టాప్ గేర్ లో కార్

Share Icons:
హైదరాబాద్, జనవరి22,
ఇటీవలే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఊహించని రీతిలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరేసింది. ఈ ఎన్నికలకు ముందు అసలు కారులో డీజిల్ లేదు! ఇక కారు ఆగిపోవాల్సిందే.. వేరే అవకాశమే లేదు. అంటూ తెగ కామెంట్స్ వినిపించాయి. ఇక కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అయితే ఏకంగా 7 ఓ క్లాక్ బ్లేడు, మెడ కోసుకుంటా! అని మీడియా ముఖంగా తెలిపి.. చివరకు ఆ బ్లేడు పరువే తీశారు. ఇలాంటివన్నీ చూస్తూ.. చూస్తూ చివరకు కేసీఆర్ కే జై కొట్టారు ప్రజలు. దీంతో సీన్ రివర్స్ అయి భారీ మెజారిటీతో గులాబీ దళం అధికారం చేపట్టింది. ఆ తర్వాత పాలనా విషయాల్లో కేసీఆర్ నాన్చుడు ధోరణిపై తీవ్ర వ్యతిరేకతలు వస్తున్నాయి.
దీంతో ఇదే ఆసరాగా తీసుకొని కనీసం పంచాయితీ ఎన్నికల్లో అయినా మా పరువు కాపాడుకుందాం.. అని ఇతర పార్టీలు భావించాయి. కానీ మళ్లీ సీన్ రిపీట్.. మీరే చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో!నిజానికి సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పార్టీలు ఇన్‌వాల్వ్ కావు. ఆదేవిదంగా కారు, హస్తం, కమలం లాంటి గుర్తులు ఎక్కడా కనిపించవు. కానీ ఫలానా అభ్యర్థిని ఏ పార్టీ బలపరుస్తోందనే విషయం మాత్రం అందరికీ తెలుసు. ఆ పార్టీలే సర్పంచ్ అభ్యర్థులకు అన్ని విధాలుగా అండదండలు అందిస్తాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతలుగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో భగంగా ఈ రోజు మొదటి విడత ఎన్నికలు జరిగాయి.
ఇందులో గులాబీ ప్రభావం స్పష్టంగా కనిపించింది. 4479 పంచాయితీల్లో ఈ  ఎన్నికలు జరగగా.. వీటిలో 769 గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. అంటే.. పోలింగ్ నిర్వహించకుండానే గ్రామ ప్రజలంతా కలిసి ఒక సభ్యుడ్ని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నమాట. ఇందులో 610 పంచాయితీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు జనం. అంటే ఇక్కడే కారు మొదటి గేరు పడిందన్నమాట. ఇక గేర్లు మారుస్తూ పరుగెత్తడమే తరువాయి.ల్లెలు గులాబీ పరిమళాలతో గుభాళించాయి. ఎన్నికలు ఏవైనా తాము గులాబీ జెండా నీడనే కోరుకుంటున్నామని ఓటు గుద్ది మరీ తేల్చిచెప్పాయి. బ్యాలెట్ పత్రంలో టీఆర్‌ఎస్ గుర్తు లేనప్పటికీ.. ఆ పార్టీ మద్దతుదారులకు ఘన విజయం కట్టబెట్టాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న టీఆర్‌ఎస్.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే దూకుడు కొనసాగించింది. అనేక జిల్లాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులు క్లీన్‌స్వీప్‌చేశారు. సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏకపక్షంగానే వచ్చింది. తొలి విడుతలో భాగంగా 3701 పంచాయతీలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. మరో 769 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా 4470 గ్రామపంచాయతీలకుగాను కడపటి సమాచారం అందేసరికి టీఆర్‌ఎస్ మద్దతుదారులు ఏకగ్రీవాలు కలుపుకొని 2973 పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేశారు.
861 స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా.. మరే ఇతర పార్టీలు రెండంకెల స్థానాలు దాటలేకపోయాయి. 412 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. వీరిలోనూ స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వతంత్రంగా బరిలో నిలిచిన టీఆర్‌ఎస్ మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తున్నది.
మామాట:  గాలి బలంగా కారు వైపు వీస్తున్నట్టుంది గా, 

Leave a Reply