మల్లాది విష్ణు గెలుపుపై కేసు వేసిన బోండా ఉమా

Share Icons:

విజయవాడ, 15 జూన్:

టీడీపీ అభ్యర్ధి బోండా ఉమా మహేశ్వరావు..వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గెలుపుపై కోర్టుకెక్కారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఉమా కేవలం 25 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే.

అయితే అత్యల్ప మెజారిటీతో ఓడిపోవడం,  వీవీప్యాట్స్ లెక్కింపు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బొండా ఉమా కోర్టును ఆశ్రయించారు.
తనపై 25 ఓట్లతో వైకాపా అభ్యర్థి మల్లాది విష్ణు గెలుపొందినట్లు అధికారులు మే 23న జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఆయన తన రిట్ పిటిషన్‌లో కోరారు.

అయితే తమ నియోజకవర్గంలోని 11 పోలింగ్‌ కేంద్రాల్లో వీవీప్యాట్స్‌ను లెక్కించాకే ఫలితాల్ని ప్రకటించాలని కోరినా రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదని బొండా ఉమ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Leave a Reply