బాబు బయో పిక్ ఎవరైనా కొన్నారా..?

Share Icons:

హైదరాబాద్, ఫిబ్రవరి 11,

మరో వందరోజుల్లోపే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో  ఇప్పటికే ఎన్టీఆర్…కథానాయకుడు , వైయస్.. యాత్ర అంటూ రాష్ట్ర మాజీ సిఎం ల బయోపిక్ లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఇక ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు జీవితాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ ‘చంద్రోదయం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 10న చిత్రాన్ని రాష్ట్రవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాత జీవీకే రాజేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ సినిమాపై  ట్రేడ్ వర్గాల్లో పలు సరదా జోక్ లు వెళ్లువెత్తుతున్నాయి.  విడుదల తేదీ ప్రకటించారు సరే… ఈ సినిమా కు అసలు బిజినెస్ అయ్యిందా… ! ఎవరు కొన్నారు..? సొంతగా రిలీజ్ చేస్తున్నారా?  అంటూ  సందేహాలు వ్యక్తీకరిస్తున్నారు.  గత ఏడాది  ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. అందులో చంద్రబాబు గెట్ అప్ చాలా కామెడీ గా ఉండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలయ్యింది.  అదే రీతిలో సినిమా కూడా  క్యామిడీగానే ఉండబోతోందా?  అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరైతే ఈ చిత్రం విడుదల తరువాత, నిర్మాతకు లాభాల కంటే, నష్టాలు లెక్కించుకోవడానికే తీరిక ఉండదనీ జోకులేసుకుంటున్నారు.  పైగా, విడుదల తేదీ   మార్చి 10 ఆదివారం కావడం విశేషం. అది  పరీక్షల సీజన్…ఆ టైమ్ లో  సినిమా విడుదల చెయ్యడమే  పొరపాటు. అటువంటిది ఆదివారం రిలీజ్ ఏమిటో?  ఆ పోస్టర్లు చూసి ఎవరైనా సినిమాకు వస్తారా, సినిమా బాగోపోతే చంద్రబాబుపై సెటైర్స్ వేస్తారు సోషల్ మీడియా జనం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోలేదా నిర్మాత, దర్శకుడు అని డిస్కస్ చేసుకుంటున్నారు.

మోహన్‌ శ్రీజ సినిమాస్‌ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజస్‌ పతాకంలో రూపొందిన ఈ చిత్రాన్ని 2016 ఆగస్టులో నారావారిపల్లెలో ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దాదాపు 45రోజుల పాటు నారావారిపల్లెలో షూటింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. కథ, మాటలు, దర్శకత్వం పసుపులేటి వెంకటరమణ.

మామాట : దీన్నే సందిట్లో సడేమియా అంటారనుకుంటా…

Leave a Reply