మహబూబాబాద్,సెప్టెంబర్ 8,
క్షణికావేశంలో రక్తసంబంధాన్నీ దూరం చేసుకొని కటకటాల పాలైయాడడు ఆ యువకుడు. కేసముద్రం మండలం మహమూద్ పట్నం గ్రామ శివారు కాలనీ తండాలోఆస్తి కోసం రక్తం పంచుక పుట్టిన తమ్ముడిని హత్య చేసిన కేసులో అన్న, మరో నిందితుడి ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తండాలోని శ్రీను, జీజా దంపతులకు సంతోష్, నవీన్ అనే ఇద్దరు కుమారులు. సంతోష్ ప్రక్క తండాలోని ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. దీనిని గమనించిన యువతి తండ్రి సంతోష్ ను నీకు ఆస్థి లేదు. ,ఉద్యోగం లేదు నా బిడ్డను ఎలా పోషిస్తావని మందలించాడు.
దీంతో చదువు రాని సంతోష్ తమ్ముడిని చంపేస్తే తండ్రికి ఉన్న ఐదు ఎకరాల భూమి వస్తుందని ప్లాన్ వేసాడు. తద్వారా ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవచ్చనని దురాలోచన చేశాడు. మిత్రుడు సాయి రామ్ సహకారం తో మద్యం లో ఎలుకల మందు కలిపి తమ్ముడు నవీన్ కు తాగించాడు. సాయంత్రం వరకు చావక పోవడం తో చొక్కా తో గొంతు బిగించి హత్య చేశాడు. మరుసటి రోజు తమ్మునికి చదువుకోవడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నాడని,ప్రచారం చేశాడు. తండ్రి తో పోలీసులకు ఫోర్యాదు చేయించాడు. అయితే, ఈ ఆత్మ హత్య పై తండా వాసులు అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం నివేదికలో గొంతు నులపడం తో చనిపోయాడని రావడం తో పోలీసు లు సంతోష్ ని విచారించారు. నేరాన్ని అంగీకరించి కటకటా ల పాలైయాడు.
మామాట: ఆస్తి, ఆశ నభయం న లజ్జ … ఏ చేద్దాం