TRENDING NOW

ప్రభ కోల్పోతున్న పార్టీల ప్రచారం

ప్రభ కోల్పోతున్న పార్టీల ప్రచారం

తిరుపతి, మార్చి 14,

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకీ మలుపులు తిరుగుతూ.. తెలుగు సినిమా కథలా గొప్ప సస్పెన్స్ ధ్రిల్లర్ మాదిరిగా సాగుతున్నాయి.  ఇక ఎన్నికల తేదీలు కూడా ప్రకటించడంతో…  పార్టీల తీరుతెన్నులు మరింత దిగజారనున్నాయి.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

కేంద్రంలో మోదీ ప్రతి సభలోనూ.. ప్రతిపక్షాలన్నీ తమ వైరుధ్యాలను పక్కన పెట్టి.. మోదీ ఓటమి ఓక్కటే లక్ష్యంగా జట్టుకట్టాయి. వాటికి మరే ఎజండా లేదని ప్రతి సమావేశంలో చెప్పుకొస్తున్నారు. కానీ ఏపీ లో పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఉంది. ఇక్కడ పాలక తెలుగుదేశానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే బహు ముఖ పోటీ ఉండబోతోంది. రాష్ట్రంలో తెలుగు దేశంతో తెగదెంపులు చేసుకున్న తరువాత బీజేపీకి మరో తోడు దొరకని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ జగన్ తో కలవదు. జగన్ పొత్త పెట్టుకోరు. ఇక పవన్ కల్యాణ్ కూడా భాజాపాతో జట్టుకట్టే ఆలోచనలో లేరు. దీనితో భాజాపా తెర వెనుక నుంచి కేసీఆర్ సాయంతో ఏపీలో జగన్ కు అనుకూలంగా పావులుకదుపుతోందనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.

నిజానికి ఈ ఎన్నికలు తేదేపా వర్సెస్ వైసీపీ అనే ముఖాముఖీ పోటీ గా జరగవలసింది… కానీ ప్రస్తుతం తెలుగుదేశం, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీ అంటూ అనేక ముఖాలను సంతరించుకుంది. దీనితో మాటల యుద్దం, తిట్లపురాణాలు ఊపందుకున్నాయి. ఏ రోజు ఎవరు ఏ పార్టీలో ఉంటారో… ఎవరిని పొగుడుతూ.. ఎవరిని తిడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉదయం ప్రెస్ మీట్లో… మా నేత నాకు దేవుడు అన్న వ్యక్తే సాయంత్రానికి కండువా మార్చేసి, మరో పార్టీ గొడుగు కింద నిలబడి తిట్ల దండంకం అందుకుంటున్నారు.

రాజకీయ పార్టీలకు తోడుగా సామాజిక మాధ్యమాల తీరు కూడా మంటల్లో పెట్రోలు పోసినట్టుగా ఉంది.  తమ ప్రత్యర్థులను అబాసుపాలు చేయడానికి ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాను వాడుకుంటోంది. తప్పుడు వార్తలను, పుకార్లను విరవిగా ప్రచారం చేస్తోంది. మార్ఫింగ్ వీడియోలతో కలకలం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా వివిద వర్గాల మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నట్టు పోలీసులే చెబుతున్నారు. ఇటువంటి విపరీతాలకు రాజకీయ పార్టీలు స్వస్థి చెప్పకపోతే.. ఇక చేసేదేముంది.. అనుకునే ప్రజలు చివరకు నోటా మీట నొక్కే ప్రమాదం పొంచివుంది జాగ్రత్త.

మామాట: రాజకీయ పార్టీలకు నియమాలున్నాయా సిర్జీ… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: