ఇంతకీ ఆపద్ధర్మమంటే?

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 07,

సామాజిక మాధ్యమాలు వచ్చిన తరువాత అనేక విషయాలు వైరల్ గా మారుతున్నాయి. కేసీఆర్ గురువారం తన ప్రభుత్వాన్నిత్యాగం చేసి  ముందస్తు ఎన్నికలకు సిద్దపడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగమని కేసీఆర్ ని గవర్నర్ కోరారు. ఈ సందర్భంగా, అసలు ఆపద్ధర్మ ప్రభుత్వం అనేది ఎప్పుడు ప్రచారంలోకి వచ్చిందో తెలుసుకుందాం.

అవి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులు.  బ్రిటన్ ప్రధానిగా విన్ స్టన్ చర్చిల్ కొనసాగుతున్నారు. యుద్ధవిజయాల నేపథ్యంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన చర్చిల్… తన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న యోచనతో, ఇంగ్లండ్ రాజుకు తన రాజీనామాను సమర్పించారు. ఆ మరుసటి రోజే ఇంగ్లండ్ రాజు చర్చిల్ ను పిలిచి, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కార్యనిర్వహణ బాధ్యతలను చూసుకోవాలని చెప్పారు. ఆ ప్రభుత్వానికి కేర్ టేకర్ గవర్నమెంట్ (ఆపద్ధర్మ ప్రభుత్వం)గా నామకరణం చేశారు. అప్పుడే ఆపద్ధర్మ ప్రభుత్వం అనే పదం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అదండి సంగతి. మనకు వాడుకలో ఆపద్ధర్మంగా అనే మాట ఉంది. అంటే ఏదో సాయంగా అని అర్థం. మరి మన రాజ్యాంగంలో మాత్రం అటువంటి పదమేదీ లేదు కాని, ఆపద్ధర్మ ప్రభుత్వం విధులు ఇవీ అని కూడా చెప్పలేదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వమే, కానీ, నైతికంగా మంత్రులు, శాసన సభ్యులు లేని పాలనలో విధాన నిర్ణయాలు తీసికోవడం జరగడంలేదు. ఆపద్ధర్మ ప్రభుత్వాలన్నీ కేవలం రోజువారి విధులు నిర్వర్తించడానికే పరిమితమైన సంప్రదాయం ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే పెద్ద నిర్ణయాలేవీ ఆపద్ధర్మపాలకులు తీసుకోలేదు.

మామాట: సంప్రదాయాన్ని మన దొర సారు పాటిస్తారంటారా…

Leave a Reply