ఆఫర్లే ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్

bumper offer...flipkart big billion days sale
Share Icons:

ముంబై:  పండుగల సమయంలో ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ వినియోగదారులని ఆకట్టుకుంటున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నూతన్ ఆఫర్లతో ముందుకొచ్చేస్తుంది. దసరా పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ లో సూపర్ ఆఫర్లు, బంపర్ డిస్కౌంట్లు ఇస్తుంది. ఇక ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 6 రోజుల పాటు జరగనుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి సేల్ 4 గంటల ముందే మొదలవుతుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 29న ప్రారంభం అవుతుంది. మొదటి రోజు నుంచి ఫ్యాషన్ వేర్, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఫర్నీచర్, బ్యూటీ ప్రొడక్ట్స్, స్పోర్ట్స్ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఆఫర్లు సేల్ ముగిసే రోజు అంటే అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. అలాగే సెప్టెంబర్ 30న స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్‌పై డిస్కౌంట్లు ఉంటాయి. ఈసారి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అంచనా.

 9. ఇక యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకూ ఇదే వర్తిస్తుంది. వీటితో పాటు కార్డ్‌లెస్ క్రెడిట్, ఫ్లిప్‌కార్ట్ పేలేటర్, ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ లాంటి పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. (image: Flipkart)

ఇందులో ఆపిల్ ఐఫోన్ మోడల్స్‌పై సుమారు రూ.5,000 వరకు తగ్గింపు ఉంటుందని అంచనా. వాటితో పాటు సాంసంగ్ గెలాక్సీ ఎస్10 సిరీస్, ఏసుస్ 6జెడ్, రెడ్‌మీ కే20 సిరీస్ ఫోన్లు కూడా డిస్కౌంట్స్ ఉండే అవకాశముంది. అదేవిధంగా ప్రతీ రోజు ఉదయం 8, మధ్యాహ్నం 12, రాత్రి 8, అర్థరాత్రి 12 గంటలకు క్రేజీ డీల్స్ ఉంటాయి. 6 రోజుల పాటు ప్రతీ గంటకు ఓ ప్రొడక్ట్స్ ఫ్లాష్‌ సేల్‌లో అమ్మనుంది. ఈ సమయంలో ఇంకా అదిరిపోయే ఆఫర్లు ఇవ్వనుంది.

అటు అర్థరాత్రి 12 నుంచి 2 గంటల వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్‌తో రష్ హవర్స్ ఉంటాయి.ఇక  కాంబో ఆఫర్‌లో 3 వస్తువులు కొన్నవారికి 10%, 4 వస్తువులు కొన్నవారికి 15%, రూ.1,999 కొన్నివారికి 15%, రూ.1,499 కొన్నవారికి 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.  చివరికి ఈ సేల్ భాగంగా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులకూ ఇదే వర్తిస్తుంది. వీటితో పాటు కార్డ్‌లెస్ క్రెడిట్, ఫ్లిప్‌కార్ట్ పేలేటర్, ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులపై నో-కాస్ట్ ఈఎంఐ లాంటి పేమెంట్స్ ఆప్షన్స్ ఉంటాయి. మొత్తానికి దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు సూపర్ ఆఫర్లే ఇచ్చారు.

Leave a Reply