సంచలన విషయం బయటపెట్టిన్ బొత్స…బాలయ్య వియ్యంకుడు భూములు…

botsa satyanarayana comments on ap capital
Share Icons:

అమరావతి:

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన విషయాలు బయటపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది వాస్తవమేనని చెప్పుకొచ్చారు. రాజధాని భూముల్లో బాలకృష్ణ వియ్యంకుడికి వందలాది ఎకరాల భూమిని చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు అయిన రామారావుకు చంద్రబాబు నాయుడు 493 ఎకరాలు కట్టబెట్టినట్లు ఆరోపించారు.

ఏపీఐఐసీ కింద ఎకరం లక్ష రూపాయలు చొప్పున భూమిని కారుచౌకగా కట్టబెట్టారని ఆరోపించారు. ఆ భూములు జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వీబీసీ కంపెనీ పేరుతో భూములు ఏపీఐఐసీ క్రింద కట్టబెట్టారన్నారు. ఏపీఐఐసీ కింద కొనుగోలు చేసిన భూమిని తిరిగి రాజధానిలో కలిపేశారని దానిని ఏమంటారని నిలదీశారు.

వియ్యంకుడు వియ్యంకుడికి భూములు కట్టబెట్టడంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేశ్ ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. దీన్ని క్విడ్ పో క్రో అంటారా లేకపోతే ఏమంటారో ప్రజలకు తెలియజెప్పాలని నిలదీశారు

 

Leave a Reply