పాదచారులపైకి దూసుకెళ్ళిన బస్సు…ముగ్గురు మృతి

Share Icons:

హైదరాబాద్‌, సెప్టెంబర్ 10:

తెలంగాణ హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రోడ్డు దాటుతున్న పాదచారులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

హెచ్‌సీఐ డిపోకు చెందిన బస్సు లింగంపల్లి నుంచి కోఠి వెళ్తోంది. ఉదయం 8 గంటల సమయంలో గచ్చిబౌలి చౌరస్తా వద్దకు చేరుకున్న బస్సు మరో బస్సును తప్పించబోయి రోడ్డు దాటుతున్న పాదచారుల పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో దశరథ్‌ అనే ఆటో డ్రైవర్‌ కూడా ఉన్నాడు. మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం పోలీసలు విచారణ చేపట్టారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మామాట: నిండు ప్రాణాలని బలిగొన్న అతివేగం….

Leave a Reply