అందుబాటు ధరలో రెండు కొత్త స్మార్ట్ టీవీలని విడుదల చేసిన బ్లౌపంక్ట్

Blaupunkt Gen Z LED Smart TV Range Gets 43-Inch and 49-Inch Variants, Available on Flipkart
Share Icons:

ముంబై:

మద్యతరగతి వినియోగదారులే లక్ష్యంగా జర్మనీకి చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీదారు బ్లౌపంక్ట్ తక్కువ ధరలకే భారత మార్కెట్‌లో రెండు నూతన స్మార్ట్ టీవీలను తాజాగా విడుదల చేసింది. జెన్ జడ్ సిరీస్‌లో 43, 49 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ఈ రెండు టీవీలు వినియోగదారులకు లభిస్తున్నాయి. బ్లౌపంక్ట్ జెన్ జడ్ 43 ఇంచుల టీవీ ధర రూ.19,999 ఉండగా, 49 ఇంచుల మోడల్ ధర రూ.24,999 గా ఉంది. వీటిల్లో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్, యాప్ వీడియోల స్ట్రీమింగ్, వైఫై తదితర ఫీచర్లను అందిస్తున్నారు.  ఈ టీవీలని ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేయొచ్చు.

టొరెటొ టార్‌బడ్స్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీదారు టొరెటొ కంపెనీ టార్‌బడ్స్ పేరిట నూతన వైర్‌లైస్ ఇయర్‌బడ్స్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.4,999 ధరకు వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే లాంచింగ్ సందర్భంగా టొరెటో ఆన్‌లైన్ స్టోర్‌లో వీటిని రూ.3,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇందులో బ్లూటూత్ 5.0, యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్‌లకు సపోర్ట్, 7 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

స్పార్క్ గో ఫోన్ కొంటే బ్లూటూత్ ఇయర్‌పీస్‌ను ఉచితం

మొబైల్స్ తయారీదారు టెక్నో కంపెనీ స్పార్క్ గో పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. 2జీబీ ర్యామ్ కెపాసిటీలో లభించే ఈ ఫోన్ రూ.5499 ధరకే వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.799 విలువైన బ్లూటూత్ ఇయర్‌పీస్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

ఇందులో 6.1 ఇంచుల డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 8, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఏఐ ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Leave a Reply