టీడీపీని వీడనంటున్న బొండా ఉమా!

tdp leader bonda uma ready to join ysrcp
Share Icons:

విజయవాడ:

 

గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పార్టీ వీడతారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళిన ఆయన రాగానే వైసీపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే ఆస్ట్రేలియా పర్యటన నుంచి తాజాగా విజయవాడకు వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు ఉమతో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చర్చలు జరిపారు.

 

ఉమ నివాసానికి ఈరోజు ఆయన వెళ్లి కలిశారు. టీడీపీని వీడతారన్న వదంతుల గురించి ప్రస్తావించగా, తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని వెంకన్నకు ఉమ చెప్పినట్టు సమాచారం. ఈ నెల 12న చంద్రబాబును బోండా ఉమ కలవనున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, 2014లో తొలిసారిగా టీడీపీ నుండి బోండా ఉమ ఎమ్మెల్యే (విజయవాడ సెంట్రల్) గా ఎన్నికయ్యారు. కాకినాడలో ఇటీవల జరిగిన టీడీపీ కాపు నేతల సమావేశంలో ఆయన పాల్గొనడం గమనార్హం. టీడీపీ అధినేత చంద్రబాబు తన నివాసంలో గత నెలలో నిర్వహించిన కీలక సమావేశానికి ఉమ హాజరుకాలేదు. దీంతో, టీడీపీని ఆయన వీడుతున్నారన్న ప్రచారం మొదలైంది.

Leave a Reply