం – విశిష్టత

భగవంతునికి ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం శివ నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలంనుంచీ ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తూ కఠిన నిష్ఠతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో పాఢ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిధుల్లో శివ పార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం మహిళలు ఈ మాసంలో విశేష పూజలు జరుపుకుంటారు. ఈ మాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశి ఎంతో వైశిష్ట్యం వుంది.ఈ రోజు శ్రీ మహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా భావిస్తారు.దీన్నే కొన్ని ప్రాంతాల్లో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు. ఉత్థాన ఏకాదశినాడే దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినట్టు పురాణాలు పేర్కొన్నాయి. ఈరోజు ఉపవాసం వుండి మరుసటిరోజు ద్వాదశి పారయణం చేస్తే ఎంతో మంచిది మంచిది.ఈ కార్తీకమాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైబోవోపేతంగా పూజలందుకుంటారు ప్రధానంగా భక్తులు కార్తీకమాసంలో శివాలయానికి వెళ్ళి పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం, బిల్వపత్రాలు, అవిసే పూలతో పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని నమ్మిక. చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి సిరిసంపదలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. పౌర్ణమిరోజు వేకువజామున గ్రామాల్లో చెరువులు లేదా నదుల్లో మహిళలు అరటిదొప్పలతో దీపాలను పెట్టి నీటిలోకి వదులుతుంటారు. ఈ సమయంలో కోరుకున్న కోర్కెలు నెరవేరతాయనే సంకల్పంతో వివాహం కాని యువతులు భక్తిశ్రద్ధలతో కార్తీకదీపాలను నదుల్లో వదులుతారు.  కోరికలను తీర్చే దీపపు కాంతులు పూర్వం శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకుని నైమి శారణ్యంలో నివసిస్తున్న అదిగురువు సూత మహర్షి కార్తీకవ్రత మహత్మ్యం, దానిని ఆచరించే విధానం గురించి ఋషులకు బోధించాడు. ఇలాంటి వ్రతమే కావాలని పార్వతీదేవి కుడా ఈశ్వరుని ప్రార్థించినట్టు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుడు నారదనికి, మహావిష్ణువు లక్ష్మిదేవికి ఈ వ్రతవిధానం చెప్పారు. దీని గురించి స్కందపురాణంలో కూడా వివరించడం విశేషం.కార్తీక పౌర్ణమిరోజు రాత్రి 12 గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఎంతో ఆరోగ్యమని పండితులు చెబుతుంటారు. ఈ రోజు బ్రాహ్మీ సమయంలోనే తులసిని పూజిస్తారు. పౌర్ణమిరోజు ఆవు నెయ్యితో తడిపిన దారపువత్తుల దీపాలు వెలిగించి తులసికోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా పెట్టి 365 వత్తులతో హారతి ఇవాలి. నక్షత్రాలు కనుమరుగు కాకముందే ఈ పూజ చేస్తే చాలా మంచిది. కార్తీక సోమవారాలు – నదీస్నానాలు కార్తీకమాసం వచ్చిన వెంటనే నదీస్నానం అత్యంత ప్రధాన మైనదని భక్తులు నమ్ముతుంటారు. లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీకమాసంలో వేకువవేళల్లో తులారాశిలో సంచరిస్తున్నప్పుడు నదీ స్నానం చాలా మంచిదని ఋషులు పేర్కొన్నారు. మనఃకారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన, మనస్సుపైనా వుంటుంది. మానసిక దేహారోగ్యానికి కార్తీక మాసంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. దీనిని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడుని ధ్యానించాలనే ఉద్దేశంతో పూర్వం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతోంది. ముఖ్యంగా కార్తీకమాసంలో శివభక్తితో శీతల స్నానమాచరించడం ఆరోగ్యనికి మంచిదని చెబుతారు. దీంతోపాటు ఈ నెలరోజులు భక్తులు సాత్వికాహారం పరి మితంగా తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని చెప్పొచ్చు. ఈ మాసంలో ముక్ష్యంగా సోమవారాల్లో లక్షతులసి దళాలు లేదా బిల్వపత్రాలు, మారేడు దళాలతో గాని శివపూజ చేసిన భక్తులకు మహత్తరశక్తి కలుగుతుందని చెబుతారు. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. కార్తీక పౌర్ణమినాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకపౌర్ణమి రోజు తులసికోటలో తులసి మొక్కతోపాటు ఉసిరికొమ్మ(కాయలతో) పెట్టి తులసి చెట్టుపక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే యువతులు కోరుతున్న వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీకపౌర్ణమి రోజున ఉసిరికదానం చేయడం వల్ల దారిద్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీకపౌర్ణమి రోజున దీపారాధన చేయడంవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెబుతుంటారు.   రచయిత – నందిరాజు రాధాకృష్ణ

బెజవాడలో దసరా వేడుకలు

  విజయవాడ, అక్టోబరు 9,  హిందువుల ప్రధాన పండుగలలో విజయ దశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయ దశమి, దసరాగా పిలవబడే …

సహజ శిలాతోరణం

తిరుపతి, సెప్టెంబర్ 11, తిరుమల శిఖరాలు వేదాలే శిలలైన కొండలు. ఈ పవిత్ర పర్వత శిఖరం మీదే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. కోనేటి …

రైలు కోచ్‌ రెస్టారెంట్లో తిందామా !

తిరుపతి, సెప్టెంబర్ 07, ఇపుడు కొత్తక వింత, పాతొక రోత.. అంతా వరైటీ కోరుకుంటున్నారు.  లైఫ్ లో రొటీన్ గా ఉంటే ఎవరికీ ఏదీ నచ్చడం లేదు. …

joy full rides amaravati in helicopter

ఆకాశమార్గంలో ‘జాయ్‌’ ఫుల్ రైడ్స్!

అమరావతి, సెప్టెంబర్ 5: ఆకాశమార్గంలో అమరావతి అందాలను చూపించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) హెలికాప్టర్ జాయ్ రైడ్స్‌ను ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తోంది. మరో నెల …

Decreasing tourists for limbini park laser show

మసకబారుతున్న లేజర్ షో….

హైదరాబాద్, సెప్టెంబరు 04: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న లుంబినీ పార్కులోని లేజర్‌ షో మసకబారుతోంది. మొత్తం ఐదెకరాల్లో పార్కు, లేజర్‌ షో ప్రాంతం, …

75 టన్నుల నాణేలు చిల్లర పెంకులు

తిరుమల, ఆగస్టు 29: తిరుమల శ్రీవారికి భక్తులు నాణేల రూపంలో సమర్పించిన కానుకలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. టీటీడీ నిర్లక్ష్యం కారణంగా కోట్ల రూపాయల విలువచేసే స్వదేశీ, …

tour-packages-chilkuru balaji-telangana

చిలుకూరు బాలాజీ దర్శనానికి టూర్ ప్యాకేజి

హైదరాబాదు, ఆగస్టు 28, చిలుకూరు బాలాజీ దర్శనానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ‘చిలుకూరు బాలాజీ దర్శన్’ పేరుతో ప్రారంభించిన ఈ …

Lepakshi as heritage property

వారసత్వ సంపదగా లేపాక్షి

అనంతపురం, ఆగస్టు 28: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లేపాక్షి స్మారకాన్ని కేంద్ర పురావస్తుశాఖ దేశంలోనే ఉత్తమ వారసత్వ సంపదగా ఎంపిక చేసింది. …

పిల్లల మర్రి దగ్గర కెనోపివాక్‌ బ్రిడ్జి నిర్మాణం

మహబూబ్ నగర్, ఆగస్టు 26, వందల ఏళ్ల క్రితం మొలకెత్తిన మొలక శాఖోపశాఖలుగా విస్తరించి మొదలు ఎక్కడ ఉం దో గుర్తు పట్టలేనంత మహా వృక్షంగా ఎదిగింది. …

prasadam and milk free in kanakadurga temple

అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాదం

విజయవాడ, ఆగష్టు 25: విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇకపై ఉచిత ప్రసాదం తో పాటు చిన్నారులకు ఆలయం తరఫున ఉచితంగా పాలు …

వడమాల ఎందుకు స్వామీ!

తిరుపతి, ఆగష్టు 10, రామభక్తుడయిన ఆంజనేయస్వామికి  భక్తులు వివిధ రకాల పూజలు, అభిషేకాలు నిర్వహిస్తు ఉంటారు. సాధారణంగా హనుమకు తమలపాకు మాల, వడ మాల వేస్తామని మొక్కుకునే …

శ్రీలంకవెళ్లడానికి వీసా అక్కరలేదు

తిరుపతి, ఆగష్టు 09, శ్రీలంక సందర్శించే భారత, చైనా పర్యాటకులకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్టు శ్రీలంక పర్యాటక శాఖ తెలిపింది. ఈ మేరకు సాధ్యాసాధ్యాల …

కేరళ అందాలు చూసొద్దామా!

కొచ్చి, జూలై 31,   ఈ రుతువులో విరిసే కేరళ అందాలు గురించి మాటల్లో చెప్పడం కష్టమే. ఆ అద్భుత ప్రపంచాన్ని కనులారా వీక్షిస్తేనే అసలు మజా! పచ్చని …

సైకిల్ యాత్రవెళదామా!

అరకు,జూలై 29,  ట్రావెలింగ్ మనసుకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అందమైన కొండ కోనలూ చూసినప్పుడు అక్కడే ఉండి, తనివితీరా ఆస్వాదించాలనిపిస్తుంది. అయితే, మోటారు వాహనాల్లో విహరించడం కంటే.. …

భారత్ దర్శన్ టూర్.. చౌకగా, సౌకర్యంగా!

కొత్త ఢిల్లీ, జూలై 27, తక్కువ వ్యయంతో మన దేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టిరావాలని అనుకుంటున్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం? భారతీయ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) …

చంద్రగ్రహణం వీక్షించండి

తిరుపతి, జాలై 27,   ఈ రోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ శతాబ్ధిలోనే సుదీర్ఘమైనది. సుందరమైనదీను… వదలకండి తప్పక తిలకించండి అంటున్నారు శాస్త్రవేత్తలు. గ్రహణ సమయంలో ఇంట్లో కూచోవద్దనీ …

హాలిడే ప్లాన్… ఉందిగా ఓ యాప్

తిరుపతి, జూలై22, ఇటీవలి కాలంలో పర్యాటక ప్రాంతాలు బాగా సందడిగా ఉంటున్నాయి. పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి సంఖ్య ఏటికేడాది పెరుగుతూ పోతోంది. దీంతో మారుమూలనున్న అందమైన …

తక్షణ రుణం కావాలా.. సిబిల్ స్కోర్ ఎంతుంది?

తిరుపతి, జూలై 22, అప్పుచేయకుండా సంసారం, కాళ్లు తడవకుండా ఏరూ దాటలేం. అయితే మారుతున్న కాలంలో అప్పు అంత సులభంగా పుడుతుందా అన్నదే సమస్య. కొత్త సాంకేతిక ప్రగతి …

ఆంధ్రా బ్రాండ్‌గా ‘బొంగు బిర్యానీ’…

విశాఖపట్నం, 10 జూలై: బిర్యానీ తినాలంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే ప్రదేశం హైదరాబాద్…ఇక ఇక్కడకి వేరే రాష్ట్రాలు, దేశాల నుంచి అతిథులుగా వచ్చిన వారు బిర్యానీ రుచి …

పూరి ఆలయం గాంధీ సమాధి కాదు… మరి?

భువనేశ్వర్‌,జూలై 9, పూరి జగన్నాథుని గర్భాలయం శ్రీ మందిరంలోకి హిందూయే తరుల్ని అనుమతించాలనే సుప్రీం కోర్టు ప్రతిపాదనతో ఒడిసా రాష్ట్రం అట్టుడికిపోతుంది. భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం …

రైల్లో విలాసం

కొత్త ఢిల్లీ, జూన్ 27,  ప్రయాణం మానవుల ఆది నేస్తం. తొలి నుంచి మనిషి లోకమంతా తిరుగుతున్నాడు. ఇక వాహనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచ యాత్ర సామాన్యులకు …

బౌద్ధ క్షేత్రాల సందర్శనకు రైల్వే ప్రత్యేక ప్యాకేజీ

      అక్టోబరు 6వ తేదీ లోగా ఈ ప్యాకేజ్ ను పొందే ప్రయాణికులకు పది శాతం రాయితీ దేశ వ్యాప్తంగా ఉన్నబౌద్ధ క్షేత్రాలను సందర్శించదలచుకున్న …

రమణదీక్షితులుపై కక్ష సాధించారు… మఠాధిపతులు

తిరుపతి, జూన్ 9 : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులు రమణదీక్షితులుపై కక్ష తీర్చుకున్నారని మఠాధిపతులు, పీఠాధిపతులు ఆరోపించారు. పింక్ డైమండ్ అనేది పగిలే ప్రసక్తే లేదని …

రమణ దీక్షితులూ… నీ పద్ధతి బాగోలేదు… చర్యలు తప్పవు : టీటీడీ ఛైర్మన్

తిరుపతి, జూన్ 8 : తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు పద్దతి ఏమాత్రం బాగోలేదని, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి …

ఆభరణాల ప్రదర్శనకు బోర్డు నిర్ణయం… ఆరోపణలపై లీగల్ నోటీసులు

తిరుమల, జూన్ 5 : తిరుమలలో ఆభరణాల వివాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సీరియస్‌గా తీసుకుంది. జరుగుతున్న వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నం చేస్తూనే, మరోవైపు …

ఆంధ్రాకి అతి దగ్గరలో ‘టిబెట్’

హైదరాబాద్: అక్కడెక్కడో హిమాలయలకి దగ్గరలో ఉన్న టిబెట్ ఆంధ్రాకి అతి దగ్గరలో ఉండడమేంటి? అనుకుంటున్నారా..? నిజమేనండీ.. టిబెట్ ఆంధ్రాకి చాలా దగ్గరలో ఉంది. కేవలం 100కి.మీ.ల దూరంలోనే …

సీబీఐ విచారణకు నేను సిద్ధం… మీరు సిద్ధమా…? రమణ దీక్షతులు

హైదరబాద్, జూన్ 5 : తనపై ఎవరెవరో ఆరోపణలు చేస్తున్నారని, తాను ఆస్తులు పెంచుకున్నట్లు, అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు చేస్తున్నారని వాటిపై సిబిఐచే విచారణకు తాను సిద్ధంగా …

విహారయాత్రలు : సలహాలు & సూచనలు

తిరుపతి, జూన్ 4: విహారయాత్రలంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి ? ఇక చిన్న పిల్లలైతే ఎగిరిగంతేస్తారు. కానీ మధ్యతరగతి కుటుంబాలకు కొంచెం తలనొప్పితో కూడుకున్న పని. …

గూగుల్ సమ్మర్ క్యాంపు..మీరు కూడా వెళ్ళచ్చు

హైదరాబాద్, మే 29: వేసవి కాలం ఎప్పుడో ప్రారంభమయ్యింది, పాఠశాలలు అన్ని మూతబడ్డాయి. చిన్న పిల్లలను నియంత్రించడంలో తల్లిదండ్రులు ముక్కుపైన వేలేసుకుంటున్నారు. ఆడుతూ పాడుతూ ఒక్కటేమిటి అన్ని …

have you remembered your summer childhood days

చిన్ననాటి వేసవి ప్రాయం గుర్తుందా..?

హైదరాబాద్: అందరూ అన్ని కాలాలను ఇష్టపడరు. కొందరు చలికాలం వస్తే అమ్మో చలి అని మునగదీసుకుంటారు. కానీ అదే కాలాన్ని కొందరు ప్రేమిస్తుంటారు. పొంగ మంచుని చూసి …

‘నల్ల’పులి… చిరుత లెక్క..! ఎక్కడ?

చంద్రపూర్, మే25 : నల్ల పులి… పేరు వినడమే కానీ, తెలుగు రాష్ట్రాలకు అంతగా పరిచయం లేని జంతువు. ఎక్కడైనా దట్టమైన అడవుల్లో ఉందేమో కానీ, కనిపించిన …

సింగపూర్: సాహస విన్యాసాల సామ్రాజ్యం

సింగపూర్, మే 22: దక్షిణ ఆసియా ఖండంలోనే అతి చిన్న దేశము సింగపూర్. మలేషియాకు దక్షిణాన సింగపూర్ వుంది. 1963 సంవత్సరములో మలేషియా ఏర్పడినప్పుడు దానిలో భాగంగా ఉండి, …

పోటుని మూసి పస్తులుంచారు….

తిరుపతి, మే 21: తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడి) ఈ మధ్య చాలా ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఆరోపణలు చేసింది, చేస్తున్నది ఎవరో కాదు, స్వామి వారి ప్రధాన …

హలో “థాయ్ ల్యాండ్”, ఛలో “థాయ్ ల్యాండ్”

థాయిలాండ్, మే 19: పర్యాటకులు ఎక్కువగా సందర్శించే దేశం థాయిలాండ్. దీని రాజధాని బ్యాంకాక్. ఇక్కడి ప్రజలు మాట్లాడే భాష థాయ్. వీరి కరెన్సీ పేరు బాత్. …

స్వచ్ఛ “ఎవరెస్ట్”…

ఎవరెస్ట్, మే 18: ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం. దీనిపై ఇప్పుడు చాలా చెత్త పేరుకు పోయింది. ఎంతలా అంటే.. విమానాల్లో వెళ్లి శుభ్రం …

వియత్నాంలో నోరూరించే స్ట్రీట్ ఫుడ్స్ ఇవే!

వియత్నాం, మే 18: మీరు వియత్నాం అంతా తిరిగారంటే ఒక్క విషయం మిమ్మల్ని తప్పక ఆకర్షిస్తుంది. అక్కడ నివసించే ప్రజలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. మన భారతీయులలో …

మున్నార్: ప్రకృతి యొక్క స్వర్గం

మున్నార్, మే 18: కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా …

నో మిరాశి… ఇక మీరు బయలుదేరండి… టీటీడీ

తిరుమల, మే 17 : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండి వచ్చిందో లేదో వివాదాస్పద నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. సుప్రీం కోర్టు పరిధిలోని మిరాశీ తేనె తుట్టెను …

తిరుమల తీర్థ ప్రదక్షిణల్లో పవన్ కళ్యాణ్

తిరుమల, మే 14 : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుమల కొండల్లో తీర్థ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటికే పలు తీర్థాలను సందర్శించిన ఆయన మిగిలిన సమయంలో …

beautiful paapi kondalu

పాపికొండల అందాలు- అపురూప దృశ్యాలు..

రాజమండ్రి: చుట్టూ ఎత్తైన పర్వత శ్రేణులు.. వాటి మధ్యలో నదీ ప్రవాహం.. ఆ కొండలలో పచ్చటి వృక్షాలు..  ఇంతటి చూడచక్కని దృశ్యాన్ని వీక్షిస్తే మనసుకి ఎంత ఆహ్లాదంగా …