కెప్టెన్ బాబా కామెడీ: ఇంటి సభ్యులుకు సర్ ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్

captain baba bhaskar full comedy in house..big boss surprise to house members
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ షో ఆసక్తికరంగా సాగుతుంది. ఎప్పటిలానే శుక్రవ్రం ఎపిసోడ్ లో కూడా హౌస్ లో కొన్ని నవ్వులు, కొన్ని ఏడుపులు చోటు చేసుకున్నాయి. మొదట కొత్త కెప్టెన్ బాబా భాస్కర్ ఇంట్లో ఫుల్ కామెడీ చేశారు. అయితే దీని కంటే ముందు ఏ మాత్రం శ్ర‌మించ‌కుండా త‌న‌కి కెప్టెన్ ప‌ద‌వి ద‌క్క‌డంపై బాబా సంతృప్తిగా లేడు. శ్రీముఖి కూడా శిల్పా చ‌క్ర‌వ‌ర్తి వ‌ల‌నే ఈ ప‌దవి ద‌క్కింద‌ని అన‌డంతో ఆయ‌న నిరుత్సాహంగా క‌నిపిస్తూ శ్రీముఖితో మాట్లాడ‌డం మానేశాడు. దీంతో శ్రీముఖి బాబా భాస్క‌ర్‌ ద‌గ్గ‌ర‌కి వెళ్ళి సారీ సారీ అంటూ ఆయ‌న‌ని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. చివ‌రికి బాబా .. శ్రీముఖిని క్ష‌మించేశాడు.

దీని తర్వాత బాబా భాస్కర్ ఇంటిలో ఫుల్ కామెడీ చేశాడు. కెప్టెన్ గా ఇంట్లో నచ్చిన రూల్స్ పెట్టేశారు. ఇంట్లో అమ్మాయిలు పొట్టి డ్రెస్ లు వేసుకొద్దని, నచ్చినప్పుడు పడుకోవచ్చని, ఇంగ్లీష్ మాట్లాడొచ్చని చెప్పేశారు. అలాగే ఇంటి సభ్యులకు ఈ వారం పనుల బాధ్యతలని అప్పగించారు. అలాగే శ్రీముఖిని పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకుని , ఆమెకు స్విమ్మింగ్ పూల్, కోర్ట్ యార్డ్, డైనింగ్ ఏరియా క్లీనింగ్ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత శ్రీముఖిని ఒక ఆట ఆడేసుకున్నారు. ఆమెతో కావాలని గార్డెన్ ఏరియా క్లీన్ చేయించారు.

అలాగే కెప్టెన్, సాయంత్రం పార్టీ ఏమైనా ఉందా.. మందు పార్టీ’’ అని బాబా భాస్కర్‌ను అలీ, మహేష్ అడిగారు. వెంటనే బాబా భాస్కర్ మెయిన్ గేట్ వద్దకు వెళ్లి.. ‘‘హలో వాచ్‌మెన్ డ్రింక్ దొరకుతుందా? హలో బ్రో.. నేను కెప్టెన్ అయ్యాను రెండు కేసుల బీర్, రెండు ఫుల్, బాయిల్డ్ పల్లీ తీసుకువస్తే నేను బయటికి వచ్చినప్పుడు నీ సంగతి చూసుకుంటాను’’ అని బంపరాఫర్ ఇచ్చారు. దీంతో అక్కడ నవ్వుల పువ్వులు పూసాయి.

అలాగే ఈ కామెడీ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ ఇచ్చే ప్రశ్నలకు ఎవరు ఎక్కువ ఫన్నీగా సమాధానం చెబుతారో వారే విన్నర్ గా నిలుస్తారని చెప్పారు. దీంతో అందరూ సమాధానాలు ఇవ్వగా ఎక్కువగా మహేశ్ బాగా ఫన్నీగా సమాధానమిచ్చాడు. విన్నర్ గా మహేశ్ నిలిచాడు. దీని తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. కంటెస్టెంట్లకు తమ ఇళ్ల నుంచే ఫుడ్‌ను తెప్పించి తినిపించారు. అలాగే, వాళ్ల ఇంటి సభ్యులు పంపిన మెసేజ్‌ను కూడా ఫుడ్ బాక్స్‌పై పెట్టి ఇచ్చారు. దీంతో అందరూ ఎమోషనల్ అయ్యారు.

 

Leave a Reply