వేగంగా మారుతున్న మహా రాజకీయం: ప్రభుత్వం ఏర్పాటులో ట్విస్ట్…

Maharashtra polls 2019: BJP-Shiv Sena announce seat-share
Share Icons:

ముంబై:  మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలొచ్చి దాదాపు 18 రోజులు అవుతుంది. కానీ ఇంతవరకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు జరగలేదు. బీజేపీతో 50:50 ఫార్ములా ప్రకారం సీఎం పదవిని పంచుకోవాల్సిందేనని శివసేన భీష్మించుకుంది. దీంతో కొన్ని రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన నెలకొంది. అటు తాజాగా ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో గవర్నర్ కోషియార్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీని ఆహ్వానించారు. అయితే తమ మిత్రపక్షమైన శివసేన అంగీకరించడం లేదని, తమవద్ద తగిన సంఖ్యా బలం లేదని బీజేపీ గవర్నర్‌కు తేల్చి చెప్పేసింది. దీంతో బీజేపీ, శివసేన కూటమికి బీటలు వారింది.

అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో బీజేపీ చేతులెత్తేయడంతో గవర్నర్ రెండో అతి పెద్ద పార్టీ అయిన శివసేనని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేస్తారో లేదో సోమవారం రాత్రి 7.30లోపు తెలపాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ శివసేనకు సూచించారు. ఈ నేపథ్యంలో శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే… శివసేనతో కలిసేందుకు ఎన్సీపీ కొన్ని షరతులతో ఓకే అంటోంది. అదే సమయంలో… కాంగ్రెస్ కొన్ని షరతులతో బయటి నుంచీ మద్దతిస్తామని అంటోంది. అందువల్ల శివసేన తగినంత సంఖ్యాబలం లేకపోయినా… మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

కాకపోతే మొన్నటి ఎన్నికల ప్రచారంలో శివసేన, ఎన్సీపీ అత్యంత దారుణంగా దుమ్మెత్తి పోసుకున్నాయి. ఇప్పుడా రెండు పార్టీలూ చేతులు కలిపితే… ప్రజాస్వామ్యానికి అంతకంటే దారుణం ఇంకోటి ఉండదని బీజేపీ ఫైర్ అవుతోంది. దమ్ముంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యమని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్… శివసేనకు సవాల్ విసిరారు.

అసలు మహారాష్ట్రలో ఉన్న లెక్కలని పరిశీలిస్తే ఆ రాష్ట్రంలో అసెంబ్లీలో సీట్ల సంఖ్య 288. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 145. బీజేపీకి 105 సీట్లు వచ్చాయి. శివసేనకు 56 స్థానాలు దక్కాయి. అవి రెండూ కలిసి ఉండి ఉంటే… అవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవి. ఇప్పుడు సీన్ మారింది కాబట్టి… బీజేపీని పక్కన పెడదాం. ఎన్సీపీకి 54 సీట్లు రాగా… కాంగ్రెస్‌కి 44 వచ్చాయి. అందువల్ల శివసేన ఎన్సీపీ కలిస్తే (56+54) మొత్తం సీట్ల సంఖ్య 110 అవుతుంది. కాంగ్రెస్ బయటి నుంచీ మద్దతిస్తానంది కాబట్టి… కాంగ్రెస్‌తో కలిపి ప్రభుత్వ సంఖ్యా బలం (110+44) 154 అవుతుంది. అందువల్ల శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

సీఎం సీటు సగం-సగం

ఇదిలా ఉంటే శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే… సీఎం సీటుపై కన్నేశారు. అందువల్ల ఆ సీటుపై ఆయనే కూర్చునే అవకాశాలు ఉన్నాయి. నెక్ట్స్ ఉప ముఖ్యమంత్రి సీటుపై ఎన్సీపీ కన్నేసింది. అందువల్ల ఆ సీటును ఎన్సీపీకి ఇచ్చే ఛాన్సుంది. అదే జరిగితే… ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కొడుకు అజిత్ పవార్… డిప్యూటీ సీఎం అయ్యే ఛాన్సుంది. అలాగే ఎన్సీపీ… శివసేన ఎన్‌డి‌ఏ నుంచీ బయటకు రావాలనే కండీషన్ కూడా పెట్టింది. దీనిపై శివసేన ఆలోచిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవికి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామా చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాము కేంద్ర కేబినెట్‌లో కొనసాగలేమని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర పరిణామాలపై కొందరు లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని, శివసేనదే సరైన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

 

Leave a Reply