బాబు…అప్పుడే కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం…

Kanna lakshmi narayana comments on cm chandrababu
Share Icons:

గుంటూరు, 4 అక్టోబర్: 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌తోనే చంద్రబాబు జతకట్టారని, తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ…విభజన సమయంలోనే కాంగ్రెస్‌తో.. చంద్రబాబు లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు.

ఇక రాష్ట్రానికి చంద్రబాబు సైంధవుడని, రాయలసీమలో అభివృద్ధి జరగలేదని ఛాలెంజ్ చేసి చెబుతున్నానని, రాయలసీమలో అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని కన్నా సవాల్ చేశారు.

రాష్ట్రంలో అభివృద్ధి చాలా చేశామని చెప్పడం తెలుగుదేశం పార్టీకి బాగా అలవాటైపోయిందని, ఏం చేశారో చెప్పరని, చాలా చేశామంటారని ఆయన ఎద్దేవా చేశారు.  కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ జిల్లానూ అభివృద్ధి చేయలేదని, రాజధాని పేరుతో వ్యాపారం చేస్తున్నారని కన్నా విమర్శించారు.

మామాట: మరి బాబుతో నాలుగేళ్ళు మీరు అంటకాగినప్పుడు గుర్తు రాలేదా….

Leave a Reply