హవ్వ..! బాలుడు కూడానా..?

Share Icons:

హైదరాబాద్, ఆగస్టు 31,

బాలికపై ఓ బాలుడు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన హైదరాబాద్ లోని బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో చోటుచేసు కుంది. ఘటనకు పాల్పడ్డ మైనర్‌ను జువైనల్‌ హోంకు తరలించడంతోపాటు అతడికి సహకరించిన మరో యువకుడిని బోయిన్‌పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఓ బాలుడి (16)కి  అదే కాలనీలోని మరో బాలిక (14)తో పరిచయమైంది. ఆ బాలుడు తన స్నేహితుడికి బాలిక గురించి చెప్పి ఆమెను తనతో వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరాడు. సదరు స్నేహితుడు బాలుడికి సహకరిస్తూ ఆమెకు మాయమాటలు చెప్పి విద్యానగర్‌కు తీసుకొచ్చాడు. అక్కడ బాలుడు ఒకరోజుపాటు ఆమెను నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఆమెను తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు తమ కూతురు అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి బాలుడిని జువైనల్‌ హోంకు తరలించారు. సహకరించిన విష్ణును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

మామాట: ఇంతకూ ఇలా ఎందుకు జరుగుతోందంటారు…

Leave a Reply