అట్టహాసంహా కేన్స్‌  సినిమా వేడుక ప్రారంభం

Share Icons:

పారిస్‌,మే15,

అంతర్జాతీయ 72వ కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఫ్రాన్‌ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ వేడుకను ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభించారు. మే 25 వరకు ఈ వేడుక జరుగుతుంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో ఈ వేడుక జరుగుతోంది.

తొలి రోజు ప్రముఖ పాప్‌ గాయని సెలీనా గోమేజ్‌ హాజరై రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ఆమెతో పాటు డెడ్‌ డోన్ట్‌ డై చిత్రంలోని నటీనటులు కూడా హాజరయ్యారు.ప్రపంచవ్యాప్తంగా తీసిన ఉత్తమ చిత్రాన్ని ఈ వేడుకలో ప్రదర్శిస్తారు.

అయితే ఈ ఏడాది కేన్స్‌కు భారత్‌ తరఫున ఒక్క సినిమా కూడా ఎంపిక కాలేదు. కానీ మన సెలబ్రిటీలు ఐశ్వర్య రాయ్, సోనమ్‌ కపూర్‌, కంగనా రనౌత్‌, దీపిక పదుకొణె ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు.

మామాట- కనువిందు చేసే అందాల కదా..

Leave a Reply