చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ధర్మమే గెలుస్తుంది

botsa satyanarayana comments on ap capital
Share Icons:

విజయనగరం: ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించారని, చంద్రబాబుకు ప్రజలు తగిన శాస్తి చేసి… బుద్ధి చెప్పినా మారడం లేదన్నారు. బాబు దుర్మార్గమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నారని, ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబేనని బొత్స దుయ్యబట్టారు.

కంపెనీలు వెళ్తున్నాయంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కియాపై అంత పెద్ద ఆరోపణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చంద్రబాబు బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఇలాంటి ఆరోపణలు చేస్తారా? చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ధర్మమే గెలుస్తుంది’’ అని బొత్స చెప్పారు.

పెన్షన్‌ జాబితాలో 4 లక్షల మందిని అనర్హులుగా తేల్చామని, సుమారు 7లక్షల మంది కొత్తవారికి పెన్షన్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. నిజమైన లబ్దిదారులందరికీ పెన్షన్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. చంద్రబాబు అసహనంతోనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదిలా ఉంటే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యాజ్యాలపై నిన్న హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని అప్పట్లో జగన్ వేసిన వాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ ఆయన తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించి, తమ పిటిషన్‌ను మూసేయాలని కోరారు. దీనిపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.

ఈ రోజు మంగళగిరిలో మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… ‘వివేకా హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆనాడు వైఎస్ జగన్ కోరారు. నిన్న కోర్టులో ఆ పిటిషన్‌ను జగన్‌ వెనక్కి తీసుకోవడం మాకు ఆశ్చర్యంగా ఉంది. హైకోర్టులో వేసిన రిట్‌ను ఎందుకు వెనక్కి తీసుకున్నారో జగన్ చెప్పాలి. దీని వెనుక ఆంతర్యం ఏంటీ? ఎవరిని రక్షించడం కోసం రిట్‌ను విత్‌ డ్రా చేసుకున్నారు? వివేకానంద కుటుంబ సభ్యుల భద్రతపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

‘ఏ మలుపులు తిరగబోతుంది ఈ కేసు? ఈ కేసులో ఎటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి? అమాయకులని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తారని రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూశారు. అటువంటి పరిస్థితుల్లో రిట్‌ను కూడా వెనక్కు తీసుకున్నారు’ అని వర్ల రామయ్య అన్నారు.

 

Leave a Reply