టీవీల్లో ఎన్నికల ప్రచారంలో టాప్‌లో ఉన్న బీజేపీ…

Share Icons:

ఢిల్లీ, 24 నవంబర్:

ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ముందున్న బీజేపీ పార్టీ టీవీల్లో ప్రచారంలో కూడా టాప్‌లో ఉంది. అసలు టీవీ పెట్టామంటే చాలు ప్రకటనల హోరు మొదలవుతుంది. కానీ బీజేపీ ప్రకటనల ముందు అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

ఇక టీవీల్లో కనిపించే ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ ముందుందని బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తెలిపింది. 

బీజేపీ ప్రచారంతో ప్రముఖ బ్రాండ్లు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొంది. హిందుస్థాన్ యూనిలివర్, రాకెట్ బెన్కీసర్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, విమల్ పాన్ మసాలా, ట్రివాగో, డెటాల్, విప్రో తదితర టాప్ బ్రాండ్ ప్రకటనలన్నింటినీ తోసిరాజనీ బీజేపీ మొదటి స్థానాన్ని ఆక్రమించుకుందని వివరించింది.

అలాగే అన్ని చానళ్లలోనూ బీజేపీయే అతిపెద్ద ప్రకటనదారు అని తెలిపింది. బార్క్ వెల్లడించిన ప్రకటనల జాబితాలో కాంగ్రెస్‌కు టాప్-10లో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం.

మామాట: అభివృద్ధిలో కూడా నెంబర్‌1లో ఉంటే బాగుండేది..

Leave a Reply