బడ్జెట్ 2020: ఏ వస్తువుల ధరలు తగ్గాయి? ఏవి పెరిగాయంటే?

finance minister introduce budget in parliament
Share Icons:

ఢిల్లీ: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ బడ్జెట్ ప్రభావం ఏ వస్తువులు ధరలు తగ్గాయో, ఏవి పెరిగాయో ఒక్కసారి చూద్దాం.

ధరలు తగ్గేవి

న్యూస్ ప్రింట్‌, తేలికపాటి కొటేడ్ పేపర్‌పై 5 శాతం కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు దుస్తులు, ప్లాస్టిక్ బాటిల్స్ (టెరిఫథాలిక్ యాసిడ్)పై యాంటీ డంపింగ్ డ్యూటీ మినహాయింపు ముడి చక్కెర, ఆగ్రో-యానిమల్ ఆధారిత వస్తువులు డ్యూటీ మినహాయింపు టునా బేట్, స్కిమ్డ్ మిల్క్, ఆల్కాహాల్ బివరేజేస్, సోయా ఫైబర్, సోయా ప్రొటీన్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు

ధరలు పెరిగేవి

బడ్జెట్‌లో పెరిగినవి.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్న ఫుట్‌వేర్, ఫర్నీచర్‌పై కస్టమ్స్ డ్యూటీ మెడికల్ ఎక్విప్‌మెంట్‌ కొనుగొళ్లపై హెల్త్ సెస్ పెంపు వాల్ ఫ్యాన్స్‌పై 7.5 శాతం నుంచి 20 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ కిచెన్ వస్తువులు, టేబుల్ అలంకార వస్తువులు, సిరమిక్, స్టీల్, కాపర్ వస్తువులపై 20 శాతం కస్టమ్స్ డ్యూటీ

డిపాజిట్లపై ఇన్స్యూరెన్స్ కవర్‌ను రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ఈ శుభవార్త చెప్పారు. డిపాజిటర్ల డబ్బులకు రక్షణ కల్పించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం డిపాజిట్లపై రూ.1 లక్ష మాత్రమే బీమా ఉంది. ఈ ఇన్స్యూరెన్స్ కవర్‌ను ఏకంగా రూ.5 లక్షలకు పెంచి డిపాజిటర్లకు శుభవార్త చెప్పారు.

మూడు నెలలుగా ప్రభుత్వానికి జీఎస్టీ ఆదాయం భారీగా సమకూరుతోంది. అక్టోబరు నుంచి ఈ ఆదాయం లక్షకోట్లపైగానే ఉంటోంది. ఈ క్రమంలోనే గత డిసెంబరుకు సంబంధించి జనవరిలో వసూలైన జీఎస్టీ ఆదాయం కూడా లక్షకోట్ల మార్కును దాటింది. గతేడాదితో పోల్చుకుంటే ఇప్పటి జీఎస్టీ ఆదాయం 8.12శాతం పెరిగింది. గతేడాది ఇదే నెలలో రూ.1.02లక్షల కోట్లుగా ఉన్న వసూళ్లు, ఈసారి సుమారు రూ.1.11లక్షల కోట్లకు చేరాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం రూ.10.18లక్షల కోట్లకు చేరింది.

 

Leave a Reply