బీఎండబ్ల్యూ ఎఫ్‌850 జీఎస్‌ అడ్వెంచర్‌ బైక్‌ వచ్చేసింది…

Share Icons:

ముంబై, 16 మే:

బీఎండబ్ల్యూ ఎఫ్‌850 జీఎస్‌ అడ్వెంచర్‌ బైక్‌ భారత్ మార్కెట్ లోకి వచ్చేసింది.  దీని ధర రూ.15.40 లక్షలు. 853 సీసీ ఇంజన్‌తో కూడిన ఈ బైక్‌ను సంస్థ డీలర్ల నుంచి బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

ఆఫ్ రోడ్ ఓరియెంటెడ్ టూరింగ్ రైడర్లు, గ్లోబెట్టర్రీస్‌కు ఫర్ ఫెక్ట్ కంపానియన్, ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలకు దూసుకెళ్లగల బైక్ ఇదొక్కటే. డబుల్ సీటుతోపాటు వైడర్ ఫుట్ రెస్ట్ లు ఈ బైక్ కు అమర్చారు. ఇంకా అడ్జస్టబుల్ బ్రేక్ అండ్ గేర్ లివర్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డే టైం రన్నింగ్ లైట్స్, ఎల్ఈడీ ఇండికేటర్లు అమర్చారు. 

853 సీసీ 2 సిలిండర్ ఇన్ లైన్ ఇంజిన్‌గా 8250 ఆర్పీఎం వద్ద 95 హెచ్ పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇది ‘రైన్’, ‘రోడ్’ మోడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో హై డిగ్రీ రైడర్ సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తోంది. 6.5 అంగుళాల ఫుల్ కలర్ టీఎఫ్టీ డిస్ ప్టే కలిగి ఉంటుంది. మల్టీ కంట్రోలర్ కలిగి ఉన్న బీఎండబ్ల్యూ మోటరోడ్ ఎఫ్ 850 మోడల్ బైక్ పై రైడ్ చేస్తున్నప్పుడు ఫోన్ కాల్స్ స్వీకరించేందుకు యాప్ ఇన్ స్టాల్ చేశారు.

మామాట: అదిరిపోయే బైక్ అదిరిపోయే ధర…

Leave a Reply