బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి మృతి…సంతాపం ప్ర‌క‌టించిన బిగ్ బీ..!!

Share Icons:

ముంబై, 6 మార్చి:

బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో మ‌రో విషాదం నెల‌కొంది. బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై క‌మెడీయ‌న్‌గా అల‌రించిన సీనియ‌ర్ న‌టి ష‌మ్మి (89) కొద్ది సేప‌టి క్రితం క‌న్నుమూశారు.

1929లో జ‌న్మించిన ష‌మ్మి న‌టిగా ప‌లు అవార్డులు కూడా అందుకున్నారు. దాదాపు 200కి పైగా సినిమాల‌లో న‌టించిన షమ్మి కూలీ నంబర్ 1, హమ్, గోపీకిషన్, హమ్ సాత్ సాత్ హై తదితర చిత్రాలతో ఫేమ‌స్ అయ్యారు. దూరదర్శన్‌లోను చాలా షోస్‌లో నటించారు. ష‌మ్మి మృతికి బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ సంతాపం ప్ర‌క‌టించింది.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా షమ్మి మృతిపై స్పందించారు. ‘షమ్మి ఆంటీ చాలా మంచి నటి. మంచి మనసున్న వ్యక్తి. ఎన్నో ఏళ్లపాటు నటిగా రాణించారు. మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

ఇక ప్రముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ సందీప్ కోస్లా కూడా త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ష‌మ్మికి సంతాపం ప్ర‌క‌టించారు.

మామాట: హాస్యనటికి అక్షర నివాళులు…

English Summary: Veteran Bollywood and television actress Shammi has passed away, as stated by famed fashion designer Sandeep Khosla. The star, who was popular for her comic roles, had appeared in over 200 films that included ‘Coolie No 1’, ‘Hum’, ‘Gopi Kishan’, ‘Hum Saath-Saath Hain’ over her long film career.

One Comment on “బాలీవుడ్ సీనియర్ నటి షమ్మి మృతి…సంతాపం ప్ర‌క‌టించిన బిగ్ బీ..!!”

Leave a Reply