బీజేపీ మహిళా నేతకు పదవి ఇచ్చిన జగన్….

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

విశాఖపట్నం: ఏపీలో కొత్తగా వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిదానంగా నామినేటెడ్ పోస్టులని భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మూడు ప్రధాన ఆలయాలు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డులను ఏర్పాటు చేసింది. సింహాచలం అప్పన్న ఆలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా విజయనగరం రాజవంశానికి చెందిన ఆనంద గజపతిరాజు కుమార్తె, బీజేపీ నాయకురాలు సంచయిత గజపతిరాజును సింహాచలం పాలకమండలి సభ్యురాలిగా నియమించింది. మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. అందులో సంచయిత గజపతిరాజు పేరు కూడా ఉంది.

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు, ఉమ దంపతుల కుమార్తె సంచయిత గజపతి రాజు 2018 సంవత్సరంలో బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ స్పూర్తితో విశాఖ జిల్లాలో సేవా కార్యక్రమాలను చేపట్టారామె. జిల్లాలో సురక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నారు. 2013లో గూగుల్ ఇంపాక్ట్ ఛాలెంజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రూ.3కోట్ల ఫస్ట్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఆ డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ఆనంద గజపతిరాజు కుటుంబం టీడీపీలో ఉంది. ఆయన తండ్రి ఎంపీగా పనిచేశారు. కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరి ప్రస్తుతం బీజేవైఎంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కాగా, అశోక్ గజపతి రాజు కుమార్తె అతిథి, మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున విజయనగరం అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అశోక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

 

Leave a Reply