ఆ ఫుట్‌బాల్ ఆటగాళ్లతో పిల్లల్ని కనండి…!

Burger King 'sorry' for offering burgers to women who get pregnant to World Cup players
Share Icons:

మాస్కో, 21 జూన్:

ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొన్న స్టార్ ఆటగాళ్లతో తమదేశపు యువతులు పిల్లల్ని కనాలంటూ రష్యా దేశానికి చెందిన   ప్ర‌ముఖ ఆహార సంస్థ `బ‌ర్గ‌ర్ కింగ్‌` సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్ర‌స్తుతం ర‌ష్యాలో ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో ర‌ష్య‌న్లు త‌మ దేశంలో జ‌రుగుతున్న ఈ ప్ర‌పంచ‌క‌ప్‌ను విప‌రీతంగా ఆస్వాదిస్తున్నారు.

అయితే ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి బ‌ర్గ‌ర్ కింగ్‌ ర‌ష్య‌న్ మహిళ‌ల‌కు ఓ వినూత్నమైన ఆఫర్ ప్ర‌క‌టించింది. అది ఏంటంటే? ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి వచ్చిన ఉత్త‌మ ఫుట్‌బాల్ ఆట‌గాళ్ల‌ను ఎంచుకుని వారి ద్వారా పిల్ల‌ల్ని కనాలని, ఆ పిల్ల‌ల‌ ద్వారా ర‌ష్యా ఫుట్‌బాల్ భ‌విత‌వ్యాన్ని కాపాడంటూ పిలుపునిచ్చింది.

ఇక అలా చేసిన మ‌హిళ‌ల‌కు జీవితాంతం బర్గర్స్ ఉచితం అని బ‌ర్గ‌ర్ కింగ్ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ను త‌న‌ ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు.

కానీ ఈ ప్ర‌క‌ట‌న‌పై ర‌ష్యా వ్యాప్తంగా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తడంతో, ఆ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకుని `బ‌ర్గ‌ర్ కింగ్‌` క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. అలాగే సోష‌ల్ మీడియా ఖాతాల నుంచి కూడా ఆ పోస్టుల‌ను డిలీట్ చేసింది.

మామాట: బుద్ధిలేని ఆఫర్…

Leave a Reply