ఆడపిల్లే అవనికి వెలుగు

ఆడపిల్లే అవనికి వెలుగు చదువులో, పనిలో, తెలివిలో, క్రీడలలో, ఇంటా బయటా ఆకాశంలో సగమంటూ వివిధ రంగాల్లో నేడు అమ్మాయిలు రాణిస్తున్నారు. అయినా ఆడపిల్లలకు నేటికికి సమాజంలో అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై అఘాయిత్యాలు నానాటికి పెరుగుతున్నాయి.   పిల్లలపై లైంగిక దాడుల్లో తొంభై శాతం తెలిసిన వారే చేస్తున్నారు. లైంగిక దాడుల తర్వాత నేరం రుజువు కాకుండా హత్యలు చేయడం మరింత గగుర్పాటు కలిగించే అంశం. ఇరుగుపొరుగు వారు, దగ్గరి బంధువులు సంఘటనకు కారకులైనపుడు పరువు కోసం పోలీస్ స్టేషన్లో నమోదు కానీ ఉదంతాలు అనేకం. పురుషాధిక్యత, వివక్ష, అసమానతలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, సామాజిక, ఆర్థిక కారణాలు, బాల్య వివాహాలు అనేక అంశాలు ఆడపిల్లల అభివృద్ధికి ఆటంకమవుతున్నాయి.  మహిళా సాధికారతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వివిధ సర్వేల  ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం  వందల, వేల సంఖ్యలో పసికందులు, బాలికలు, యువతులు అదృశ్యమౌతున్నారు. నిత్యం గృహ హింసలు, అత్యాచారాలు మితిమీరి పోతున్నాయి. పిల్లలను అపహరించి యాచక వృత్తిలోకి దింపడం, బాలికలను, యువతులను అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మడం, విదేశాలకు తరలిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం స్త్రెలలో అవిద్యే.  దేశంలో, ముఖ్యంగా  గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో  బాలికల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. విద్యా వంతురాలైన తల్లి తన పిల్లలకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానమంకోసం అవసరమైన శిక్షణ నిస్తుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది. స్త్రీలకు తమ కాళ్లపై తాము నిలబడగలమన్న నమ్మకం ఉన్నపుడే  ఆత్మ విశ్వాసం కలుగుతుంది.   మధ్యలో బడి మానివేసే వారి శాతం బాలురకన్నా బాలికలలో ఎక్కువగా ఉంది. ఇది బాలికా విద్యకు పెద్ద ఆటకం. ఆడపిల్లల పెంపకంలో తలిదండ్రులు వ్యత్యాసం చూపుతున్నారు.  తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆడ, మగ తేడాలేకుండా పిల్లలను సమానంగా పెంచాలి. అవకాశాలు కల్పిస్తే బాలికలు కూడా అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఆడపిల్లలు చదువుకు  ప్రభుత్వాలు అనుకూల పరిస్థితులుకల్పించాలి. ప్రతి మండలానికి ఒక బాలికల జూనియర్ కళాశాల  ఏర్పాటు చేసి బాలికా విద్య అవసరాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. బాలికలకు ఉచిత రవాణా, మెరుగైన హాస్టల్ సౌకర్యం కలిగించాలి.  బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను కేటాయించాలి. బాలికల కొరకు ప్రత్యేక నవోదయ పాఠశాలలు తెరవాలి.   బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. బాలికలకు  పౌష్టికాహారం అందేలా చూడాలి. ఓపెన్ స్కూల్, దూర విద్య కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రావాలి.  భ్రూణ హత్యలు నివారించాలి.   బాలికల, మహిళల కోసం చేసిన చట్టాలను పటిష్టంగా అమలుపర్చాలి.  హింస, అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం అందించి దోషులకు కఠిన శిక్షలు విధించాలి.  విద్య, సామాజిక రంగాలలో బాలికల ఎదుగుదలకు 2008 నుండి కేంద్రం  నేషనల్ గర్ల్స్ డేవలప్మెంట్ మిషన్ పేరుతో ప్రతి జనవరి 24 న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నారు. భేటి బచావ్, భేటి పడావ్ పథకం వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నది. బాలికల కోసం ప్రత్యేక సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి బాలికల చదువుకు అనువైన పరిస్థితులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడంవల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ముందుకు వస్తున్నారు. బాలికలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, బాలికల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. జాతీయ అక్షరాస్యతతో పోలిస్తే తెలంగాణలో బాలికల అక్షరాస్యత శాతం ఎక్కువ. చదువులోనేగాక క్రీడా, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో కూడ వారు రాణిస్తున్నారు.  పర్వతారోహణలో కూడా తమకు సాటి లేరని నిరూపించు కుంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల వలన బాల్యవివాహాలు  తగ్గుముఖం పట్టాయి. చదువు తర్వాతే పెళ్లి అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.  డయల్ 100 నెంబర్ గురించి పోలీసులు వివిధ పాఠశాలలో, కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు కూడా బాలికల భద్రతకు భరోసాగా నిలుస్తున్నాయి. బాలికలను సామాజిక వివక్షత, దోపిడీ నుండి రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ భాద్యతే కాకుండా ప్రతి ఒక్కరిది. ఆడపిల్లల పట్ల వివక్షతకు తావులేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడ, మగ వ్యత్యాసాలు సమసిపోయి ఆడపిల్ల అవనికి నిజమైన వెలుగు అవుతుంది. …

 తల్లి ప్రేమ

 తల్లి ప్రేమ సృష్ఠిలో కరగనిది తరగనిది, మరెందులోనూ కనిపించనిది, భూమి కన్నా విశాలమయినది, చందమామ కన్నా చల్లనయినది, సూర్యుని కన్నా ప్రకాశవంతమయినది, ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి, అదే …

ఏడు దశాబ్దాలవుతున్నా ఎదగని మహిళ 

ఏడు దశాబ్దాలవుతున్నా ఎదగని మహిళ  దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా నేటికీ మహిళకు స్వేచ్ఛలేదు. ఎత్తు ఎదగలేదు. మహిళకు పట్టం అంటూ  బింకాలు పలకడం …

ఐరాసలో భారత సంతతి మహిళకు కీలక పదవి

ఐరాస, జూన్ 03,  భారత సంతతి మహిళకు ఐక్యరాజ్య సమితి (ఐరాస)లో కీలక పదవి దక్కింది. మహిళా సాధికారతే లక్ష్యంగా అనితా భాటియాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ …

అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బంగారం కొనాలా..?

తిరుపతి, మే 07, అక్షయ తృతీయ వస్తే చాలు బంగారం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఉన్నవారైనా.. లేనివారైనా సరే ఎంతోకొంత పసిడిని తీసుకుని ఆనందపడుతుంటారు. ఇలా చేస్తే సిరిసంపదలు …

మిసెస్స్‌ ఇండియా తెలంగాణగా కూచిపూడి డ్యాన్సర్‌ భావన ఎంపిక

అమరావతి, మే04, విజయవాడకు చెందిన మహిళ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. మిసెస్స్ ఇండియా ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథమిక పోటీల్లో మిసెస్స్‌ ఇండియా తెలంగాణగా విజయవాడకు …

Zuzana Caputova, Slovakia's First Female President

స్లోవేకియా మొదటి మహిళా అధ్యక్షురాలు

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 02, స్లొవేకియా చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న జుజనా కపుతోవా(45) ఆ దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా …

పదారేళ్లకే నోబుల్ నామినేషన్

స్వీడన్‌, మార్చి16, నోబెల్‌ బహుమతికి స్వీడన్‌కు చెందిన 16ఏళ్ల బాలిక నామినేట్‌ కావడం సంచలంనం సృష్టించింది. పర్యావరణ మార్పులపై తన ప్రసంగాలతో యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించి …

National girl child Day Celebration 2019

జాతీయ బాలికా దినోత్సవం

తిరుపతి, జనవరి 24, పత్రికలు-మీడియా-సామాజిక మాధ్యమాలలో వస్తున్న సమాచారం మేరకు నేడు బాలిక దినోత్సవం.  పాపం మన ప్రస్తుత ప్రధాని నాలుగేల్లక్రితం తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన …

సుష్మా రాజకీయ సన్యాసం వెనుక?

కొత్త ఢిల్లీ, డిసెంబర్ 19, సమకాలీన మహిళా నేతల్లో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తర్వాత స్థానం సుష్మాస్వరాజ్ దే. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా ప్రస్థానం …

29 states-only women -cm - mamatha benarjee

29 రాష్ట్రాల్లో ఒక్కరే మహిళా సీఎం

కొత్త ఢిల్లీ, డిసెంబర్ 13, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల కారణంగా రాష్ట్రాల్లో ఎన్నో విషయాలు మారిపోయాయి. వాటితో పాటు దేశంలోని మహిళా …

భారత్ గురించి 35 ‘మైండ్ బ్లోయింగ్’ నిజాలు

 తిరుపతి, డిసెంబర్ 13, ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, …

రుచికరమైన నువ్వుల అరిసెలు

  దీపావళి అంటే సందడి, బాణాసంచా, పిండి వంటలు, కొత్త బట్టలు, బంధువులు అంతా హడావుడిగా ఉంటుంది. ఈ పండుగకు సొంత గ్రామానికి వెళ్లిపోయారా..  సంప్రదాయ పిండివంటలు …

బామ్మ వయసు 96.. మార్కులు 98

కేరళ, నవంబర్ 02, విద్యనేర్చుకోవడానికి వయసు అడ్డంకి కాదని మరో మారు ఈ 96 యేళ్ల బామ్మ నిరూపించింది. ఇటీవల కేరళ ప్రభుత్వం నిర్వహించిన అక్షరాస్యత పరీక్షలో …

Surabhi Gautam

సురభి గౌతమ్ ఐఏఎస్

స్వంతంగా చదువుకుని IAS సాధించిన సురభి కొత్త ఢిల్లీ, అక్టోబర్ 17, అన్ని అవకాశాలుంటేనే చదవడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకుని కూడా …

జాతీయ మహిళా రైతు దినోత్సవం

తిరుపతి, అక్టోబర్ 15, దేశ ఆహారభద్రతలో మహిళా రైతులు, మహిళకర్షక కార్మికులు ప్రధాన భుమిక వహిస్తున్నారు. కానీ, వ్యవసాయ రంగంలోని పురుష కార్మికుల కంటే మహిళలకు 22 …

నేడు అతర్జాతీయ బాలికాదినోత్సవం

తిరుపతి, అక్టోబర్ 11,  మనది పురాతన సంస్కృతి. ఈదేశంలో స్త్రీకి అనాదిగా పూజనీయ స్థానం ఉంది. యత్రనార్యంతు పూజ్యతే తత్ర రమంతి దేవతాః అన్న విధానం మనది.  …

చందా కొచ్చర్ గెలుపు-ఓటములు

తిరుపతి, అక్టోబర్ 05, ఐసీఐసీఐ బ్యాంక్లో ఆమె పదవీకాలం చివరి దిశ  వివాదాలతో  నడిచింది. దిగువ స్థాయి నుంచి సిఎండి అధికారి వరకూ ఎదిగి అర్థాంతరంగా ముగిసింది.  …

geta_ econamist-imf

ఐఎంఎఫ్ ఆర్థికవేత్తగా గీత (వీడియో)

అమెరికా, అక్టోబర్ 05, మహిళ అబల కాదు సబల అని మరో తార్కాణం దొరికింది. పురుషాధిక్యం కోనసాగుతున్న ఆర్థికరంగంలో  మరో భారతీయ మహిళ తన ప్రతిభచాటుతోంది.  నిజానికి ఆమె …

యదేఛ్చగా అరబ్ దేశాలకు అమ్మాయిల రవాణా

హైద్రాబాద్, సెప్టెంబర్ 21, మహిళ అనాది నుంచీ శృంగారవస్తువేనా, ఆ ఆధునిక కాలంలో కూడాఇంకా డబ్బున్నవారు… అమ్మాయిలను సంతలో పశువులను కొంటున్నట్టు కొంటున్నారు.  బాగా బలిసిన అరబ్ షేక్‌లు.. …

డ్రై ఫ్రూట్ మోదకాల నైవేద్యం

తిరుపతి, సెప్టెంబర్ 10, జనులంతా భక్తితో కొలిచే వినాయక చవితి పండగ మరెంతో దూరంలో లేదు. చవిత అంటే బొజ్జగణపయ్యకు కుడుములు ఉండ్రాళ్లు ఇలా చాలా ఫలహారాలతో …

డ్రై ఫ్రూట్ మోదకాల  నైవేద్యం

తిరుపతి, సెప్టెంబర్ 10, జనులంతా భక్తితో కొలిచే వినాయక చవితి పండగ మరెంతో దూరంలో లేదు. చవిత అంటే బొజ్జగణపయ్యకు కుడుములు ఉండ్రాళ్లు ఇలా చాలా ఫలహారాలతో …

కుమార్తెకు తండ్రి సెల్యూట్

హైదరాబాద్, సెప్టెంబరు 03, సాధారణంగా ఇటువంటిది కథల్లోనూ, సినిమాల్లోనూ జరుగుతూ ఉంటుంది. అయితే నిజానికి జీవితం కూడా మరింత వింతైన కథావేదిక కదా, ఇక్కడా గమ్మత్తులు జరుగుతూనే …

హవ్వ..! బాలుడు కూడానా..?

హైదరాబాద్, ఆగస్టు 31, బాలికపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లోని బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసు కుంది. ఘటనకు పాల్పడ్డ మైనర్‌ను జువైనల్‌ హోంకు …

Student-professor- sex-abuse –tamilnadu

రా!.. కోరిక తీర్చమన్న ప్రోఫెసర్..

తమిళనాడు, ఆగష్టు 23, తన దగ్గర చదివే అమ్మాయిలను కన్నబిడ్డల్లా చూసుకోవాల్సిన ఓ గురువు కీచకుడిగా మారాడు. తన కోరికను తీర్చాలని, రెండో భార్యగా ఉంచుకుంటానని వేధించాడు. …

 ‘మానవ సహిత వ్యోమనౌక’ ప్రాజెక్ట్ సారథి లలితాంబిక

కొత్త ఢిల్లీ, ఆగష్టు 20, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోపురుషులు – మహిళా శాస్త్రవేత్తలు అనే వివక్ష ఏదీ లేదు. పురుషులు, మహిళల మధ్య ఇస్రో …

death- mp-chennupati vidya-gora

మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య  మృతి

విజయవాడ, ఆగష్టు 18 , మాజీ ఎంపీ, ప్రముఖ సంఘ సేవకురాలు చెన్నుపాటి విద్య (84) కన్నుమూశారు. విజయవాడ పటమటలంకలోని ఆమె నివాసంలో శనివారం వేకువజామున కన్నుమూశారు.  …

చిన్నా పెద్దా కూడా చూడ్డం లేదు ..

హైదరాబాద్‌, ఆగష్టు 17 , తెలంగాణ రాజధాని హైదరాబాద్లో రోజు రోజుకూ పోకిరీల బెడద ఎక్కువవుతోంది. మహిళలు, యువతులు, బాలికలను కూడా వదలకుండా అకతాయిలు వేధిస్తున్నారు. ఇటీవల …

శ్రావణ శుక్రవారం    

తిరుపతి, ఆగష్టు 15, సంసారం సాగరం అన్నారు. కష్టాలు లేని మనుష్యులే లేరు. ఆర్థిక పరమైన సమస్యల వలన జీవితంలో ఎందరో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థిక, …

is it variegation?

శాకాహారమే.. నా !?

తిరుపతి, ఆగష్టు 15, మనలో చాలామంది మాంసాహారం తినరు, మాంసాహారం విక్రయించే హోటళ్లకు కూడా రారు. పక్కా శాకాహారులం అంటూ ఉంటారు. ఇదిగో వారికోసమే .. కొన్ని …

ఇక మందుబాబులకు కష్టమే.. ఎందుకో..?

తిరుపతి, ఆగష్టు 09, తాగి వాహనాలు నడపొద్దని ప్రభుత్వం చెబుతోంది, కుటుంబంచెబుతోంది, చివరకు పిల్లలు కూడా, నాన్నా తాగి బండెక్కొద్దు అంటున్నా మందు బాబులు మాత్రం పూటుగా …

గూగుల్ గెలిచిన తెలుగమ్మాయి ఏడాదికి రూ. 1.20కోట్ల వేతనం

హైదరాబాద్, ఆగష్టు 07, తెలంగాణలోని వికారాబాద్‌కు చెందిన తెలుగమ్మాయి కుడుగుంట స్నేహారెడ్డి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. కారణం.. తమ సంస్థలో పనిచేసేందుకు గూగుల్ ఎంపిక చేసిన అత్యంత …

ఐన్ స్టీన్ ను మించిన తెలివి

బ్రిటన్, ఆగష్టు 04, ఇంగ్లాండులో నివశిస్తున్న ఇద్దరు భారత సంతతి బాలికలు అద్భుతం సృష్టించారు. మెన్సా ఐక్యూ పరీక్షలో 162 పాయింట్లతో ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలు స్టీఫెన్ …

అరటి ఆకులో భోజనం – ఆరోగ్యకరం

భోజనం భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆహారం లోనికి తీసుకోవడమే కాదు, ఎలా, ఎందులో తినాలో కూడా మన పూర్వులు నిర్ణయించారు. మన సంప్రదాయం ప్రకారం అరటి ఆకుల్లో …

తగ్గిన బంగారం అమ్మకాలు

ముంబై, ఆగష్టు 02, పసిడి మీద ఇష్టం లేని మహిళలు ఎక్కడా ఉండరు. బంగారంతో స్త్రీలకున్న అనుబంధం అటువంటిది. ఇంట్లో జరుపుకునే చిన్న పెద్దా ప్రతి వేడకలో …

బాహుమూలలనూ వదలరా..!

జపాన్, జూలై 31, వెర్రివేయి విధాలని సామెత, అలాగే కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. అలా ఉంది ఈ జపాన్ కంపెనీ వ్యవహారం. వీరు వ్యాపార …

జామ ఆరోగ్య బీమ

అందరికీ అందుబాటులో ఉంటూ, సులభంగా లభించే  జామ  ఆరోగ్యప్రదాయని. ఇదో పోషకాల గని. ఒక్క జామపండు తింటే పది యాపిల్స్‌ తిన్నంత మేలు జరుగుతుందని వైద్య నిపుణులు …

Top Court On Entry Of Women In Sabarimala Temple

ఇక శబరిమల ఆలయంలోకి మహిళలకు కూడా ప్రవేశం…..

ఢిల్లీ, 18 జూలై: 10 నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్న బాలికలు, యువతులు, మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ వేసిన పిటిషన్లపై ఈరోజు సుప్రీం …

పరుగులరాణీ

తిరుపతి, జూలై 16,   పరుగూ, జీవితం రెండూ ఒక్కటే..సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. జీవించాలంటే పరుగెత్తాలి. జీవిత అంతా పరుగే అయినపుడు పరుగు పోటీలో జీవితాన్ని ఎంచుకున్నాను. అదే నా …

అవునా! నిజమేనా ?

ముంబాయి,జూలై 4, తెలుగులో పెద్ద నటుల సరసన పలు చిత్రాల్లో కనిపించి యువతను మెప్పించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ …

ఆమె కళ్లులేని కలెక్టర్

 కళ్లు లేకపోయినా.. కలెక్టరైన   ప్రాంజల్  పాటిల్   విజయగాథ   తిరుపతి, జూన్ 22, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా.. అని రోజూ ఎందరో జన్మిస్తుంటారు, మరెందరో తనువు …

మిస్ ఇండియా వరల్డ్ 2018 గా చెన్నై చిన్నది

 ముంబాయి, జూన్ 20, ఈ ఏడాది నిర్వహించిన 55 వ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ 2018 విజేతగా తమిళనాడుకు చెందిన అనుకీర్తి వాస్(19) ఎంపికయ్యారు. కాగా …

ఆయుధాల ప్రకటనలు నిలిపివేయనున్న ఫేస్ బుక్

కాలిఫోరినయా, జూన్ 16:  ఫేస్ బుక్ లో ఆయుధాలకు సంబంధించిన ప్రకటనల విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్నట్టు ఫెస్ బుక్ ప్రకటించింది. ఆయుధాల ప్రకటనలు 18 ఏళ్ల …

many girls searching for software husbands

సాఫ్ట్‌వేర్ భర్తలే కావాలంటున్న అమ్మాయిలు…

హైదరాబాద్: ఒకప్పుడంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే ఉండేవి. ఎక్కడైనా ఒక ప్రేమ వివాహం జరిగిందంటే నానా రచ్చ చేసి, వారిని శాశ్వతంగా ఊరి నుండి, బంధుత్వాల నుండి …

ola cab driver sexual harassment on lady passenger

మితిమీరుతున్న క్యాబ్ డ్రైవర్లు.. ప్రయాణికురాలి బట్టలు విప్పి…

హైదరాబాద్: నిత్యం బిజీ బిజీగా గడిపే ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్నీ అరచేతిలోనే ఉన్నాయనే భ్రమలోనే …