ఆడపిల్లే అవనికి వెలుగు

ఆడపిల్లే అవనికి వెలుగు చదువులో, పనిలో, తెలివిలో, క్రీడలలో, ఇంటా బయటా ఆకాశంలో సగమంటూ వివిధ రంగాల్లో నేడు అమ్మాయిలు రాణిస్తున్నారు. అయినా ఆడపిల్లలకు నేటికికి సమాజంలో అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై అఘాయిత్యాలు నానాటికి పెరుగుతున్నాయి.   పిల్లలపై లైంగిక దాడుల్లో తొంభై శాతం తెలిసిన వారే చేస్తున్నారు. లైంగిక దాడుల తర్వాత నేరం రుజువు కాకుండా హత్యలు చేయడం మరింత గగుర్పాటు కలిగించే అంశం. ఇరుగుపొరుగు వారు, దగ్గరి బంధువులు సంఘటనకు కారకులైనపుడు పరువు కోసం పోలీస్ స్టేషన్లో నమోదు కానీ ఉదంతాలు అనేకం. పురుషాధిక్యత, వివక్ష, అసమానతలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, సామాజిక, ఆర్థిక కారణాలు, బాల్య వివాహాలు అనేక అంశాలు ఆడపిల్లల అభివృద్ధికి ఆటంకమవుతున్నాయి.  మహిళా సాధికారతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వివిధ సర్వేల  ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం  వందల, వేల సంఖ్యలో పసికందులు, బాలికలు, యువతులు అదృశ్యమౌతున్నారు. నిత్యం గృహ హింసలు, అత్యాచారాలు మితిమీరి పోతున్నాయి. పిల్లలను అపహరించి యాచక వృత్తిలోకి దింపడం, బాలికలను, యువతులను అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మడం, విదేశాలకు తరలిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం స్త్రెలలో అవిద్యే.  దేశంలో, ముఖ్యంగా  గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో  బాలికల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. విద్యా వంతురాలైన తల్లి తన పిల్లలకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానమంకోసం అవసరమైన శిక్షణ నిస్తుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది. స్త్రీలకు తమ కాళ్లపై తాము నిలబడగలమన్న నమ్మకం ఉన్నపుడే  ఆత్మ విశ్వాసం కలుగుతుంది.   మధ్యలో బడి మానివేసే వారి శాతం బాలురకన్నా బాలికలలో ఎక్కువగా ఉంది. ఇది బాలికా విద్యకు పెద్ద ఆటకం. ఆడపిల్లల పెంపకంలో తలిదండ్రులు వ్యత్యాసం చూపుతున్నారు.  తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆడ, మగ తేడాలేకుండా పిల్లలను సమానంగా పెంచాలి. అవకాశాలు కల్పిస్తే బాలికలు కూడా అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఆడపిల్లలు చదువుకు  ప్రభుత్వాలు అనుకూల పరిస్థితులుకల్పించాలి. ప్రతి మండలానికి ఒక బాలికల జూనియర్ కళాశాల  ఏర్పాటు చేసి బాలికా విద్య అవసరాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. బాలికలకు ఉచిత రవాణా, మెరుగైన హాస్టల్ సౌకర్యం కలిగించాలి.  బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను కేటాయించాలి. బాలికల కొరకు ప్రత్యేక నవోదయ పాఠశాలలు తెరవాలి.   బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. బాలికలకు  పౌష్టికాహారం అందేలా చూడాలి. ఓపెన్ స్కూల్, దూర విద్య కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రావాలి.  భ్రూణ హత్యలు నివారించాలి.   బాలికల, మహిళల కోసం చేసిన చట్టాలను పటిష్టంగా అమలుపర్చాలి.  హింస, అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం అందించి దోషులకు కఠిన శిక్షలు విధించాలి.  విద్య, సామాజిక రంగాలలో బాలికల ఎదుగుదలకు 2008 నుండి కేంద్రం  నేషనల్ గర్ల్స్ డేవలప్మెంట్ మిషన్ పేరుతో ప్రతి జనవరి 24 న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నారు. భేటి బచావ్, భేటి పడావ్ పథకం వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నది. బాలికల కోసం ప్రత్యేక సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి బాలికల చదువుకు అనువైన పరిస్థితులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడంవల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ముందుకు వస్తున్నారు. బాలికలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, బాలికల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. జాతీయ అక్షరాస్యతతో పోలిస్తే తెలంగాణలో బాలికల అక్షరాస్యత శాతం ఎక్కువ. చదువులోనేగాక క్రీడా, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో కూడ వారు రాణిస్తున్నారు.  పర్వతారోహణలో కూడా తమకు సాటి లేరని నిరూపించు కుంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల వలన బాల్యవివాహాలు  తగ్గుముఖం పట్టాయి. చదువు తర్వాతే పెళ్లి అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.  డయల్ 100 నెంబర్ గురించి పోలీసులు వివిధ పాఠశాలలో, కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు కూడా బాలికల భద్రతకు భరోసాగా నిలుస్తున్నాయి. బాలికలను సామాజిక వివక్షత, దోపిడీ నుండి రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ భాద్యతే కాకుండా ప్రతి ఒక్కరిది. ఆడపిల్లల పట్ల వివక్షతకు తావులేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడ, మగ వ్యత్యాసాలు సమసిపోయి ఆడపిల్ల అవనికి నిజమైన వెలుగు అవుతుంది. …

‘వ్యాక్సీన్‌ కాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్’…   హైదరాబాద్‍ 

‘వ్యాక్సీన్‌ కాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్’…   హైదరాబాద్‍   కోవిడ్‌-19 కల్లోలానికి ఊపిరాడక సతమతం అవుతున్న సమయాన ప్రపంచ మానవాళికి వ్యాక్సీన్‌ అందుబాటులోకి రావడం శుభపరిణామం. కరోనా సవాళ్ళను అవకాశాలుగా మలుచుకుని ప్రఖ్యాత ఫార్మా కంపెనీలు టీకాలను కనుగొని ప్రపంచ  ప్రజల ఆరోగ్యానికి భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తున్నాయి. భారత్ లోని హైదరాబాద్‍ ఫార్మా కంపెనీలు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలతో తీవ్ర వ్యాధులు ప్రబలినపుడు  క్రియాశీలత గల టీకాను అతి తక్కువ ధరలకు అందించడంలో అనేక సార్లు సఫలమైనాయని చరిత్ర చెబుతున్నది. హైదరాబాద్‍ కేంద్రంగా కోవిడ్‌-19 ఔషధాలు రెమ్‌డెసివిర్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌,  ఫవీపిరవిర్‌ వంటివి ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.  కోవిడ్-19ను నిరోధించే టీకాను దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయడానికి భారత్ కేగాక ప్రపంచ దేశాలకు హైదరాబాద్‍ కేంద్ర బిందువుగా మారింది. ఇండియాలో కోవిడ్‌ టీకాలను …

“గ్రంథాలయోద్యమ సంస్కర్త” మాడపాటి హనుమంతరావు

“గ్రంథాలయోద్యమ సంస్కర్త” మాడపాటి హనుమంతరావు…. గ్రంథాలయోద్యమం సంఘ సంస్కరణ  వయోజన విద్య  స్త్రీవిద్య మహిళాభ్యదయం సాహిత్య వికాసం సాంస్కృతికభివృద్ధి వంటి అనేక ఉద్యమాల ద్వారా తెలుగు జాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి.. ఆయనే మాడపాటి …

వంటింటి వైద్యo  కొత్తిమీరతో ఆరోగ్యం :

వంటింటి వైద్యo  కొత్తిమీరతో ఆరోగ్యం : కొత్తిమీర. వంటింటి వైద్యానికి పేరుపొందినది. ఎక్కడపట్టినా దొరుకుతుంది. చౌక కూడా. ఇది సర్వకాల  సర్వావస్థల్లోనూ మనకు అందుబాటులో ఉండే ఆకుకూర పదార్ధం. కొత్తిమీర ఆహర పదార్థాల …

స్వాతంత్ర్య చరిత్రలో “అల్లూరి” ఒక మహోజ్వల శక్తి

స్వాతంత్ర్య చరిత్రలో “అల్లూరి” ఒక మహోజ్వల శక్తి  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఈయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో …

రాణా ప్రతాప్

రాణా ప్రతాప్ మహారణా ప్రతాప్ సింహ్ అసలి పేరు కుంవర్ ప్రతాప్ జి, ఆయన రాజస్థాన్ సూర్యవంశం లో కుంబల్ ఘడ్ లో 9 మే,1540 న …

తెలంగాణ కీర్తిపతాక “వానమామలై వరదాచార్యులు”

తెలంగాణ కీర్తిపతాక “వానమామలై వరదాచార్యులు” తెలంగాణా ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత వానమామలై వరదాచార్యులు ప్రస్తుత వరంగల్ అర్బన్      జిల్లా, కాజీపేట మండలం మడికొండ …

వ్యక్తిత్వాన్ని వికాసాన్ని పెంచే విద్య నేటి అవసరం. 

వ్యక్తిత్వాన్ని వికాసాన్ని పెంచే విద్య నేటి అవసరం.  విలువలను పెంచేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రకృతిలో సర్దుబాటుకు తోడ్పడేది, మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, …

గోదావరి బరాజ్ నిర్మాత సర్ ఆర్థర్ కాటన్ (2)

నిన్నటి తరువాయి-   నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం (మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి అర్ధం.) ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా అభివృద్ధి పరచి, ధృడంగా  కట్టారు. కాటన్ మ్యూజియం కాటను దొర చేసిన సేవలను గుర్తుంచుకొని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఆయన పేరుమీద ఒక మ్యూజియం ఏర్పాటు చెయ్యడం సంతోషించదగ్గ విషయం. ఈ మ్యూజియం  ధవళేశ్వరం ఆనకట్టకు దగ్గరగా, కాటన్‍దొర ఆనకట్ట కట్టేటప్పుడు కార్యాలయంగా ఉపయోగించిన అలనాటి భవనంలో ఏర్పాటుచేసారు. రెండంతస్తుల భవనమిది. రాతిగోడలకట్టడం, పైకప్పు పెంకులతో నిర్మించారు.. భవనంచుట్టూ ఆవరణలో పూలమొక్కలు, ఫెన్సింగు మొక్కలు ఉన్నాయి. మ్యూజియం ఆవరణమీదుగా,మ్యూజియం భవనానికి అతిచేరువగా ఆనకట్టకు వెళ్ళు రహదారియొక్క ఫ్లైఒవర్ వంతెన ఉన్నది. ఈవంతెన క్రింది ఖాళీ భాగంలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాలనాటి పురాతన యంత్రాలు(రివెటింగ్ యంత్రం, స్టీం బాయిలర్లు, కంప్రెసర్లు, సానపట్టు యంత్రాలు, బోరింగ్ యంత్రాలను ఉంచారు. ముఖ్యభవనానికి కుడివైపున అలనాటి రెండు పిరంగులను ఉంచారు. మ్యూజియంలోని క్రిందిగదులలో, ఆనకట్టకు సంబంధించిన వివరాలు, కొన్ని నమూనాలు ఉన్నాయి. మధ్య హాలులో ఆనకట్ట నిర్మాణానికిచెందిన చిత్రాలతో కూడిన వివరాలున్నాయి. మరొక హాలులో కాటన్ దొర జీవిత విశేషాలు వివరించిన ఫలకాలున్నాయి. మరొక హాలులో గోదావరినది రాజమండ్రి నుండి, సముద్రంలో కలియు వరకు నమూనా ఉంది. ఈ నమూనాకు వెనుక గోడపై, ఆనకట్ట నిర్మాణవిశేషాలు, ఎన్నిఎకరాలకు నీరందుతున్నదనే వివరాలు ఉన్నాయి. పై అంతస్తులో ఆంధ్రప్రదేశ్ లోని ఇతరప్రాజెక్టుల వివరాలు, కొన్ని నమూనాలు, కాటన్ ఆధ్వర్యంలో ఇతరచోట్ల జరిగిన పనుల చిత్రాలు ఉన్నాయి. దిగువ గదిలో కాటన్ దొర మునిమనుమడు ఈ మ్యూజియంను సందర్శించినప్పుడు వ్రాసిన స్పందన చిత్రము ఉన్నది. కాటన్ వివిధ వయస్సు లలోని చిత్తరువులు, తల్లిదండ్రుల చిత్రాలు, కాటన్ బస్ట్‍ సైజు విగ్రహం ఉన్నాయి. మ్యూజియం బయట అవరణలో గోదావరినది నాసిక్ లోపుట్టి బంగాళాఖాతంలో కలియువరకు చూపించే నమూనాఉంది. ఈ మ్యూజియం పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యం. ఆనకట్టకు వాడిన యంత్రాలు బయట ఉంచడం వలన వాటిమీద దుమ్ము, ధూళి చేరిపోతున్నది. భవనం కిటికీ తలుపులు విరిగి ఉన్నాయి. ఎవవరైనా సులభంగా లోనికి జొరబడి, వస్తువులను దొంగలించే అవకాశమున్నది. మ్యూజియం లోపల గైడ్ లేడు, వాటి ప్రాముఖ్యత్యను వివరించటానికి. నమునాలు కూడా చాలా వరకు రంగువెలసి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఇంకా అయన్ని గుర్తుంచుకొని ఊళ్ల లో విగ్రహాలు పెడుతున్నారు. కాని పాలకులే ఆయన్ను విస్మరించారు.. ….. -నందిరాజు  రాధాకృష్ణ

గోదావరి బరాజ్ నిర్మాత సర్ ఆర్థర్ కాటన్ (1)

గోదావరి బరాజ్ నిర్మాత సర్ ఆర్థర్ కాటన్  నీటివనరులె జాతి సిరులని, జనుల కొఱకే మనిన కారణజన్ముడవు నీవు, ఇది నీవు పెట్టిన దీపమే! నిత్యగోదావరీ స్నాన పుణ్య దోయా మహామతిః స్మరామ్యాంగ్లదేశీయం కాటనుం, తం భగీరథం! కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15న ఆక్స్‌ఫర్డ్ లో హెన్రీ కాల్వెలీ కాటన్, ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. కాటన్ తన జీవితాన్ని భారతదేశంలో నీటిపారుదల,కాలువలు కట్టించడానికి ధారపోసాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే నెరవేరింది. 1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళఒలో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడయ్యాడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ ఆర్టిలరీ ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన,అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి.కాటన్ 1836- 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు.ఆ తర్వాత 1847- 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేసాడు.క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది.ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తిచేసాడు.కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దొరదే.ఇంతేకాక ఆయన బెంగాల్,ఒరిస్సా,బీహార్,మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగ పడటానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసాడు.ఆ మనీయుడు, 25-07-1899న,  డోర్కింగ్ లో  (బ్రిటన్) మరణించారు. తెలుగు వారేకాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, బీహారీలు… మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు. గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంద్ర దేశానికి ‘అన్నదాత’ గా ప్రసిద్ధి చెందిన కాటన్ దొర పాలరాతి విగ్రహాన్నిఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. కొన్నేళ్ళక్రితం  క్రితం కాటన్ దొర మునిమనవడు అయిన శ్రీ రాబర్ట్ కాటన్, ఆంధ్రదేశానికి వచ్చి,గోదావరీ తీరాన్నిమొత్తం తనివితీరా పరిశీలించి,ఆంద్రదేశ ప్రజలు,కాటన్ దొరని స్మరించుకుంటున్నతీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు.. …

జై భవాని — వీర శివాజి  

జై భవాని — వీర శివాజి   భారతదేశంలో పరంపరాగతంగా వస్తున్న అనేక శక్తివంతమైన సామ్రాజ్యాలను కూలగొట్టి, భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని కంకణం కట్టుకొని మరీ ప్రయత్నించిన …

పిల్లల పెంపకంలో పెనుసవాళ్లు.. 

పిల్లల పెంపకంలో పెనుసవాళ్లు..   సృష్టిలో ఏ తలిదండ్రులకు బిడ్డలపై ప్రేమ లేకుండా ఉండదు. పురాణ కాలంలో ప్రహ్లాదుని తండ్రి  హిరణ్య కశ్యపుని నుండి  నేటి తరం పేరెంట్స్ వరకు ఎవరూ తమ బిడ్డలు వృద్ధి లోకి రావాలనే తప్ప చెడిపోవాలి, సమాజానికి హానికరంగా మారాలని కోరుకోరు. కాని వారి వారి పెంపకం లో ఉన్న వైరుధ్యాల వలన బిడ్డలు వివిధ రకాలుగా ఎదిగి తరువాత గొప్ప వారిగా లేదా నేరస్తులుగా మారే అవకాశం ఉంది. పిల్లల పెంపకంలో మన దేశంలో నేటి తరం అనుసరిస్తున్న విధానాలు సరయినవా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే,   నిరశాజనకమైన పరిస్థితి కనిపిస్తుంది. మనకు కొంత కష్టమయినప్పటికీ ఒప్పుకొని తీరవలసిన నిజం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలన కొంత వరకు మేలు జరిగిందన్నది నిజం.  ప్రస్తుత కాలంలో నిరంతర వేగం, పోటీతత్వం, సంపాదన, త్వరగామారుతున్న  జీవన విధానంలో తలిదండ్రులు పిల్లలకు సరయిన న్యాయం చెయ్యలేక పోతున్నారు. ఉరుకులు పరుగులతో కష్టపడి పనిచేసి బిడ్డలకోసం డబ్బు సంపాదిస్తున్నారే తప్ప వారికి కావలసిన సమయాన్ని, అనురాగాన్ని కేటాయించలేక పోతున్నారు. డబ్బు వారికి మంచి జీవితాన్ని ఇస్తుందని భ్రమ పడుతున్నారు. పిల్లల పెంపకంలో జరుగుతున్న పొరబాట్లకు కారణాలు అనేకం. అనేక సామాజిక కారణాలవలన ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ఆలస్యంగా, వయసు పైబడినతరువాత జరుగుతున్నాయి. వివాహం ఆలస్యమవటం వలన ప్రణాళిక లేకుండా పిల్లలను కనటం, సరయిన వనరులు లేకపోవటం, పిల్లల ఆలనాపాలన చూసుకోనేవారు లేకపోవటం, జీతాలకు పెట్టుకునే ‘ఆయా’ల పైన, డే కేర్ కేంద్రాలపైన ఆధారపడవలసి వస్తున్నది. పిల్లల పుట్టిన రోజులు జరుపుకోవటంలో ఉన్న శ్రద్ద వారిపెంపకంపై లేకపోవటం విచారకరం. పిల్లల పెంపకం అంటే వారిని ఖరీదయిన స్కూల్ లో చేర్పించడం, ట్యూషన్ లు చెప్పించడం, ఖరీదయిన వస్తువులను కొనియ్యడం మాత్రమే కాదు. వారు తల్లి కడుపులో పడ్డప్పుడు నుండి పెంపకంలో సరయిన శ్రద్ధ అవసరం. గర్భవతి  అయిన స్త్రీ సరయిన ఆహారం తీసుకోక పోవడం పుట్టబోయే బిడ్డ ఎదుగుదల మీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా తను గర్భవతిగా ఉన్నప్పుడు ఎదుర్కున్న పరిస్థితులు, మానసిక పరిస్థితుల ప్రభావం పుట్టబోయే బిడ్డపైన ఉంటుంది. గర్భధారణకు ముందు పేరెంట్స్ కు కౌన్సెలింగ్ అవసరం. ఈ కాలంలో సిజేరియన్లు విపరీతంగా పెరిగాయి. ఆ ప్రభావం భవిష్యత్తులో పిల్లల మానసిక పరిస్థితిపైన విపరీతంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. పూర్యం ఉమ్మడి కుటుంబాలలో తాత, నానమ్మ, పిన్ని, చిన్నాన్న, మేనత్త ఇలా అనేక బంధుత్వాలమధ్య పెరగటం వలన పిల్లలపై ఎవరో ఒకరు శ్రద్ద వహించే వారు. ఇప్పుడు ఆవిధమైన కుటుంబ వ్యవస్థ నగరాలలోనే కాదు చిన్న పట్టణాలలో కూడా కనిపించదు. ఇందుకు అనేక కారణాలు అనేకం ఉన్నప్పటికీ, పోటీ ప్రపంచంలో ఆర్ధికంగా నిలద్రోక్కుకోవాలనే తపన ముఖ్యమయినది. తల్లి, తండ్రి ఇద్దరూ కూడా సంపాదిస్తే తప్ప ఆర్ధికంగా నిలద్రోక్కుకోలేని పరిస్థితి. ఫలితంగా పిల్లల పైన తలిదండ్రులు సరైన శ్రద్ధవహించలేక పోతున్నారు. కుటుంబ నిర్వహణ ఖర్చులు, జీవన విధానం వేగంగా మారడం వలన తల్లి, తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేయవలసిన పరిస్తితి ఏర్పడిని. అందువలన పిల్లలపై శ్రధవహించే సమయం లేకపోవటం కారణగా తాత, నానమ్మలపైనానో, ఆయాల పైననో పూర్తిగా వదిలేయవలసి వస్తున్నది. తాత-నానమ్మల వద్ద పరవలేదుకానీ ఆయాలౌ,బేబీ కేర్ సెంటర్ళు వ్యాపార ధోఋఅని కావడం వలన.. అక్కడ పిల్లలపై తగిన అజమాయిషీ ఉండడంలేదు. తల్లి దండ్రులు తమకు సమయం దొరికినపుడు పిల్లలను అతి గారబం చెయ్యడం, అవసరం అయిన వాటికంటే ఎక్కువ సౌపాయాలు కల్పించడం వలన వారు మొండిగా మారే అవకాశం ఉంది. దీనికి తోడు, ఈ రోజుకి కూడా మన దేశంలో మగ పిల్లవాడిని వంశోద్ధారకునిగా, ఆడపిల్లను బరువుగా భావించడం సర్వ సాధారణ మైపోయింది. ఆకారణంగా పిల్లల మానసిక పరిస్థితిలొ ఎదుగుదల కరవైంది. అనుకర్రణ అనేది పిల్లలు నేర్చుకోనే విధానాలలో ముఖ్యమయింది. తల్లి దండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లి దండ్రులు  ఒక పని  వారు చేస్తూ దానిని పిల్లలతో వద్దు అని చెబుతూ ఉంటారు. ఉదాహరణకు తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకుని తాగకూడదు అని చెబుతాడు. తల్లి టీవీ చూస్తూ పిల్లలను చూడకూడదని చెపుతుంది. పిల్లల్లు తల్లి దండ్రులు ఏమి చెప్పారో కాకుండా ఏమి అనుసరిస్తున్నారో వాటిని చేర్చుకుంటారు. తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చటం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలకు చాల ఇబ్బంది కరమయిన పరిస్థితి. నిజానికి ఏ ఇద్దరు పిల్లలు ఒకే విధంగా ఉండరు. ఏ ఇద్దరినీ పోల్చటం మంచిది కాదు. పిల్లలను కనగానే వారిని పెంచే అవగాహన వచ్చినట్లుగా భావిస్తుంటారు. పిల్లలను పెంచడం అతి క్లిష్టమయిన విషయం. సరైన శిక్షణ, ఓర్పు ఏంతో అవసరం. ఆ మార్గంలో తలిదండ్రుక దీటైన కౌన్సెలింగ్ చాల అవసరం. కాని మన దేశంలో అటువటి విధానాలు, సదుపాయాలు ఎక్కువగా కనిపించవు. అంతే గాక ప్రసారమాధ్యమాల ప్రభావం పిల్లలపై పెద్దగ పడడాన్ని గమనించాలి. అవి ఒకవిధంగా సమాజానికి మంచి చేస్తున్నా, మరో విధంగా హాని కలిగిస్తున్నాయి. తలిదడ్రులకు సమయంలేక పోవటం, సహనం నశించడం వలన పిల్లలు టీవీ, వీడియొ గేమ్స్, ఇంటర్నెట్ వైపు ఆకర్షితులవుతున్నారు.  పెద్దవారు తాము సీరియల్స్ చూడటం కోసం పిల్లలను కూడా ప్రోత్సహిస్తారు. పిల్లలు ఆ పాత్రలను అనుకరింస్తూ ఎన్నో నష్టాల పాలవుతున్నారు. స్కూళ్ళలో ఆట స్థలాలు లేక పోవటం. చిన్నవయస్సులో వారికి ఇష్టపడేవి కాకుండా, ఎక్కువ సంపాదనకు అనువయిన చదువుల లక్ష్యంతో   ఒత్తిడి చేయటం ఒక కారణం.. సృజనాత్మక విలువలు క్షీణించడం, సమాజంలో ద్వంద్వప్రమాణాల ప్రభావం పిల్లలపై పైచేస్తున్నాయి. పిల్లలపట్ల ఆసక్తి, వారి ఉద్దేశ్యం మంచిదే అయినా అనుసరిస్తున్న అనుసరిస్తున్న విధానాలలో లోపాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని అధిగమించడానికి ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు అందరు కూడా మూలల నుండి మార్పుకు కృషి చెయ్యాలి. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లను భాధ్యతాయుత  పౌరులుగా తీర్చి దిద్దటం ప్రధమ కర్తవ్యం. -నందిరాజు రాధాకృష్ణ

అరవిందమహర్షి

అరవిందమహర్షి  మానవులు పుడతారు, మరణిస్తారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. కోటాను కోట్ల జనంలో బహు కొద్దిమంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచం లో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అరబిందో- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గంలో ప్రయాణించేందుకుకృషి చేద్దాం. ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లదొరల పాలననుంచి విముక్తి కలిగి దేశమాత దాస్య సృంఖలాలు తెగిపోయాయి. మమకు స్వాతంత్ర్యం లభించింది. అరబిందో(అరవిందో) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు. ఆధ్యాత్మిక సాధనవల్ల అత్యుత్తమ స్థాయికి ఎదిగిన మహనీయుల్లో శ్రీ అరవిందో ఒకరు. అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్‌కతా లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతాదేవి. తండ్రి కె.డి.ఘోష్. తండ్రి వైద్యుడు. బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్యవిద్య నభ్యసించారు. అరబిందో అద్భుతమైన మేధాశక్తి తో గ్రీక్, లాటిన్‌ వంటి విదేశీ భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఐ.సి.యస్. మొదటి స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ లో అద్భుత పావీణ్యం సంపాదించారు. అరబిందో తొలుత రాజకీయాల పట్ల అమితాసక్తి ప్రదర్శించారు. క్రమేపీ రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు మళ్ళారు. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్‌కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి. పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవైనాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించారు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవారు.  ప్రపంచాన్ని సత్యమార్గంలో నడిపించేందుకు యోగ సాధనలో చరిత్ర సృష్టించిన భగవాన్ శ్రీ అరవింద శ్రీ అన్నై పవిత్ర సమాధి తమిళనాడులోని పుదుచ్చేరిలో వెలసి ఉండటం ఎంతో భాగ్యమని ఆధ్యాత్మిక పెద్దలంటూ ఉంటున్నారు. ఆధ్యాత్మికమార్గంలో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే త్రాటిపై నడిపించే తరహాలో ఎన్నో శుభకార్యాలు శ్రీ అరవిందర్, అన్నై ఆశీస్సులతో జరిగాయని, ఒక మారు పుదుచ్చేరికి వెళ్లి వస్తే.. జీవితాలు మలుపులు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అంటుంటారు. అలాగే శ్రీ అన్నై మాతను స్మరించుకుని ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించేవారికి ఆటంకాలుండవని భక్తుల విశ్వాసం. అలాగే జీవిత …

చే యెత్తి జైకొట్టిన తెలుగోడు.. వేనోళ్ళ కీర్తించిన మొనగాడు..

చే యెత్తి జైకొట్టిన తెలుగోడు.. వేనోళ్ళ కీర్తించిన మొనగాడు.. వేములపల్లి శ్రీ కృష్ణ   “చేయెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి గలవోడా” గీతం తెలుగు సాహిత్య కీర్తికిరీటంలో కలికి తురాయి.  ఆ గీతంతో తెలుగుజాతి చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రజాకవి అని ఈ …

విలువలున్న విద్య అవసరం

విలువలున్న విద్య అవసరం  విద్య విలువైన భూషణం. అమూల్యమైన వరం. ఎన్ని ఉన్నా విద్య లేకపోతే అన్నీ వ్యర్థం. ‘విద్యలేని వాడు వింత పశువు’ అన్న నానుడి తెలిసిందే. విద్య, …

ఇంటర్-వ్యూహం

ఇంటర్-వ్యూహం ఉద్యోగానికి ఎన్నిక కావాలంటే పూర్వంలా ఇంటర్వ్యూలే కాక, అంతకు ముందుగా రాత పరీక్షలు కూడా ఉంటాయి. కొన్ని సంస్థల్లో  రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే …

విజ్ఞాన ఖని   గురువు

”  విజ్ఞాన ఖని   గురువు “ “మాతృదేవోభవ – పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే …

 తల్లి ప్రేమ

 తల్లి ప్రేమ సృష్ఠిలో కరగనిది తరగనిది, మరెందులోనూ కనిపించనిది, భూమి కన్నా విశాలమయినది, చందమామ కన్నా చల్లనయినది, సూర్యుని కన్నా ప్రకాశవంతమయినది, ఆప్యాయత అనురాగాల గొప్ప నిధి, అదే …

గులాంగిరి చేయలేదు! సింహంలా బ్రతికారు: నేతాజి సుభాష్ చంద్ర బోస్

గులాంగిరి చేయలేదు! సింహంలా బ్రతికారు: నేతాజి సుభాష్ చంద్ర బోస్ అలుపెరుగని పోరాటంతో వోటమి ఎరుగని బాల్యం నుండి క్రమశిక్షణ, దేశభక్తి, దైవభక్తి, సాటి మానవులకు సేవ జేయాలనే …

విజయానికి క్రమశిక్షణ అవసరం

విజయానికి క్రమశిక్షణ అవసరం ప్రస్తుతం సమాజంలో యువతకు చదువుతో పాటు, గమ్యానికి చేరుకునేందుకు సరైన దిక్సూచిని తప్పక పాటించాల్సిన అవసరాన్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. జీవితంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాముఖ్యత, సబ్జెక్ట్‌లో …

పెడమార్గం లో యువశక్తి

పెడమార్గం లో యువశక్తి సమాజానికి, దేశానికి, జాతికి, సాహిత్యానికి గొప్ప మేలు చేసినప్పుడే ఒక వ్యక్తిని మహాత్ముడని, మహనీయుడని, మహాపురుషుడని ప్రజలు భావిస్తారు. అంతకు పూర్వం లేని కొత్త వికాసాన్ని, పరిణామాన్ని, సమాజహితాన్ని ఆ వ్యక్తి సాధించినప్పుడు ఆ జాతి జనులకు ఆయన చిరస్మరణీయుడంటాము. దేశంలో యువశక్తి రానురాను పెడమార్గం పడుతున్నది. ఎందరెందరో యువతీ యువకులు నిరుద్యోగంతో కుమిలిపోతున్నారు, అర్ధాకలితో అలమటిస్తున్నారు. సామాజికంగా అన్యాయాలను, అక్రమాలను తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో అరాచకం వైపుకు మళ్ళి దొంగతనాలు, దోపిడీలు, అత్యాచారాలు, మోసాలు మొదలైన వాటికి పాల్పడుతూ అసాంఘిక శక్తులుగా తయారవుతుండగా, మరికొందరు విప్లవం అంటూ పిడికిలి బిగించి, ఎలుగెత్తి నిసదించి తిరుగుబాటుదారులవుతున్నారు. టెర్రరిస్టులు, నక్సలైట్లుగా మారిపోతున్నారు. మరి కొందరు కుల, మత, వర్గ, ప్రాంతీయ, రాజకీయాలపై ఆధారపడే కుహనా ప్రజానాయకుల పద్మవ్యూహాలలో బలైపోతున్నారు. అదుగో – అటువంటి యువతకు ఊరడింపు కల్పించడానికి, స్వయం ఉపాధి పథకాలను అమలుపరుచుకొని వారు సజావుగా బ్రతకడానికి, తలెత్తుకుని ధీరులుగా మసలడానికి సామాజిక కృషి అవసరం. యువశక్తే దేశానికి రక్ష. భారతదేశ సమగ్రతకు, జాతి సమైక్యతకు యువత జీవగర్ర. వారిని సమీకరించవలసి ఉంది. పెడమార్గం పట్టి సమిధలైపోతున్న యువతీ యువకులలో ఆత్మ విశ్వాసాన్ని, ధైర్యస్థయిర్యాలను కల్పించాలి. తమ కాళ్ళపై తాము నిలవగలిగే జీవనాధారాలను చూపాలి. అప్పుడు వారు నిజమైన మానవులుగా సామాజిక బాధ్యతలను పంచుకుంటారు. అందుకే, వారి కోసం ఏదైనా ఒక మంచి పనిచేసి, అటువంటివారికి వెసులుబాటు కల్పించి, పోరుబాట నుంచి మళ్ళించి, ప్రగతి పధాన నిలపాలి. యువశక్తి నిర్వీర్యం కాకుండా చూడడం ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం కాదు.  ఇందుకు ప్రజలు కలిసిరావాలి స్వచ్చంద ప్రజాహిత సేవా సంస్థలు పూనుకోవాలి, సంపన్నులు నడుం బిగించాలి. విజ్ఞులు మార్గదర్శకులు కావాలి. ఈ దేశం తనకు ఏమి ఇచ్చింది అనికాక తన దేశానికి తను ఏమి ఇస్తున్నట్టు అని ప్రతి పౌరుడు పునరాలోచించుకోవాలి. కెరటాలపై తేలుతూ, ఆటుపోట్లను  ఎదుర్కొంటూ, నీటి మీద నిలదొక్కుకుంటూ, నావ గమ్యం  చేరడానికి చుక్కాని మీద నియంత్రణ ఎంత  అవసరమో…మనిషి జీవితంలో కూడా కష్ట, సుఖాలను ఎదుర్కొంటూ, ఆనందడోలికల్లో  తేలియాడుతూ గమ్యాన్ని/లక్ష్యాన్నిచేరడానికి “ఆలోచనల” మీద  నియంత్రణ కూడా అంతే అవసరం..మానవ జీవితాన్ని  దిశా, నిర్దేశం  చేసేది, ముందుకు నడిపే చుక్కాని కూడా “ఆలోచన” లేదా “ఆలోచనల సముదాయమే” ఈ జీవిత అనుభవాల పరంపరలో నేర్చుకునే నీతి, తెలుసుకోవలసిన సత్యం అన్నిటికి మూలం ఆలోచనే! ఒక వ్యక్తి జీవితంలో ఏదైనా సాధించాలంటే దాని గురించి ప్రతి క్షణం లేదా ఎక్కువ సేపు ఆలోచించగలిగితే చాలు.. ఖచ్చితంగా  అనుకున్నది సాదించగలిగే శక్తీ, యుక్తితో పాటు అనుకున్నది తొందరగా  సాదించటానికి వీలవుతుంది. అది చదువు, ఉద్యోగం, స్నేహం,  ప్రేమ, లక్ష్యం ఏదైనా కావొచ్చు, మరేదైనా కావొచ్చు… అది ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా కావొచ్చు,  విజయం నీ ముంగిట అనతికాలంలోనే రెక్కలు కట్టుకొని వాలుతుంది.  మానవ జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దోకోవడానికి  కావాల్సిన ఒకే ఒక ఆయుధం “ఆలోచన” … ఆలోచనలు మంచివైతే పయనం మంచి వైపు… ఆలోచనలు  చెడువైతే దారి చెడువైపు… ఆలోచనలు మాటలుగా; మాటలు చేతలుగా; చేతలు ఇస్టాలుగా; ఇష్టాలు అలవాట్లుగా, ఆచరనలుగా, అలవాట్లు స్వభావాలుగా  (వ్యక్తిత్వంగా), స్వభావాలు తలరాతలుగా పరివర్తన చెందుతాయి..అంటే ఒక్క ఆలోచనల సమాహారమే జీవితాన్ని నడిపే ఆయుధం… మాటే మనం సృష్టించుకొనే ప్రపంచం. అందువల్ల చెడు ఆలోచనలను నియంత్రించుకో, మంచి ఆలోచనలను పెంపోదించుకో, ఆనందకరమైన పరిసరాలను సృష్టించుకో, మహోన్నత వ్యక్తిత్వాన్ని అవలంబించుకో, మంచి సమాజాన్ని సృష్టించుకో, అందరికి ప్రేమను పంచుతూ..అందరికి సేవ చేసుకొంటూ.. జీవిత లక్ష్యాన్ని చేరుకో… జీవిత సమరంలో కష్టాల్, సుఖాల్, దుఖాల్ ఏమి ఎదురైనా మొక్కవోని దైర్యంతో, మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరుకో… ఈ ప్రపంచాన్ని అంతటా ప్రేమను పంచే ఒక ఆనందకరమైన, ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దుకో…. ఇందుకు నీ  వంతుగా మంచి ఆలోచనలు అభివృద్ధి  చేసుకో…. …

అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు అయినా ఆయన…

 అందగాడు కాదు, ఆజానుబాహుడు కాదు    దేశం గర్వించదగిన శాస్త్రవేత్త, రాష్ట్రపతి :  డా. ఏపీజే అబ్దుల్‌కలాం  భారతదేశం గర్వించదగిన శాస్త్రవేత్త, రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే …

సానుకూల దృక్పథమే ఆరోగ్యం

సానుకూల దృక్పథమే ఆరోగ్యం ఆరోగ్యం, ఆనందం, శాంతి సౌఖ్యాలకు సానుకూల దృక్పథమే  సరైన ఔషధం. ఈ భావన వేదకాలం నుంచి ప్రాచుర్యంలో వున్నది. నరకంలో స్వర్గాన్ని, స్వర్గంలో …

వేమన గురించి తెలిసిన కొంత సమాచారం 

వేమన గురించి తెలిసిన కొంత సమాచారం  1829 లో తొలిసారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను ముద్రించారు. తరువాత లభ్యమైన మరి కొన్ని పద్యాలను చేర్చి 1839లో …

పాడి పంటల పండుగ – సంక్రాంతి

పాడి పంటల పండుగ – సంక్రాంతి ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు …

సంస్కృతి, దేశభక్తి, జాతీయ భావం – ప్రతి రూపం : స్వామి వివేకానంద జయంతి నేడే 

సంస్కృతి, దేశభక్తి, జాతీయ భావం – ప్రతి రూపం : స్వామి వివేకానంద జయంతి నేడే  చైతన్య దీప్తి – యువతకు స్ఫూర్తి.. ఆయనే వివేకానంద స్వామి …

ఆంధ్రపత్రిక కు, అమృతాంజన్ కు చిరునామా: కాశీనాథుని నాగేశ్వరరావు.

ఆంధ్రపత్రిక కు, అమృతాంజన్ కు చిరునామా: కాశీనాథుని నాగేశ్వరరావు. ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా …

పాత్రికేయంలో చెరగని ముద్ర “చక్రవర్తుల”

పాత్రికేయంలో చెరగని ముద్ర “చక్రవర్తుల” పాత్రికేయ పితామహుడు, భాషాకోవిధుడు, మార్క్సిస్టు మేధావి విశేష అనుభవజ్ఞ సంపాదకుడు చక్రవర్తుల రాఘవాచారి. సమకాలీన పరిణామాలపై అద్భుత విశ్లేషణ చేయగలిగిన గొప్ప …

“అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ” –  తెలంగాణ ఊపిరి

“అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ” –  తెలంగాణ ఊపిరి   ” తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు …

బహుముఖ ప్రజ్ఞాశాలి రెంటాల గోపాలకృష్ణ.

బహుముఖ ప్రజ్ఞాశాలి రెంటాల గోపాలకృష్ణ.  రెంటాల .. ఆ పేరు వింటేనే.. ఒక కవి, విమర్శకుడు, జర్నలిస్టు, సాహితీవేత్త, అనువాదకుడు, సమీక్షకుడు  గుర్తుకొస్తారు. ఆయన ఒక అధ్యయనశీలి. …

సాంఫిుక సాహిత్యోద్యమ కృషీవలుడు సురవరం. 

సాంఫిుక సాహిత్యోద్యమ కృషీవలుడు సురవరం.  తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, …

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస, ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక నమ్మకం.

గాంధీ అంటే.. ఒక సత్యం, ఒక అహింస, ఒక ప్రేమ, ఒక గౌరవం, ఒక నమ్మకం. (“లోహియా – గాంధి ..  వారిదొక అనుబధం”) ఇరవయ్యో శతాబ్దపు రాజకీయాలు భారత దేశంలో ఒక వ్యక్తి చొరవ, శక్తియుక్తుల చుట్టూనే పరిభ్రమించాయి. ఆయనే మహాత్మా గాంధి. ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ అంటే ఎవరో వెంటనే స్ఫురణకు రాకపోవచ్చుగానీ.. గాంధీ.. మహాత్మాగాంధీ అనే పేరు ప్రతివారికీ నాలుకపై ఆడుతుంటుంటుంది. మస్తిష్కంలో ఆ రూపు మెదలుతుంటుంది. ఆ బోసినవ్వుల వదనం కొల్లాయి వస్త్రాలు, చేతిలో ఓ కర్ర.. మస్తిష్కంలో ఆ రూపు మెదలుతుంటుంది. మహాత్మునికి ఇప్పుడు, ప్రత్యేకంగా ఈ నెలలో అధిక ప్రాచుర్యం లభించింది. ఆయన 150 వ జయంతి అందుకు కారణం. విభిన్న అభిప్రాయాలు, విధానాలు, ఆలోచనా సరళి, జీవన శైలి ఉన్నవారికి కూడా ఆ రోజుల్లో గాంధీ అంటే ఒక ప్రగాఢమైన గౌరవం, నమ్మకం ఉండేవి. కాంగ్రెస్ పార్టీ విధానాలను, వ్యవహార శైలిని వ్యతిరేకించేవారుకూడా మహాత్మా గాంధి అంటే శిరసువంచి గౌరవిస్తారు. అది ఆయన వ్యక్తిత్వం, సౌశీల్యం, నిరాడంబరత, సత్యశోధన, స్వాతంత్ర్య కాంక్ష, అనుసరించిన అహింసామార్గం గొప్పతనమే..నేటి రోజులను పక్కనపెట్టి, గతకాలంలో ఆయనతో కలిసినడిచిన మహోన్నతులనేకమంది. భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్ముని సమకాలీనులను పక్కన పెడితే, జవహర్ లాల్ నెహ్రూ ఆయనకంటే 20 సంవత్సరాలు చిన్న. అయితే గాంధీ కంటే 40 సంవత్సరాలు, నెహ్రూ కంటే 20 సంవత్సరాలు చిన్న అయిన రాం మనోహర్ లోహియ పై వారిద్దరి ప్రభావం ఎక్కువగా ఉండేది. గాంధీ అంటే లోహియాకు అపార గౌరవం. బ్రిటిష్ పాలనా శృంఖలాలు తెంచి భారత దేశానికి స్వతంత్ర్యం సాధించాలన్న దృఢసంకల్పంతో గాంధీ పిలుపు మేరకు ముందుకువచ్చి తమను తాము అంకితం చేసుకునేందుకు సిద్ధమైన వేలాది మందిలో లోహియా ఒకరు. గాంధిజీ, నెహ్రూ వల్లనే రాజకీయాల్లో, స్వాతంత్ర్య ఉద్యమంలో తాను స్ఫూర్తి పొందానని, ఆ లోహియానే చెప్పారు.  నెహ్రూను గౌరవించారు, రాజకీయంగా ఎప్పుడూ తూలనాడలేదు. స్వాతంత్ర్యానంతరం కాల క్రమేణా కాంగ్రెస్‌కు బద్ధ ప్రతిపక్షంగా తయారైన లోహియా, స్వాతంత్ర్యానికి పూర్వం  యువకునిగా కాంగ్రెస్ లో ఒక చురుకైన కార్యకర్త.  భారత జాతీయ …

తెలుగు పత్రికారంగంలో ఘనాపాఠి  పొత్తూరి 

తెలుగు పత్రికారంగంలో ఘనాపాఠి  పొత్తూరి  తెలుగు పత్రికారంగంలో విలువలకు, వ్యక్తిత్వానికి పెద్దపీట వేసి దశాబ్దాలాకాలం ఆ పునాదులమీద తనకంటూ ఒక ప్రత్యేక పాత్రికేయ భవంతిని నిర్మించుకుని, ఆరు దశాబ్దాలకుపైగా అందరి గౌరవం …

నిలువెత్తు కలానికి నీరాజనం:  అక్షర సేనాని ఎబికె 

నిలువెత్తు కలానికి నీరాజనం : అక్షర సేనాని ఎబికె  తెలుగు నేలపై దశాబ్దాలుగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆయన కలలు ఫలించాయనుకుని భ్రమపడ్డాడు పాపం. ఆయన “జర్నలిస్టులను – ఎడిటర్లను” తయారు చేద్దామనే తపన పడ్డాడు. కొందరు సంపాదకులయ్యారు, ఇంకొందరు కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయన కూడా…. ఎందుకంటే ఆయన రాజీపడడు. పడి ఉంటే ఒకే పత్రికలో దర్జాగా వెలుగుతూ ఉండేవాడు. లక్షల నజరానాకు అమ్ముడు పోయి ఉండేవాడు. ఆయనే అన్నే భవానీ కోటేశ్వర ప్రసాద్‌. పూర్తి పేరు కంటే ఎ బి కె ప్రసాద్.. అనో ఎ బి కె అంటేనో పాఠకలోకానికి ఆయన చిరపరిచితం. ఆగస్ట్ నెలకు చరిత్రలో ప్రాముఖ్యం ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం, స్వాతంత్ర్య సిద్ధి ఈ నెలలోనే.. …

బహుముఖ ప్రజ్ఞాశాలి : డాక్టర్ సర్వేపల్లి   

ఆచార్యుడు, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి : డాక్టర్ సర్వేపల్లి    చక్రవర్తి థార్మిక తత్త్వవేత్త అయి వుండాలన్నది గ్రీకు తత్త్వవేత్త ప్లాటో ఆశయం. ప్రపంచంలో అతి పెద్దదైన ప్రజాస్వామ్య భారతదేశానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కావడంతో ప్లాటో ఆశయం కొంతవరకు నెరవేరినట్లే. ఆచార్యుడుగా, విద్యావేత్తగా, రాయబారిగా, రాజనీతిజ్ఞుడుగా, రచయితగా, అసమాన తత్త్వవేత్తగా ప్రపంచ ఖ్యాతినందిన మహాపురుషుడు రాధాకృష్ణన్. సర్వమానవ సౌభ్రాతృత్వంకోసం, స్వేచ్ఛా సమానత్వాలకోసం నిబద్ధతతో అంకితభావంతో ఆయన చేసిన విశిష్ఠ సేవలు సమున్నత వ్యక్తిత్వానికి దర్పణాలు. రాధాకృష్ణన్ ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేదు. సంభాషణల్లో ఎవరినీ నొప్పించిన ఘటనలు లేవు. విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. ఆయన గాంభీర్యం, హుందాతనం చూసి అపరిచితులు తొలుత ఆయనను పలకరించడానికి జంకేవారు. తదుపరి పసిబిడ్డవంటి మృదుమధుర స్వభావాన్ని చూసి విస్తుపోయేవారు. ప్రపంచ దేశాల మత, సామాజిక సాంస్కృతిక రాజనీతి శాస్త్ర సాహిత్యాలను క్షుణ్ణంగా చదివి జీర్ణించుకున్న మహామేధావి రాధాకృష్ణన్. నేటి వైజ్ఞానిక యుగంలో, భౌతిక విజ్ఞానాన్నీ, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ సమన్వయపరుస్తూ దేశ విదేశాల్లో ఆయన చేసిన ప్రసంగాలు ప్రపంచ మేధావుల ప్రశంసలను చూరగొన్నాయి. ప్రత్యేకించి వేద వాఙ్మయాన్ని మధించి శోధించి సాధించిన జ్ఞానామృతాన్ని తనదైన వ్యాఖ్యానాలతో పామరులకు సైతం అర్ధమయ్యేట్లు అందించారు. ఉపనిషత్తులపై, భగవద్గీతపై భారతీయ పురాణేతిహాసాలను తత్త్వశాస్త్ర సంపుటాలుగా ప్రచురించి ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు వివిధ భాషల్లోకి. భారత దేశం గర్వించదగిన ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు, గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888, సెప్టంబర్ 5వ తేదీన తమిళనాడులోని తిరుత్తణి లో సామాన్య కుటుంబంలో …

కొత్త ఏడాదంటే ఉల్లాసం, ఉత్సాహం

కొత్త ఏడాదంటే ఉల్లాసం, ఉత్సాహం కొత్త సంవత్సరం మొదలవుతున్నది. తెలుగు వాళ్లకి రెండు కొత్త సంవత్సరాలు. వ్యవహారికంగా  జనవరి 1న మొదటిదైతే, తిథులప్రకారం, భారతీయ శాస్త్రం ప్రకారం వచ్చే ఉగాది రెండవది. దైనందిన జీవితంలో మనం వ్యవాహరికవిధానాన్నే అనుసరిస్తాం. మనం మాట్లాడుకుంటున్నది జనవరితో మొద్లయ్యే  నూతన సంవత్సర వేళ.. నూతనోత్సాహం ఉప్పొంగే వేళ.. నిన్నటిని దాటుకుంటూ మనతో నడిచి వచ్చిన కాలం. వేసే జీవితపు అడుగు కొత్తగా ఉండాలని కోరుకుంటాం. భవిష్యత్తు ఆశావహ దృక్పథంతో గడపమని, ఆ దారిలో నడవమని, నడుస్తామని నమ్మకం కలిగించే కాలం. నిన్నటి అనుభవం సంతోషపు పూలపరిమళాలు దిద్దిన అందమైన అనుభవాలు కావొచ్చు. చేదు అనుభవాలు వదిలేసి.. కాసిన్ని అందమైన జ్ఞాపకాలను గుండెల్లో అదిమిపెట్టుకుని రానున్న రోజులన్నీ తేజోవంతం కావాలని ఆశించే వేళే నూతన సంవత్సరం. కొత్త ఏడాదంటే ఉల్లాసం, ఉత్సాహంతోపాటు, సాధించాల్సిన లక్ష్యాలేంటో తేల్చుకోవాల్సిన కాలం. జీవనమార్గంలోకి ఆటంకంగా నిలిచే దురలవాట్లకు స్వస్తి చెప్పాలనే నిర్ణయానికి కొత్త ఏడాది ఓ చక్కటి సందర్భం. మంచిని స్వాగతించుకోవడానికి, చెడును వదిలేయడానికి ప్రత్యేకమైన ముహూర్తం. కాలచక్రంతో పోటీపడుతూ మన జీవితంలో వచ్చిపోతున్న ‘ఏడాది’ కాలపు తూకం కావాలి. వెనక్కి తొంగి చూసుకునే సందర్భమూ కావాలి. అలాంటి సంతోషకరమైన సందర్భంలో కొత్తగా కోటి ఆశలు నింపుకోవచ్చు. కొత్తగా జీవితపు లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదు. మంచి మార్పు సాధించాలనే దీక్షకు నాంది పలికే రోజు ఈ కొత్త ఏడాదే. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబన చేసుకుంటే కొత్త సంవత్సరంలో పూసే కోటి ఆశల్ని తురుముకోవచ్చు. కొంగ్రొత్త వేళ.. కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడదాం. కొత్త ఊహలు, కొత్త నిర్ణయాలు గురించి మాత్రమే కాదు, గడిచిన సంవత్సరం తీసుకున్న నిర్ణయాల గురించి పునః పరిశీలన చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చు కోవడానికి చదువుతో సంబంధం లేదు. వయస్సుతో సంబంధం లేదు. పదవీ విరమణతో సంబంధం లేదు. కొత్త విషయాలని నేర్చుకోవాలన్న జిజ్ఞాస ఉండాలి. -నందిరాజు రాధాకృష్ణ

మన తెలుగు సామెతలు (‘చ – ఛ ’ అక్షరములతో)

చంక బిడ్డకు దండం అన్నట్లు చంకన పిల్ల – కడుపులో పిల్ల చంకలో పిల్లను వుంచుకుని సంతంతా వెతికినట్లు చంకెక్కిన పిల్ల చచ్చినా దిగదు చందాలిచ్చాం తన్నుకు …

ఇకపై సన్నీలియోన్ రాత్రి పది దాటిన తర్వాతే!?

ఇకపై సన్నీలియోన్ రాత్రి పది దాటిన తర్వాతే టీవీల్లో!? సన్నీ లియోనా… మజాకా… ఆమె పేరు వినగానే నిద్రలోంచి దిగ్గున లేచే కుర్రకారు నేటికీ ఉంది. నోరెళ్లబెట్టుకుని, …

మాజీ ప్రధానితో పాత్రికేయునిగా మధుర జ్ఞాపకాలు…

మాజీ ప్రధానితో పాత్రికేయునిగా మధుర జ్ఞాపకాలు… శ్రీ పీ వీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనొక సాధారణ పౌరుణ్ణి. విద్యార్థి దశనుంచీ ఆర్జన దశలోకి అడుగుపెట్టిన వయసు. …

ఇవాళ్టిది కాదు. ఆరేళ్ళ కిందటి చెక్కు చెదరని అభిప్రాయం. 

ఇవాళ్టిది కాదు. ఆరేళ్ళ కిందటి చెక్కు చెదరని అభిప్రాయం.      ………………………… కాకా శకం అలా ముగిసిపోయింది.. నేనెరిగిన వెంకటస్వామి కాంగ్రెస్ లో చాలా సీనియర్,, ఇందిర …

నీడలు

నీడలు చిన్నమ్మా వీళ్లమీద కోపగించకు వీళ్ల నసహ్యించుకోకు నిన్నెన్నెన్నో అన్నారు అవమానాల పాల్చేశారు అవినీతి అంటగట్టారు ఆడదానికి సాహసం పనికిరాదన్నారు. చిన్నమ్మా వీళ్లందరూ భయపడిపోయిన మనుష్యులు రేపటిని గురించి భయం …

భారతరత్న లిరువురూ అనర్ఘరత్నాలే

భారతరత్న లిరువురూ అనర్ఘరత్నాలే.   మదన్ మోహన్ మాలవియా, అటల్ బిహరి వాజ్‌పేయీ (నేడే ఇరువురి పుట్టినరోజు) ఏసుక్రీస్తు జన్మించిన తేదీన పుట్టి ప్రపంచ ఖ్యాతి నొందిన …

కడుపు మంట -బైరాగి

కడుపుమంట… అనురాగం అంబరమైతే ఆనందం అర్ణవమైతే మేం తోకచుక్కగా వస్తాం బడబానలమై మండిస్తాం!! ప్రపంచమొక నందనవనమై జీవితమొక గులాబి ఐతే మేం ముళ్ళతొడుగుగా ఉంటాం సుఖస్వప్నం భంగపరుస్తాం!! …

పప్పు పౌష్టికాహారము

పప్పు-రాచ్చిప్ప-ముద్దకవ్వంల కలయిక అపూర్వం. పప్పును రాచ్చిప్పలో వేసి ముద్దకవ్వంతో ఎనిపితే ఆ రుచి అమోఘమని మా అమ్మమ్మ అంటుండేది. నాకు వంటచేయండం అంటే మహా ఇష్టం. ఈరోజు …

పెళ్లిళ్లు – ఈవెంట్ మేనేజ్‌మెంట్

పెళ్లిళ్లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఇటీవల కాలంలో ప్రతి చిన్న వేడుకైనా హంగూ ఆర్భాటాలతో నిర్వహించడం మామూలై పోయింది. దీంతో ఈ ఏర్పాట్లు, అతిథులకు రాచమర్యాదలు, అలంకరణ, భోజనవసతి, …