కోళ్ళతో బస్ ఎక్కిన ప్రయాణికుడు…టికెట్లు కొట్టిన కండక్టర్

Bus conductor charges two hens in karnataka
Share Icons:

బెంగళూరు, 2 జూలై:

సాధారణంగా ఎక్కడైనా బస్‌లో ప్రయాణించే పిల్లలకి హాఫ్ టికెట్ కొడతారు లేదా మనం తీసుకెళ్లే లగేజీకి టికెట్ కొడతారు. కానీ కర్ణాటక రాష్ట్రంలోని ఓ కండక్టర్ విచిత్రంగా రెండు కోళ్ళకి హాఫ్ టికెట్లు కొట్టాడు.

మరి వింతగోల్పే ఈ ఘటన బెంగళూరు సమీపంలో ఉన్న గౌరీబిదనూరు రూటులో జరిగింది. ఇక అదే రూటులో ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన రెండు కోళ్లను తీసుకుని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎక్కాడు.

ఇక బస్ కండక్టర్ అతనికో టికెట్, రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు కొట్టాడు. పని టికెట్లు కొడితే కొట్టాడు అనుకుంటే ఆ టికెట్లపై పిల్లలకు అని రాసి ఇచ్చాడు. దీంతో టికెట్ పై పిల్లలకు అని ఎందుకు రాశావ్? కోళ్లకు అని రాసివ్వు అంటూ కండక్టర్‌తో శ్రీనివాస్ వాగ్వాదానికి దిగడం గమనార్హం.

కాగా, కోళ్ళకి హాఫ్ టికెట్ల కొట్టడంతో బస్‌లోని ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ, కోళ్లు, గువ్వలు, చిలుకలులాంటి వాటికి కూడా హాఫ్ టికెట్ తీసుకోవాల్సిందేనని చెప్పారు. అంటే ఇక నుంచి ఎలాంటి జంతువులు, పక్షులు బస్‌ల్లో తీసుకెళ్లిన టికెట్ తప్పనిసరి అనమాట.

మామాట: భలే వింత రూల్స్…

Leave a Reply