త్వరలో అతిలోకసుందరి బయోపిక్..

Share Icons:

ముంబై, 10 జనవరి:

తెలుగు సినిమా స్థాయిని సత్తాని ప్రపంచానికి వెలుగెత్తి చాటిన అలనాటి అగ్ర తారలు ఎన్టీఆర్, సావిత్రిల జీవితకథలు తెరకెక్కించడం, తెలుగు ప్రజలంతా వాటికి బ్రహ్మరథం పట్టడం అందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదే కోవలో మరో అగ్రనటి జీవితకథ కూడా తెరకెక్కనుందన్న వార్తలు బాలీవుడ్ లో గుప్పుమంటున్నాయి. ఆవిడ ఎవరో కాదు అలనాటి అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి.

శ్రీదేవి గుర్తుకు వస్తే ఆమె అందం, అభినయం, నిత్య యవ్వనమే గుర్తొస్తాయి కానీ ఆమె మన మధ్య లేదనే భావన మాత్రం రాదు. ఆమె మరణించి అప్పుడే సంవత్సరం పూర్తి కావొస్తున్నా శ్రీదేవి మరణంపై ఉన్న అనుమానాలు మాత్రం పోలేదు. ఈ నేపథ్యంలోనే ఆమె మరణం గురించి ఉన్న అపోహల్ని పోగొట్టేందుకు ఆమె భర్త బోనీ కపూర్ శ్రీదేవి బయోపిక్ తెరకెక్కించేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ఇప్పటికే పలువురు ప్రముఖ రచయితలు బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. శ్రీదేవి చిన్ననాటి ప్రాయం నుండి సినీ ప్రస్థానం ఎలా సాగింది, వైవాహిక జీవితం, మరణం ఇలా ప్రతి విషయాన్ని ప్రేక్షకుడికి కూలంకషంగా చూపించాలని బోనీ ఆరాటపడుతున్నారట. ముఖ్యంగా శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆమె మరణం వెనుక ఉన్న నిజానిజాలు ఏంటి? అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియజెప్పేందుకే ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

అయితే ఈ చిత్రానికి స్వయంగా బోనీనే దర్శకత్వం వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బోనీ కాకుండా మంచి దర్శకుడి చేతిలో పడితేనే శ్రీదేవి సినిమా అద్భుతంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మామాట: ఈ బయోపిక్ అయినా ఆ అపోహల్ని పోగొడుతుందా

Leave a Reply