తమిళనాడులో బీజేపీ సరికొత్త వ్యూహం: రజనీకాంత్ కు బంపర్ ఆఫర్…

astrologer balaji comments on rajanikanth
Share Icons:

చెన్నై:

 

దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ తమిళనాడులో సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేందుకు చూస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకె పార్టీతో కలిసి వెళుతున్న బీజేపీ… సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆకర్షించేందుకు ఎప్పటి నుంచో యత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు బీజేపీ చీఫ్ అమిత్ షా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

బీజేపీలో చేరితే తమిళనాడు పార్టీ పగ్గాలను అప్పగించడమే కాకుండా… ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని అమిత్ షా చెప్పినట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలతో తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. అయితే రజనీ కాంత్ అంతకముందు కొత్త పార్టీ పెడతారని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో రజని ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా ప్రధాని మోదీ, అమిత్ షాలు వ్యూహరచన చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై వారు మరింత ఫోకస్ చేస్తున్నారు.

 

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా రజనీకాంత్ పోల్చిన సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో మోదీ, షా ద్వయం తీసుకున్న నిర్ణయాలను రజనీ ఆకాశానికెత్తేశారు. ఈ నేపథ్యంలో, బీజేపీ పట్ల రజనీ సానుకూల ధోరణితో ఉన్నారనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రజనీ తమతో చేయి కలిపితే… తమిళనాట పాగా వేయవచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు

Leave a Reply