కాలిఫోర్నియాలో దావానల విధ్వంసం… బూడిదవుతున్న ఇళ్లు, వాహనాలు

Share Icons:
  •  200 మంది ఫైర్ ఫైటర్లు
  • కారు చీకట్లో పలు ప్రాంతాలు

అమెరికాలో కాలిఫోర్నియాలో చెలరేగిన దావానలం విధ్వంసం సృష్టిస్తోంది. పొడి వాతావరణానికి తోడు బలమైన గాలులు తోడవడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి.  కార్చిచ్చు ధాటికి శాక్రమెంటో కౌంటీలోని రాంచో మెరీనా పార్క్‌లోని భవనం, 25 మొబైల్ హౌస్‌లు, 16 రిక్రియేషన్ వాహనాలు తగలబడిపోయాయి.  సౌత్ శాంటా బార్బారా కౌంటీ కోస్ట్‌లో 200 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. సోమవారం అమాంతం ఎగసిపడిన కార్చిచ్చు కొంత నెమ్మదించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ పునరుద్ధరించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply