రాజధాని నిరసనలు: భోగి మంటల్లో బోస్టన్, జి‌ఎన్ రావు నివేదికలు..

capital issue...protests-in-bhogi-celebrations-against-three-capitals-proposals
Share Icons:

విజయవాడ: భోగి పండుగ రోజు కూడా రాజధాని కోసం నిరసనలు ఆగలేదు. అమరావతినే రాజధానిగా ఉంచాలని వైసీపీ మినహా మిగిలిన పార్టీలు జే‌ఏ‌సిగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు భోగి మంటల్లో రాజధానుల నివేదికలను బూడిద చేసారు. పండుగ రోజు భోగి మంటల మధ్య నిరసనలు వ్యక్తం చేసారు. అమరావతి జేఏసీ పిలుపు మేరకు ప్రభుత్వానికి మూడు రాజధానుల పైన అందిని జీఎన్ రావు..బోస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేసి నిరసన కొనసాగిస్తున్నారు.

విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు..జేఏసీ నేతలు..రాజధాని గ్రామాల్లో రైతులు భోగి మంటల్లో ఈ నివేదికలను తగలబెట్టారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలోని ప్రైవేట్‌ స్థలంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. తుళ్లూరులో మహాధర్నా శిబిరం వద్ద బోగీమంటల కార్యక్రమంలో నివేదికల పత్రాలను వేస్తూ..అమరావతికి అనుకూలంగా నినాదాలు చేసారు. పండుగకు దూరంగా ఉండి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రులంతా ఒక్కేటే.. రాజధాని అమరావతి ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అమరావతిని చించాలంటే భవిష్యత్‌ ఉండదని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని కాపాడుకోవాలని బాబు పిలుపునిచ్చారు. అమరావతిని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం చేశారని గుర్తు చేశారు.

రాజధాని అమరావతి గ్రామాల పరిధిలోనూ ఇదే రకంగా నిరసన వ్యక్తం చేసారు. ఎంపీ గల్లా జయదేవ్..టీడీపీ నేతలు అమరాతి ఉద్యమ కారులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. రెండు కమిటీల సిఫార్సులను భోగి మంటల్లో దహనం చేసారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఆధ్వర్యంలో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రభుత్వం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని… ప్రజలు మళ్లీ వైసీపీని సమర్థిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ చేశారు. అమరావతి వద్దని ప్రజలంటే తానేమీ మాట్లాడనన్నారు. వైసీపీ తప్ప ప్రజలంతా అమరావతే కావాలంటున్నారని తెలిపారు.

 

Leave a Reply