పార్టీ వీడేది లేదు: ఇండియాలో లేని సమయంలో అసత్య ప్రచారం చేశారు.

tdp leader bonda uma ready to join ysrcp
Share Icons:

విజయవాడ:

 

గత కొన్ని రోజులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన వైసీపీలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై బొండా ఉమా వివరణ ఇచ్చారు. ఆయన నిన్న సాయంత్రం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇందులో పార్టీ మార్పుపై చర్చించారు.

 

ఇక భేటీ అనంతరం ఉమా మీడియాతో మాట్లాడుతూ.. తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత తనకు చాలా పార్టీల నుంచి పిలుపులు అందాయని, కానీ తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఇండియాలో లేని సమయంలో లేనిపోని వదంతులు పుట్టించారని, పార్టీ మారేవాడ్నే అయితే ఇప్పుడు చంద్రబాబు ఇంటికి ఎందుకు వస్తానని ఉమ ప్రశ్నించారు.

 

అంతకముందు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలు తప్పులు చేస్తారని, ఆ తప్పుల్ని ఎత్తిచూపిన వాళ్లను చంపడానికి వెళతారని విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఓ పాత్రికేయుడి ఇంటిపై దాడి చేసి, చంపుతామని బెదిరించడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు, రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. ‘జమీన్ రైతు’ ఎడిటర్ డోలేంద్ర ప్రసాద్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాడికి పాల్పడినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఈ ట్వీట్ చేశారు.

 

Leave a Reply