పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు: తమ సభ్యులకు విప్ జారీ చేసిన కాంగ్రెస్…

Rahul gandhi fires on PM Modi
Share Icons:

ఢిల్లీ, 31 జనవరి:

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తున్నారు.

ఇక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అనారోగ్యం కారణంగా రాలేని పరిస్థితి ఉండడంతో, ఆయన స్థానంలో మరో కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌  శుక్రవారం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను  సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 13వ తేదీ వరకు ఈ సెషన్‌ కొనసాగనున్నది.

ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. కేవలం మూడు లైన్లలో తన ఆదేశాలను అందులో పొందుపరిచింది. ఎన్నికల ముందు ముఖ్యమైన సమావేశాలు కావున సభ్యులంతా సభకు తప్పనిసరిగా హాజరై అవసరమైన సమయంలో పార్టీ నిర్ణయాలకు మద్దతు తెలపాలని ఆదేశించింది..

అయితే అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు.

మామాట: ముందు జాగ్రత్త అనమాట..

Leave a Reply