విజయసాయి వరదల్లో మీకు కిన్లే వాటర్ బాటిల్ కావాలా?

tdp mlc budda venkanna fires on vijayasaireddy
Share Icons:

అమరావతి:

 

టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లక్ష్యంగా ట్విట్టర్ లో విమర్శలు చేశారు. ఇటీవల్ గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని పెసర్లంక గ్రామం జలదిగ్బంధంలో ఉంది. తాగడానికి చుక్కనీరు కూడా కరువైంది. ఈ నేపథ్యంలో జగదిగ్బంధంలో ఉన్న ఆ గ్రామాన్ని సందర్శించేందుకు ఓ బోటులో మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు అక్కడికి వెళ్లారు.

 

కిన్లే వాటర్ బాటిల్ ఉంటే ఇవ్వమని బాధితులను మంత్రి, ఎమ్మెల్యే అడిగినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేత వెంకన్న స్పందించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరి పనితీరు ఏంటో ప్రజలు తేల్చుకుంటారని అన్నారు.

 

‘మీకు వాళ్లకు అంతకంటే ముఖ్యమైన పని ఒకటి ఉంది. వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వరద బాధితులను ఆదుకోవడంలో చాలా కష్టపడి, చెమటోడ్చి సహాయం చేసి, బాధితులనే కిన్లే వాటర్ బాటిల్స్ అడిగి చివాట్లు తింటున్నారుట. ముందు అర్జెంట్ గా వెళ్లి మీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు కిన్లే వాటర్ బాటిల్స్ అందించండి. ఎలాగో భయపడి అమెరికా పర్యటనకు వెళ్లలేదు కదా’ అని విమర్శించారు.

 

ఇక మరొక సందర్భంలో జగన్ మీద టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.  జగన్ జెరూసలెం వెళ్లినప్పుడు గోదావరికి వరదలు వచ్చాయని, అమెరికా వెళ్లినప్పుడు కృష్ణా నదికి వరద పోటెత్తిందని తెలిపారు. ఇది యాదృచ్చికమే అయినా, తెలుగు ప్రజలు చాలా సెంటిమెంటల్ అని, జరగరానిది జరగకుండా చూసుకోండి అంటూ ట్వీట్ చేశారు. ఇకపై మీ యాత్రలు, యజ్ఞయాగాదులు ముందూవెనుకా చూసుకుని చేయండి, తస్మాత్ జాగ్రత్త! అంటూ వ్యాఖ్యానించారు.

Leave a Reply