తోడబుట్టిన చెల్లిపై అన్న అఘాయిత్యం…

bother raped own sister
Share Icons:

గురుగ్రామ్, 9 నవంబర్:

దీపావళి పర్వదినాన..మద్యం మత్తులో ఉన్న ఓ దుర్మార్గుడు తోడబుట్టిన చెల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన హరియాణ రాష్ట్రం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… గురుగ్రామ్ లోని ఫరూక్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అయితే భార్యకి మతిస్థిమితం కోల్పోయి.. చికిత్స పొందుతోంది.

కాగా.. బుధవారం రోజు సాయంత్రం దీపావళి పండగను పురస్కరించుకొని ఇంట్లో పూజ నిర్వహించారు. పూజ అనంతరం ఆ వ్యక్తి తన కుమారుడితో కలిసి మద్యం సేవించాడు. ఆ సమయంలో అతని ఇద్దరు కుమార్తెలు ఒక గదిలో.. ఇంకో కుమార్తె మరో గదిలో నిద్రిస్తున్నారు.

ఇక మద్యం సేవించిన తర్వాత అతను వెళ్లి తన గదిలో పడుకున్నాడు. ఈ క్రమంలోనే తండ్రి నిద్రించాడని నిర్ధారించుకున్నతర్వాత.. అతను తన చెల్లెలి గదిలోకి వెళ్లి బలవంతంగా రేప్ చేశాడు. మరుసటి రోజు ఉదయం బాధిత బాలిక ఈ విషయంపై తండ్రికి ఫిర్యాదు చేసింది.

దీంతో వెంటనే.. అతను తన కుమార్తెను వెంట పెట్టుకొని పోలీసు స్టేషన్‌కి వెళ్లి తన కొడుకుపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

మామాట: దిగజారుతున్న మానవ సంబంధాలు…

Leave a Reply