బిఎస్‌ఎఫ్‌లో ఖాళీలు 

Share Icons:

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 20,

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఖాళీగా ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అర్హులైనపురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ భారతదేశ ఐదు సాయుధ పోలీస్‌ బలగాల్లో, దళాల్లో ఒకటి.

పోస్టు: హెడ్‌ కానిస్టేబుల్‌, ఖాళీలసంఖ్య: 1072,

రేడియోఆపరేటర్‌ హెడ్‌కానిస్టుబుల్‌ -300,

రేడియోమెకానిక్‌ హెడ్‌కానిస్టేబుల్‌-772

గమనిక: మొత్తం ఖాళీల్లో 25%ఖాళీలను బిఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న అభ్యర్థులకుకేటాయించారు.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ, బోర్డు నుంచి మెట్రిక్యులేషన్‌ లేదా తత్సమాన పరీక్షతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఊ లేదా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. నిర్థేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: జూన్‌12 నాటికి 18నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సి, ఎస్టిలకు ఐదేండ్లు, ఒబిసిలకు మూడేండ్ల సడలింపు ఉంటుంది.

ఎంపికవిధానం: రాతపరీక్ష,ఫిజికల్‌ సాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీటెస్ట్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ద్వారా

మొదటిదశ: ఒఎవ్‌ర్‌ బేస్డ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ రాతపరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 200మార్కులకుగాను మూడు గంటల సమయాన్ని కేటాయించారు. ఒఎవ్‌ర్‌ బేస్డ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఇంగ్లీష్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలిస్తారు. నెగిటివ్‌ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత విధిస్తారు.

రెండోదశ: పిఎస్‌టి, పిఇటి, మూడోదశ లో డిస్ట్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది.

పేస్కేల్‌: రూ. 25,500 నుంచిరూ. 81,100/-వరకు.

ఫీజువివరాలు: రూ. 100/- ఎస్సి,ఎస్టి, బిఎస్‌ఎఫ్‌ ఉద్యోగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజులేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా.

దరఖాస్తు ప్రారంభతేదీ: మే14,

దరఖాస్తు ఆఖరుతేదీ: జూన్‌ 12,

వెబ్‌సైట్‌: http://bsf.nic.in

Leave a Reply