మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయం సాయి

Share Icons:

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల మధ్య ప్రతిరోజూ ట్విట్టర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు కూడా ఇన్‌సైడర్ ట్రేడింగ్ బండారం బయట పడేటప్పటికి ఎలాగూ జైలుకు పోయేదేకదా అని పిచ్చి కూతలు కూస్తున్నారని, టీడీపీ నేతల రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

ఇక ఈ విమర్శలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘వైఎస్ జగన్ గారు, మీరు కలిసి మొదలుపెట్టిన మూడు రాజధానుల దందా వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలిసి అధికారులు పారిపోతున్నారు. ముందు వారిని ఆపే మార్గం చూడండి విజయసాయిరెడ్డి గారు’ అని బుద్ధా వెంకన్న అన్నారు.

‘అడ్డమైన పనులు చేసి 16 నెలలు చిప్ప కూడు తిన్న నీకు మా రాజకీయ జీవితాలకు తెరపడే రోజులు వచ్చాయి అనే అంత ధైర్యం వచ్చిందా? అంత వరకూ వచ్చాకా మేము మాత్రం చూస్తూ కూర్చుంటామా? మిమల్ని, మీ జగన్ గారిని మళ్లీ జైలుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రెడీగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. ‘పాత తప్పులు,ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైజాగ్ లో చేస్తున్న భూముల దందా అంతా బయటపడుతుంది మీరు, మీ పరివారం ఊచలు లెక్కపెట్టడం ఖాయం సాయి రెడ్డి గారు’ అని అన్నారు.

అటు పోలీసులకు ప్రమోషన్లపై డీజీపీ దృష్టి పెట్టాలని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సూచించారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఎక్కడ ఉన్నారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే అటెండర్‌తో ఎల్వీ సుబ్రమణ్యం డ్యూటీ చేస్తున్నారన్నారు. ఎల్వీ సుబ్రమణ్యం దుస్థితి ప్రజలు గమనించాలన్నారు. అసలు ఆయనను ఎందుకు అవమానకరంగా చూస్తున్నారో చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. అధికారులను తనతో పాటు జైలుకు తీసుకెళ్లే అలవాటు జగన్‌కు ఉందన్నారు. అధికారులంతా జాగ్రత్తగా ఉండాలని నేత వర్ల రామయ్య సూచించారు.

 

Leave a Reply