చంద్రబాబు, పవన్‌లపై సెటైర్లు వేసిన బొత్స..

Botsa satyanaayana fires on guntur tdp mla's
Share Icons:

విజయవాడ, 12 జనవరి:

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్‌లో సెటైర్లు వేశారు. ఈరోజు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ జగన్ పై దాడికేసును హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఎన్ఐఏకు ఆదేశించడంతో చంద్రబాబులో భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎన్ఐఏ అయితే చంద్రబాబు కుట్రను బయటపెడుతుందన్న ఆందోళనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. అందుకే ఎన్ఐఏకి చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు.

పార్టీ నేతలపై హత్యాయత్నం జరిగినా కేంద్రం జోక్యం చేసుకోవద్దనేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై దాడి కేసును ఎన్ఏఏకి అప్పగిస్తే చంద్రబాబుకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలపై చంద్రబాబు ఆధారపడి బతుకుతున్నారనిపిస్తోందని మండిపడ్డారు. మరోవైపు పవన్ ఉబలాటం చూస్తుంటే ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాలన్న తపన కనబడుతోందని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలతో పొత్తుకు వెంపర్లాడే ముందు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయో లేవో పవన్ స్పష్టం చెయ్యాలని బొత్స కోరారు.

మామాట: మొత్తానికి చంద్రబాబు, పవన్ ఒక్కటే అంటారు..

Leave a Reply