మహారాష్ట్ర సీఎం పదవి సెట్ అయినట్లేనా? శివసేన తగ్గిందా?

BJP willing to offer 14 cabinet berths, Shiv Sena wants 18
Share Icons:

ముంబై: ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు దాటుతున్న మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. బీజేపీ-శివసేన కూటమి మెజారిటీ సీట్లు దక్కించుకున్న సీఎం పీఠంపై పేచీతో ప్రభుత్వం ఏర్పడలేదు. శివసేన సీఎం పీఠం చెరో సగం పంచుకుందామని, బీజేపీ దానికి ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధత ఏర్పడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నియమించే విషయంలో తాము ముందుగా చెప్పినట్లు 50.50 ఫార్ములాకు కట్టుబడి ఉన్నామని, అందులో ఎలాంటి మార్పు ఉండదని శివసేన కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. శివసేన కొత్త ఫార్ములాతో బీజేపీకి కొత్త తలనొప్పి మొదలైయ్యింది.

శివసేన డిమాండ్లతో బీజేపీ అయోమయంలో పడిపోయింది. మిత్రపక్షం నాయకుల తీరుతో బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా ముంబై వెళ్లి చర్చలు జరిపారు. చివరికి శివసేన ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ప్రభుత్వంలో కీలమైన మంత్రి పదవులు తీసుకోవడానికి అంగీకరించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను కొనసాగించాలని, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ, శివసేన పార్టీల నాయకులు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం.

ఇక తాజాగా మహారాష్ట్ర బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ 13-26 ఫార్ములాను ముందుకు తెచ్చినట్టు పార్టీ వర్గాల సమాచారం. బుధవారం నాడు ఏర్పాటు చేసిన  బీజేపీ శాసనసభా పక్ష సమావేశానికి దేవేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షత వహించారు. కాగా, శివసేన చెబుతున్న 50-50 ఫార్ములాకు ప్రతిగా 14 మంత్రి పదవులు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. కానీ శివసేన మాత్రం 18 మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేస్తుంది.  కీలకమైన హోం, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖలు బీజేపీ వద్దే ఉంటాయి. ఉప ముఖ్యమంత్రి పదవిని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ సముఖంగానే ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు, శివసేన  సైతం గురువారంనాడు పార్టీ ప్రధాన కార్యాలయంలో లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుపనుంది. మొత్తానికి శివసేన వెనక్కి తగ్గడంతో బీజేపీకి సీఎం పదవి పూర్తిగా దక్కనుంది. అలాగే శివసేనకు ముఖ్యమైన పదవులు దక్కనున్నాయి.

 

Leave a Reply