లోకల్ ఫైట్: వైసీపీని టార్గెట్ చేసిన కన్నా…చిన్నమ్మ సారథ్యంలో…

ap bjp president kanna lakshmi narayana fires on tdp
Share Icons:

అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ కూడా తమ మిత్రపక్షం జనసేనతో కలిసి సత్తా చాటాలని ప్రయత్నం చేస్తుంది.  గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం బీజేపీ రాష్ట్రశాఖకు చెందిన ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. పార్టీ జాతీయ మహిళా మోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురేంధేశ్వరి, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా కొందరు కీలక నాయకులు దీనికి హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార సరళి మొదలుకుని.. మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి గల అవకాశాలపై చర్చించారు.

పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీతో కలిసి ఉమ్మడిగా స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిల్చుంటున్నామని, ఈ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఒంటరిగా పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండింటికీ సమదూరాన్ని పాటిస్తామని, ఈ రెండు పార్టీలు తమకు విరోధులేనని అన్నారు.

స్థానిక సంస్థల ప్రక్రియను సంస్థాగతంగా పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. దీనికి పురంధేశ్వరి నాయకత్వాన్ని వహిస్తారని అన్నారు. మూడు ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన నాయకులను ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తామని, అభ్యర్థలు ఎంపిక ఈ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకే టికెట్లు దక్కుతాయని అన్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. నకిలీ బ్రాండ్ లతో మద్యం మీద విపరీతం దోపిడి చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసుకున్నారని, సంపూర్ణ మద్య నిషేధం అనే హామీని కమిషన్ల కోసం వాడుకుంటోందని కన్నా ధ్వజమెత్తారు.

 

Leave a Reply