కట్టలు తెగుతున్న కాసులు

Share Icons:

తిరుపతి, నవంబర్ 30,

ఆట మొదలుపెట్టిన తరువాత గెలవడమే లక్ష్యం కావాలి.  అదే క్రీడా స్ఫూర్తి.. దానినే రాజకీయనేతలు వంటబట్టించుకున్నట్టున్నారు.

తెలంగాణలో ఎటుచూసినా ఎన్నికల హంగామా వెర్రి తలలు వేస్తోంది . గెలుపు కోసం నేతలు సర్వశక్తులూ ఒడ్డుతూ.. జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమకే పట్టం కట్టాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో అన్ని పార్టీలూ బిజీగా మారిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ కృషిలో భాగంగా పలువురు అభ్యర్ధుల ఖర్చు.. నిబంధనల గట్టు దాటిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్ధి ఒక రోజులో రూ.10వేలకు మించి లావాదేవీ చేయకూడదు. టోటల్ గా ఎన్నికల ఖర్చు రూ.28లక్షలు మించరాదు. కానీ ఈ రూల్ ను ఎవ్వరూ పాటించడంలేదన్న టాక్ వినిపిస్తోంది.

దాదాపు అన్ని పార్టీల అభ్యర్ధుల ఖర్చు తడిసిమోపెడవుతున్న పరిస్థితి అని.. ఈసీ సూచించిన కాస్ట్ ను ఎప్పుడో క్రాస్ చేసేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదేమీ వెలుగులోకి రాకుండా నేతలు జాగ్రత్తలు పడుతున్నారని.. సీక్రెట్ గా పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారని సమాచారం. ఎన్నికల కమిషన్ సూచించిన ఖర్చుతో ప్రచారం పర్వం ఉధృతంగా నిర్వహించలేని పరిస్థితి ఉన్నట్లు కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. వివిధ విభాగాల్లో అద్దె చెల్లింపులు ఎక్కువయ్యాయి. ఇక అభ్యర్ధుల వెంట వచ్చే అనుచరులకూ మూడు పూటలా తిండి, అల్పాహారం, స్నాక్స్, కాఫీ-టీల వెల అధికంగా ఉంటోందని అంటున్నారు. వీటి కోసం ఎక్కువగానే ఖర్చు చేయాల్సి వస్తోందని చెప్తున్నారు.

వాస్తవానికి అభ్యర్ధులు ప్రచారం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారన్న విషయం బహిరంగ రహస్యం. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు తమ బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రచారపర్వానికి వెళ్లేటప్పుడు తమవెంట భారీ స్థాయిలో అనుచరగణాన్ని తీసుకెళ్తున్నారు. పొద్దున్నుంచి.. రాత్రి వరకూ.. వీరందరికి అయ్యే ఖర్చులు అభ్యర్ధులే భరిస్తున్నారు. ఇక చాలామంది రాత్రైతే.. అనుచరులకు మద్యం కూడా అందుబాటులో ఉంచుతున్నారు. వీటన్నింటి ఖర్చు పెద్ద మొత్తంలోనే ఉంటోంది. ఇక ప్రలోభాల వల సరేసరి. ఓటర్లను ఆకట్టుకునేందుకు వారికి బహుమతులు ఎర వేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నగదు పంపిణీ కూడా జోరుగా సాగుతోంది.

వీధుల్లో ప్రచారం చేస్తూ.. సీక్రెట్ గా.. కానుకల పంపిణీ జరిగిపోతోంది. ఈ విషయం అందరికీ తెలిసినా.. బాధ్యులపై చర్యలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు. విజయం కోసం నేతలు ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఓటర్లు మాత్రం సమర్ధవంతమైన అభ్యర్ధులకే ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఐదేళ్ల పాటూ ప్రజల ప్రతినిధిగా ఉండే నేతలు సమర్ధులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. కానీ ఇవి కాగితాలకే పరిమితమైనాయి.

ఎన్నికల్లో పోటీ చేస్తున్నావరు హరిశ్ఛంద్రులు కాదు. సచ్చీలురు అంతకంటే కాదు.. నీతులు వింటూ, ఆచరిస్తూ పోవడానికి. వెరసి ఒకరిని చూసి మరొకరు పోటీ పడి ఉచితాలు పంచుతూ, మధ్యం ,మాంసం వంటివి విచ్చల విడిగా ఎరవేస్తూ పేద ఓటర్లను వొడిసి పట్టుకుంటున్నారు.

మామాట: పైసలు లేని రాజకీయం కూడా ఉంటాదా అన్నా…  ఇంకా..

Leave a Reply