పశ్చిమ బెంగాల్లో కూలిన మరో వంతెన

Share Icons:

 

సిలిగురి,సెప్టెంబర్ 07,

పశ్చిమ బెంగాల్‌లో వంతెనలు వాహనదారులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కోల్‌కతాలో జరిగిన విషదాన్ని మరవక ముందే  రెండు రోజుల్లో మరో వంతెన కూలింది.  అయితే, ఆ సమయంలో ఆ మార్గంలో పెద్దగా వాహనాల రాకపోకలు ఉండటక పోవడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు.

కొద్ది రోజుల కిందట కోల్‌కతాలోని మజెర్మాత్ వంతెన కూలిన ఘటనలో ఇద్దరు చనిపోగా, పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే సిలిగురికి 22 కిమీల దూరంలో గల ఫన్సిదెవా ప్రాంతంలో శుక్రవారం మరో వంతెను కుప్పకూలింది. సిలిగురి నుంచి మంగంజ్, పన్సదెవా వెళ్లే మార్గంలో ఈ ప్రాంతం ఉంది. ఈ వంతెనపై భారీ వాహనాలకు అనుమతి లేదు. శుక్రవారం ఓ ట్రక్కు ఈ వంతెన మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ట్రక్కు కూడా వంతెనతో పాటు పడిపోయి, ఏటు కదల్లేని పరిస్థితిలో చిక్కుకుంది. స్థానికులు డ్రైవర్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు.

మామాట: బెంగాల్లో ఇది వంతెనలు కూలే కాలమా ఏంది?

Leave a Reply